MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • SRH స్టార్ విధ్వంసం.. అరుదైన రికార్డు ట్రావిస్ హెడ్ సొంతం !

SRH స్టార్ విధ్వంసం.. అరుదైన రికార్డు ట్రావిస్ హెడ్ సొంతం !

Travis Head Steve Smith : సిడ్నీ టెస్టులో స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ సెంచరీలతో చెలరేగడంతో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం సాధించింది. హెడ్, స్మిత్ పలు చారిత్రక రికార్డులను బద్దలు కొట్టారు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 06 2026, 03:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
యాషెస్ సిరీస్: స్మిత్, ట్రావిస్ హెడ్ సెంచరీల మోత.. ఆసీస్ భారీ ఆధిక్యం, బద్దలైన రికార్డులివే!
Image Credit : Getty

యాషెస్ సిరీస్: స్మిత్, ట్రావిస్ హెడ్ సెంచరీల మోత.. ఆసీస్ భారీ ఆధిక్యం, బద్దలైన రికార్డులివే!

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతున్న 2025-26 యాషెస్ సిరీస్‌ ఐదో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ఇప్పటికే 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకున్న ఆసీస్, చివరి మ్యాచ్‌లోనూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు (384) కంటే 134 పరుగుల ఆధిక్యం సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ అద్భుత సెంచరీలతో ఆసీస్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
హెడ్, స్మిత్ సెంచరీల మోత
Image Credit : AFP

హెడ్, స్మిత్ సెంచరీల మోత

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్ (160) రాణించడంతో 384 పరుగులు చేసింది. దీనికి దీటుగా బదులిచ్చిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ట్రావిస్ హెడ్ కేవలం 105 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అతను మొత్తం 163 పరుగులు చేసి ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

మరోవైపు, స్టీవ్ స్మిత్ తనదైన శైలిలో నిలకడగా ఆడుతూ 129 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి భాగస్వామ్యం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. స్మిత్ క్రీజులో పాతుకుపోయి, బౌలర్లను విసిగిస్తూ పరుగులు రాబట్టాడు. బ్యూ వెబ్‌స్టర్ 42 పరుగులతో స్మిత్‌కు సహకారం అందిస్తూ క్రీజులో ఉన్నాడు.

36
ట్రావిస్ హెడ్ అరుదైన రికార్డులు
Image Credit : ANI

ట్రావిస్ హెడ్ అరుదైన రికార్డులు

ఈ సిరీస్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న ట్రావిస్ హెడ్, పెర్త్ (123), అడిలైడ్ (170) తర్వాత సిడ్నీలో మూడో సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తో హెడ్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు..

  1. సిరీస్‌లో 500 పరుగులు: 21వ శతాబ్దంలో ఒకే యాషెస్ సిరీస్‌లో 500కు పైగా పరుగులు చేసిన రెండో ఆస్ట్రేలియా ఆటగాడిగా హెడ్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు 2013-14లో డేవిడ్ వార్నర్ ఈ ఘనత సాధించాడు.
  2. అన్ని గ్రౌండ్ లలో సెంచరీలు : ఆస్ట్రేలియాలోని ఏడు ప్రధాన గ్రౌండ్ లలో టెస్ట్ సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా హెడ్ నిలిచాడు. స్టీవ్ వా, మాథ్యూ హేడెన్, జస్టిన్ లాంగర్, డేవిడ్ వార్నర్ సరసన అతను చేరాడు.
  3. వేగవంతమైన 150: హెడ్ తన 150 పరుగుల మార్కును 152 బంతుల్లో చేరుకున్నాడు. ఇది 2001 తర్వాత యాషెస్‌లో మూడో అత్యంత వేగవంతమైన 150 రికార్డు.
46
స్టీవ్ స్మిత్ చారిత్రక మైలురాళ్లు
Image Credit : Getty

స్టీవ్ స్మిత్ చారిత్రక మైలురాళ్లు

పరుగుల యంత్రం స్టీవ్ స్మిత్ ఈ మ్యాచ్‌లో తన టెస్ట్ కెరీర్‌లో 37వ సెంచరీని నమోదు చేశాడు.

  1. ద్రవిడ్ రికార్డు బద్దలు: 37వ సెంచరీతో స్మిత్, భారత లెజెండ్ రాహుల్ ద్రవిడ్ (36) సెంచరీల రికార్డును అధిగమించాడు.
  2. బ్రాడ్‌మన్ తర్వాత స్మిత్: యాషెస్ చరిత్రలో అత్యధిక సెంచరీల జాబితాలో స్మిత్ రెండో స్థానానికి ఎగబాకాడు. స్మిత్ ఇప్పటివరకు యాషెస్‌లో 13 సెంచరీలు చేయగా, డాన్ బ్రాడ్‌మన్ 19 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నారు. జాక్ హాబ్స్ (12) రికార్డును స్మిత్ అధిగమించాడు.
  3. పరుగుల ప్రవాహం: యాషెస్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కూడా స్మిత్ (3682 పరుగులు) నిలిచాడు. ఇక్కడ కూడా అతను డాన్ బ్రాడ్‌మన్ (5028) తర్వాత స్థానంలో ఉన్నాడు.
56
ఇంగ్లండ్ బౌలర్ల పోరాటం.. ఖవాజా వీడ్కోలు
Image Credit : Getty

ఇంగ్లండ్ బౌలర్ల పోరాటం.. ఖవాజా వీడ్కోలు

ఇంగ్లండ్ బౌలర్లలో పార్ట్ టైమ్ స్పిన్నర్ జాకబ్ బెతెల్, ట్రావిస్ హెడ్ వికెట్ తీసి ఇంగ్లండ్‌కు ఊరటనిచ్చాడు. స్వీప్ షాట్ ఆడబోయి హెడ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక తన కెరీర్‌లో చివరి (88వ) టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఉస్మాన్ ఖవాజా 17 పరుగులు చేసి బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అలెక్స్ క్యారీ 16, కామెరాన్ గ్రీన్ 37, నైట్ వాచ్‌మెన్ మైఖేల్ నెసెర్ 24 పరుగుల వద్ద పెవిలియన్ చేరారు. బ్రైడన్ కార్స్ కీలక సమయాల్లో వికెట్లు తీసినప్పటికీ, ఆస్ట్రేలియా స్కోరు వేగాన్ని అడ్డుకోలేకపోయాడు.

66
మ్యాచ్ పై ఆసీస్ పట్టు
Image Credit : Getty

మ్యాచ్ పై ఆసీస్ పట్టు

ప్రస్తుతం ఆస్ట్రేలియా 134 పరుగుల పటిష్ఠ ఆధిక్యంలో ఉంది. చేతిలో ఇంకా 3 వికెట్లు ఉన్నాయి. మెల్బోర్న్‌లో జరిగిన గత టెస్టులో ఇంగ్లండ్ గెలిచినప్పటికీ, సిడ్నీలో ఆసీస్ మళ్లీ పుంజుకుంది. స్టీవ్ స్మిత్ ఇంకా క్రీజులో ఉండటం ఆస్ట్రేలియాకు కలిసొచ్చే అంశం. నాలుగో రోజు ఆస్ట్రేలియా ఎంత ఆధిక్యం సాధించి డిక్లేర్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో తిరిగి పుంజుకోవాలంటే అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాద్‌ టీ20 మ్యాచ్‌కు ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ టైటిల్‌ స్పాన్సర్‌.. ఉప్పల్‌లో భారీ భద్రత
Recommended image2
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image3
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Related Stories
Recommended image1
ODI Cricket : అత్యంత వేగంగా 11000 పరుగులు చేసిన టాప్ 5 దిగ్గజాలు వీరే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved