MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • IPL ఎంట్రీకి ముందే 40 సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు.. క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ !

IPL ఎంట్రీకి ముందే 40 సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు.. క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ !

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్‌తో సంచలనం సృష్టిస్తున్నాడు. సునామీ ఆటతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. అయితే, అతనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 13 2026, 07:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Vaibhav Suryavanshi : ఐపీఎల్ రాకముందే ఇన్ని సెంచరీలా?
Image Credit : BCCI

Vaibhav Suryavanshi : ఐపీఎల్ రాకముందే ఇన్ని సెంచరీలా?

భారత క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒక పేరు మార్మోగిపోతోంది. అతడే బీహార్‌కు చెందిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ 2026లో తన బ్యాటింగ్‌తో దిగ్గజ బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. ఆటబొమ్మలతో ఆడుకోవాల్సిన వయసులో, మైదానంలో పరుగుల వరద పారిస్తూ 'ఆరెంజ్ క్యాప్'ను కైవసం చేసుకున్నాడు. వైభవ్ ఆడుతున్న తీరు చూస్తుంటే సాక్షాత్తు సచిన్ టెండూల్కర్‌ను గుర్తుకు తెస్తున్నాడని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో కొనియాడుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బుమ్రా, హెజల్‌వుడ్ బౌలింగ్‌లో ఊచకోత
Image Credit : ANI

బుమ్రా, హెజల్‌వుడ్ బౌలింగ్‌లో ఊచకోత

ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు జరిగిన 4 మ్యాచ్‌ల్లో వైభవ్ 200కు పైగా స్ట్రైక్ రేట్‌తో 200 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. రాజస్థాన్ రాయల్స్ వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలవడంలో ఈ కుర్రాడిది కీలక పాత్ర. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లుగా పేరుగాంచిన జస్ప్రీత్ బుమ్రా, జోష్ హెజల్‌వుడ్ వంటి వారిని వైభవ్ లెక్క చేయడం లేదు. బుమ్రా వేసిన తొలి బంతినే సిక్సర్‌ బాదడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక హెజల్‌వుడ్ వేసిన ఒకే ఓవర్‌లో ఏకంగా 18 పరుగులు రాబట్టాడు. ఆర్‌సీబీపై జరిగిన మ్యాచ్‌లో కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు.

Related Articles

Related image1
Sohail Tanvir : ఐపీఎల్ పర్పుల్ క్యాప్ విన్నర్.. 904 వికెట్లు తీసినా కనుమరుగైన స్టార్ పేసర్
Related image2
Gill : లారా 400 రన్స్ రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా స్టార్ బ్యాటర్
35
చిన్న వయసులోనే 40 సెంచరీలు
Image Credit : Getty

చిన్న వయసులోనే 40 సెంచరీలు

వైభవ్ సూర్యవంశీ ప్రతిభ ఈనాటిది కాదు. 10-12 ఏళ్ల వయసులోనే అతను బౌలర్లతో ఆటాడుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పాత వీడియో (2023) ప్రకారం, అప్పటికే అతను 40 సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు బాదినట్లు స్వయంగా వెల్లడించాడు. బీహార్‌లో జరిగిన ఒక లోకల్ టోర్నమెంట్‌లో వైభవ్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్న దృశ్యాలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆ చిన్న వయసులోనే అతను చూపించిన పరిణతి ఇప్పుడు ఐపీఎల్ లో కనిపిస్తోంది.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shahnawaz Review (@shahnawazreview)

45
రికార్డుల వేటలో వైభవ్ సూర్యవంశీ
Image Credit : Getty

రికార్డుల వేటలో వైభవ్ సూర్యవంశీ

వైభవ్ సూర్యవంశీ కేవలం 14 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన అతను 229.44 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 452 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ఒక భారతీయ బ్యాటర్ చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీ (35 బంతుల్లో) రికార్డు కూడా వైభవ్ పేరు మీదనే ఉంది. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లపై కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు పూర్తి చేసి రికార్డు సృష్టించాడు.

55
టీమ్ ఇండియాలోకి ఎంట్రీ ఎప్పుడు?
Image Credit : Getty

టీమ్ ఇండియాలోకి ఎంట్రీ ఎప్పుడు?

వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన చూసి అతడిని వెంటనే టీమ్ ఇండియాలోకి తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సచిన్ టెండూల్కర్ లాగే వైభవ్ కూడా టీనేజ్‌లోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే, నిపుణులు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అతి చిన్న వయసులో ఒత్తిడి పెరగడం వల్ల కెరీర్ దెబ్బతినే అవకాశం ఉందని, అతడిని ఒక క్రమ పద్ధతిలో తీర్చిదిద్దాలని వారు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, విరాట్ కోహ్లీ తర్వాత భారత క్రికెట్‌లో వైభవ్ ఒక కొత్త ఐకాన్‌గా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image2
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Recommended image3
AUS vs BAN : రెండు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ఖతం.. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా రివెంజ్ విజయం
Related Stories
Recommended image1
Sohail Tanvir : ఐపీఎల్ పర్పుల్ క్యాప్ విన్నర్.. 904 వికెట్లు తీసినా కనుమరుగైన స్టార్ పేసర్
Recommended image2
Gill : లారా 400 రన్స్ రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా స్టార్ బ్యాటర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved