- Home
- Entertainment
- Anirudh Kavya Wedding: అనిరుధ్ కావ్య మారన్ పెళ్లి కార్డు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? వైరల్ అవుతున్న విశేషాలు
Anirudh Kavya Wedding: అనిరుధ్ కావ్య మారన్ పెళ్లి కార్డు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? వైరల్ అవుతున్న విశేషాలు
Kavya Maran Wedding: అనిరుధ్, ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ పెళ్లి ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రీస్‌లో నవంబర్ 10, 11 తేదీల్లో వివాహం జరగనుండగా, సుమారు రూ.20 వేల వ్యయంతో రూపొందించిన ఈ ప్రత్యేక వింటేజ్ బాక్స్ విశేషాలు ఇవే..

ట్రెండింగ్‌లో అనిరుధ్ - కావ్య మారన్ పెళ్లి సందడి
సౌత్ ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా పేరు తెచ్చుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమానురాలు కావ్య మారన్ వివాహం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది. సినిమా, క్రికెట్ రంగాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ జోడీ ఒక్కటి కాబోతుండటంతో అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
ఈ హై-ప్రొఫైల్ వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే జోరుగా సాగుతుండగా, తాజాగా వీరు అందిస్తున్న పెళ్లి ఆహ్వాన పత్రిక ఇంటర్నెట్లో ట్రెండ్‌గా మారింది. సాధారణ పెళ్లి కార్డులలా కాకుండా, అత్యంత విలాసవంతంగా, రాయల్ లుక్‌లో దీన్ని తీర్చిదిద్దడం విశేషం.
రాజభవనాన్ని తలపించేలా 3డీ డిజైన్
ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్‌ను ప్రముఖ డిజైన్ హౌస్ 'పింక్ విజిల్ మ్యాన్' అధినేత్రి రంజని అయ్యంగార్ రూపొందించారు. 17వ శతాబ్దపు ఐరోపా రాజభవనాల నిర్మాణ శైలి అయిన బరోక్ ఆర్కిటెక్చర్ నుంచి స్ఫూర్తి పొంది ఈ బాక్స్‌ను డిజైన్ చేశారు. పౌడర్ బ్లూ, ఐవరీ, సిల్వర్ రంగుల కలయికతో అద్భుతమైన 3డీ ఎలిమెంట్స్‌ను ఇందులో జోడించారు.
కేవలం కాగితంలా కాకుండా, ఒక అరుదైన వింటేజ్ కళాఖండంలా కనిపించే ఈ చెక్క పెట్టె తయారీకి ఒక్కో దానికి సుమారు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది.
గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్.. చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్
రిపోర్టుల ప్రకారం.. ఈ జంట నవంబర్ 10, 11 తేదీల్లో యూరప్‌లోని గ్రీస్ దేశంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకోనున్నారు. గ్రీస్ జాతీయ జెండా రంగుల థీమ్‌ను పోలినట్లుగానే ఈ ఆహ్వాన పత్రికను కూడా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో తీర్చిదిద్దడం మరో విశేషం. ఆ తర్వాత నవంబర్ 21న చెన్నైలోని ఒక ప్రతిష్ఠాత్మక హోటల్లో సినీ, రాజకీయ, వ్యాపార రంగాల దిగ్గజాల కోసం అంగరంగ వైభవంగా రిసెప్షన్ వేడుకను నిర్వహించనున్నారు.
మూడు నెలల శ్రమ.. జ్ఞాపికగా ఉండేలా డిజైన్
ఈ ఆహ్వాన పత్రిక రూపకల్పన వెనుక పెద్ద కసరత్తే జరిగింది. డిజైన్ ఆలోచన రావడానికి వారం రోజులు పట్టినప్పటికీ, దానికి తుది రూపం ఇవ్వడానికి డిజైనర్ బృందానికి దాదాపు మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టిందని డిజైనర్ చెప్పారు. పెళ్లి తంతు ముగిసిన తర్వాత అతిథులు దీన్ని పడేయకుండా, ఇంట్లో ఓ చక్కటి జ్ఞాపికగా దాచుకునేలా దీన్ని ప్రత్యేకంగా తయారుచేశారు. ఈ డిజైనింగ్ పనుల్లో అనిరుధ్, కావ్య స్వయంగా పాలుపంచుకుంటూ తమ సలహాలు, సూచనలు అందించినట్లు డిజైనర్ వెల్లడించారు.
నెట్టింట వైరల్ అవుతున్న హై-ప్రొఫైల్ వెడ్డింగ్ విశేషాలు
ప్రస్తుతం ఒకవైపు అనిరుధ్ వరుస మ్యూజిక్ ప్రాజెక్ట్‌లతో పాన్ ఇండియా రేంజ్లో దూసుకుపోతుండగా, మరోవైపు కావ్య మారన్ సన్ గ్రూప్ బాధ్యతలతో పాటు ఎస్ఆర్హెచ్ జట్టును విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇలాంటి ప్రముఖుల పెళ్లి కావడంతో ప్రతి అడుగు చాలా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వెడ్డింగ్ బాక్స్ ఫొటోలు, విశేషాలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ పెళ్లి గురించిన చర్చలే ఇప్పుడు ప్రధానంగా ట్రెండ్ అవుతున్నాయి.





