MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • IPL 2026 : వరుస ఓటములు.. ముంబై ఇండియన్స్‌కు ఏమైంది? అసలు కారణాలివే

IPL 2026 : వరుస ఓటములు.. ముంబై ఇండియన్స్‌కు ఏమైంది? అసలు కారణాలివే

Mumbai Indians : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ వరుసగా మూడు ఓటములతో సతమతమవుతోంది. బౌలింగ్ వైఫల్యాలు, రోహిత్ శర్మ గాయం, బ్యాటింగ్ విభాగం విఫలం కావడం వంటి కారణాలు జట్టును పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పడేశాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 13 2026, 06:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
షాక్ లో ముంబై ఇండియన్స్.. ఏమైంది రోహిత్ భయ్యా
Image Credit : Screengrab

షాక్ లో ముంబై ఇండియన్స్.. ఏమైంది రోహిత్ భయ్యా

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పరిస్థితి విచిత్రంగా మారింది. బ్యాటింగ్, బౌలింగ్ లో బలమైన జట్టుగా కనిపిస్తున్నప్పటికీ విజయాలు మాత్రం దక్కడం లేదు. కోల్‌కతా నైట్ రైడర్స్ పై ఘనవిజయంతో టోర్నీని ఆరంభించిన ఈ జట్టు, ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓటమి పాలై అభిమానులను నిరాశకు గురిచేసింది. 

ప్రస్తుతం ఆడిన 4 మ్యాచ్‌ల్లో కేవలం 1 విజయం సాధించి, 3 ఓటములతో పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి పడిపోయింది. ఈ వరుస ఓటములకు దారితీసిన ప్రధాన కారణాలను గమనిస్తే.. పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

26
బౌలింగ్ దళం వైఫల్యం : బుమ్రాకు వికెట్ల కరవు
Image Credit : Gemini

బౌలింగ్ దళం వైఫల్యం : బుమ్రాకు వికెట్ల కరవు

ముంబై ఇండియన్స్ ప్రధాన బలం వారి బౌలింగ్ దళం. కానీ ఈ సీజన్‌లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ముఖ్యంగా జట్టు నమ్మకస్తుడైన జస్ప్రీత్ బుమ్రా గత నాలుగు మ్యాచ్‌లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బుమ్రా తక్కువ పరుగులు ఇస్తున్నప్పటికీ, కీలక సమయంలో వికెట్లు తీయలేకపోవడం జట్టుపై ఒత్తిడి పెంచుతోంది. ఏప్రిల్ 12న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఏకంగా 240 పరుగులు సమర్పించుకుంది. పవర్‌ప్లేలో ప్రత్యర్థిని అడ్డుకోవడంలో విఫలమవుతున్నామని కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా అంగీకరించారు. శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మయాంక్ మార్కండే వంటి బౌలర్లు వాంఖడే వంటి హై స్కోరింగ్ మైదానాల్లో పరుగులు కట్టడి చేయలేక చేతులెత్తేస్తున్నారు.

Related Articles

Related image1
IPL ఎంట్రీకి ముందే 40 సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు.. క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ !
Related image2
Gill : లారా 400 రన్స్ రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా స్టార్ బ్యాటర్
36
రోహిత్ శర్మ గాయం.. జట్టులో ఆందోళన
Image Credit : Getty

రోహిత్ శర్మ గాయం.. జట్టులో ఆందోళన

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ముంబైకి పెద్ద షాక్ తగిలింది. 241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సమయంలో, 5వ ఓవర్లోనే రోహిత్ శర్మ తన హామ్‌స్ట్రింగ్ గాయంతో రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ చేరాడు. దీనివల్ల భారీ ఛేజింగ్‌లో ముంబైకి సరైన ఆరంభం లేకుండా పోయింది. రోహిత్ లేకపోవడంతో మిడిలార్డర్ బ్యాటర్లపై అదనపు భారం పడింది. రాబోయే మ్యాచ్‌లకు రోహిత్ అందుబాటులో ఉంటాడా లేదా అనే అనిశ్చితి జట్టును మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

46
బ్యాటింగ్ వైఫల్యం.. నిలకడలేమి దెబ్బ
Image Credit : ANI

బ్యాటింగ్ వైఫల్యం.. నిలకడలేమి దెబ్బ

బ్యాటింగ్ విభాగంలోనూ ముంబై తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కేవలం 11 ఓవర్ల ఆటలో మొదటి 5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి కుప్పకూలారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా కెప్టెన్ చెప్పినట్లుగా, జట్టు 15-20 పరుగులు తక్కువగా చేసింది. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ వంటి ప్లేయర్లు అర్ధసెంచరీలతో రాణించినా, మిగతా టాప్ ఆర్డర్ బ్యాటర్లు రియాన్ రికెల్టన్ వంటి వారు ఆరంభంలో చూపిన జోరును కొనసాగించలేకపోతున్నారు.

56
నాయకత్వ మార్పులతో జట్టులో అస్థిరత
Image Credit : Getty

నాయకత్వ మార్పులతో జట్టులో అస్థిరత

ఈ సీజన్‌లో ముంబై నాయకత్వ బాధ్యతల్లో కూడా అస్థిరత కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యా లేకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌కు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించారు. హార్దిక్ మళ్ళీ జట్టులోకి వచ్చినప్పటికీ, జట్టు వ్యూహాలు ఏవీ ఫలించడం లేదు. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు అసలు పని చేయడం లేదని, వ్యూహాలను పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందని హార్దిక్ స్వయంగా పేర్కొనడం జట్టులో ఉన్న గందరగోళాన్ని సూచిస్తోంది.

66
ముంబై ప్రయాణం ఎటువైపు?
Image Credit : MI\Instagram

ముంబై ప్రయాణం ఎటువైపు?

సోమవారం నాటికి ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. జట్టు తిరిగి గెలుపు బాట పట్టాలంటే అన్ని విభాగాల్లో కలిసికట్టుగా రాణించాల్సి ఉంది. ముఖ్యంగా బౌలర్లు వికెట్లు తీయడం, రోహిత్ శర్మ కోలుకోవడం ముంబైకి అత్యంత కీలకం. ముంబై ఇండియన్స్ తన తదుపరి పోరులో ఏప్రిల్ 16న వాంఖడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌ను ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్‌లోనైనా ముంబై గెలిచి తమ అభిమానుల్లో ఆశలు చిగురింపజేస్తుందో లేదో చూడాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL చరిత్రలో మొదటి బంతి ఆడింది, వేసింది, క్యాచ్ పట్టింది, సెంచరీ చేసింది ఎవరు..? పాకిస్థానీ క్రికెటర్ పేరిట అద్భుత రికార్డు
Recommended image2
ICC: టెస్ట్ క్రికెట్‌లో బిగ్ చేంజ్.. 12 జట్లతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్.. ఐసీసీ సంచలన నిర్ణయం.!
Recommended image3
IPL ఎంట్రీకి ముందే 40 సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు.. క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ !
Related Stories
Recommended image1
IPL ఎంట్రీకి ముందే 40 సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు.. క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ !
Recommended image2
Gill : లారా 400 రన్స్ రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా స్టార్ బ్యాటర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved