MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • SRH ప్లాన్ అదిరిందిగా ! సన్‌రైజర్స్ హైదరాబాద్ లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

SRH ప్లాన్ అదిరిందిగా ! సన్‌రైజర్స్ హైదరాబాద్ లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

IPL SRH : ఐపీఎల్ 2026లో పాట్ కమిన్స్ దూరం కావడంతో ఇషాన్ కిషన్ సారథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగుతోంది. అయితే, కొన్ని విషయాలు హైదరాబాద్ టీమ్ ను భయపెడుతున్నాయి. ఎస్ఆర్హెచ్ బలాబలాలు, బలహీనతల ఏంటో మీకు తెలుసా?

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 23 2026, 08:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇషాన్ కిషన్ సారథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్.. కప్పు కొట్టే సత్తా ఉందా?
Image Credit : SRH\Instagram

ఇషాన్ కిషన్ సారథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్.. కప్పు కొట్టే సత్తా ఉందా?

ఐపీఎల్ 2026 సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) సరికొత్త వ్యూహాలతో, కొత్త కెప్టెన్ నాయకత్వంలో బరిలోకి దిగుతోంది. జట్టు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్నునొప్పితో దూరం కావడంతో, యంగ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు తాత్కాలికంగా సారథ్య బాధ్యతలు దక్కాయి. గత సీజన్‌లో నిరాశపరిచిన ఆరెంజ్ ఆర్మీ, ఈసారి ఇషాన్ నాయకత్వంలో ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎస్ఆర్హెచ్ బలాలు, బలహీనతలు, కప్ గెలిచే అవకాశాలు, టీమ్ ముందున్న సవాళ్లు గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఇషాన్ కిషన్ నాయకత్వంలో కొత్త జోష్
Image Credit : Getty

ఇషాన్ కిషన్ నాయకత్వంలో కొత్త జోష్

జట్టులో కీలక మార్పులతో ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ ఆరంభించబోతోంది. జార్ఖండ్ తరపున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలిపించిన అనుభవం ఇషాన్ కిషన్‌కు ఉంది. భారత జట్టు టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను నిలబెట్టుకోవడంలో కూడా అతను కీలక పాత్ర పోషించాడు. గతంలో సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన దశ నుంచి నేడు ఐపీఎల్ జట్టుకు కెప్టెన్ అయ్యే స్థాయికి ఇషాన్ ఎదిగాడు. కప్ గెలిచే జట్టుగా ఎస్ఆర్హెచ్ ను గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఇప్పుడు అతనిపై ఉంది. కెప్టెన్‌గా తనను తాను నిరూపించుకోవడానికి ఇది ఇషాన్‌కు గొప్ప అవకాశం.

Related Articles

Related image1
IPL : స్టేజ్ పై హార్దిక్, సూర్య.. అభిమానుల రచ్చ.. రోహిత్ ఎంట్రీతో సీన్ మారిపోయింది !
Related image2
IPL 2026 రద్దవుతుందా? యుద్ధం సెగతో క్రికెట్ అభిమానుల్లో టెన్షన్ !
36
బలమైన బ్యాటింగ్ లైనప్: ఎస్ఆర్హెచ్ అసలు ఆయుధం ఇదే
Image Credit : SRH Instagram

బలమైన బ్యాటింగ్ లైనప్: ఎస్ఆర్హెచ్ అసలు ఆయుధం ఇదే

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అతిపెద్ద బలం వారి బ్యాటింగ్ డెప్త్. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టోన్, నితీష్ రెడ్డి, అనికేత్ వర్మ వంటి విధ్వంసకర ఆటగాళ్లతో బ్యాటింగ్ లైనప్ ఎంతో బలంగా కనిపిస్తోంది. యువ ఆటగాడు రవిచంద్రన్ స్మరణ్ వంటి టాలెంటెడ్ ప్లేయర్‌కే ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం లేదంటే వారి బ్యాటింగ్ బలం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా వేలంలో కొనుగోలు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్ మిడిల్ ఆర్డర్‌లో భారీ హిట్టింగ్‌తో జట్టుకు అదనపు బలాన్ని ఇవ్వనున్నాడు.

46
బౌలింగ్‌లో లోపాలు: ఎస్ఆర్హెచ్ లో కమిన్స్ లేని లోటు కనిపిస్తుందా?
Image Credit : X/SunRisers

బౌలింగ్‌లో లోపాలు: ఎస్ఆర్హెచ్ లో కమిన్స్ లేని లోటు కనిపిస్తుందా?

బ్యాటింగ్ విభాగం బలంగా ఉన్నా, బౌలింగ్ విషయంలో ఎస్ఆర్హెచ్ ఆందోళన చెందుతోంది. కెప్టెన్ పాట్ కమిన్స్ లేకపోవడం జట్టు పేస్ విభాగాన్ని బలహీనపరిచింది. ఇప్పుడు ఇషాన్ మలింగ, బ్రైడన్ కార్సే, జయదేవ్ ఉనద్కత్ వంటి వారు బౌలింగ్ భారాన్ని మోయాల్సి ఉంటుంది. మలింగ తన ఆఫ్-కట్టర్లతో, కార్సే తన వేగంతో ప్రత్యర్థులను కట్టడి చేయాలని చూస్తున్నారు. స్పిన్ విభాగంలో జీషన్ అన్సారీ గత సీజన్‌లో రాణించినా, ఫీల్డర్ల సపోర్టు లేక వికెట్లు తీయలేకపోయారు. శివాంగ్ కుమార్, క్రెయిన్స్ ఫులేత్రా వంటి లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్లు ఉన్నప్పటికీ, ఇతర జట్లతో పోలిస్తే ఎస్ఆర్హెచ్ బౌలింగ్‌లో ఆ పదును తక్కువగా కనిపిస్తోంది.

56
ఎస్ఆర్హెచ్ గెలుపు అవకాశాలు: 2025 చేదు జ్ఞాపకాలను చెరిపివేసే సమయం ఇది
Image Credit : Getty

ఎస్ఆర్హెచ్ గెలుపు అవకాశాలు: 2025 చేదు జ్ఞాపకాలను చెరిపివేసే సమయం ఇది

2026 సీజన్ సన్‌రైజర్స్‌కు తమ సత్తా చాటడానికి ఒక బంగారు అవకాశం. గత సీజన్ వైఫల్యాలను మర్చిపోయి కొత్త చరిత్ర సృష్టించేందుకు జట్టు సిద్ధంగా ఉంది. టాప్ ఆర్డర్‌లో అభిషేక్, హెడ్ ఇచ్చే మెరుపు ఆరంభాలను మిడిల్ ఆర్డర్ సద్వినియోగం చేసుకుంటే ఎస్‌ఆర్‌హెచ్‌ను ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. అలాగే, ఇషాన్ కిషన్ తన కెప్టెన్సీ నైపుణ్యాలను నిరూపించుకుంటే, భవిష్యత్తులో అతను జట్టుకు శాశ్వత కెప్టెన్‌గా మారే అవకాశం ఉంది. బ్యాటింగ్ క్లిక్ అయితే ఈ సీజన్‌లో అత్యంత ప్రమాదకరమైన జట్టుగా ఎస్ఆర్హెచ్ అవతరిస్తుంది.

66
ఎస్ఆర్హెచ్ ముందున్న సవాళ్లు: భారీ స్కోర్లు చేసినా డిఫెండ్ చేసుకోగలరా?
Image Credit : SRH Twitter

ఎస్ఆర్హెచ్ ముందున్న సవాళ్లు: భారీ స్కోర్లు చేసినా డిఫెండ్ చేసుకోగలరా?

ఎస్ఆర్హెచ్ ఎదుర్కోవాల్సిన ప్రధాన సవాలు బౌలింగ్ వైఫల్యం. బ్యాటర్లు భారీ స్కోర్లు సాధించినప్పటికీ, బౌలర్లు వాటిని కాపాడుకోలేకపోతే జట్టుకు ఇబ్బందులు తప్పవు. గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ వంటి జట్లు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లోపాలను క్లియర్ గా ఎండగట్టాయి. ఒత్తిడిలో జట్టు కుప్పకూలే అలవాటు కూడా మరో ఆందోళన కలిగించే అంశం. కమిన్స్ వంటి అనుభవజ్ఞుడైన నాయకుడు మైదానంలో లేకపోవడం వ్యూహాల అమలులో లోపాలకు దారితీయవచ్చు. వీటిని అధిగమిస్తేనే హైదరాబాద్ ప్లేఆఫ్స్ రేసులో నిలుస్తుంది.

ఎస్ఆర్హెచ్ బెస్ట్ ప్లేయింగ్ 11

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్/కీపర్), నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టోన్, అనికేత్ వర్మ, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగ/బ్రైడన్ కార్సే, జయదేవ్ ఉనద్కత్.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
క్రీడలు
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image2
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image3
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Related Stories
Recommended image1
IPL : స్టేజ్ పై హార్దిక్, సూర్య.. అభిమానుల రచ్చ.. రోహిత్ ఎంట్రీతో సీన్ మారిపోయింది !
Recommended image2
IPL 2026 రద్దవుతుందా? యుద్ధం సెగతో క్రికెట్ అభిమానుల్లో టెన్షన్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved