MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • SA vs WI : విండీస్ ను దంచికొట్టారు భయ్యా.. దక్షిణాఫ్రికా సెమీస్ కు హోరెత్తే ఎంట్రీ

SA vs WI : విండీస్ ను దంచికొట్టారు భయ్యా.. దక్షిణాఫ్రికా సెమీస్ కు హోరెత్తే ఎంట్రీ

South Africa vs West Indies : ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో దక్షిణాఫ్రికా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. మార్క్రామ్ మాస్ ఇన్నింగ్స్ తో వెస్టిండీస్‌పై 9 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. సెమీఫైనల్‌కు చేరువైంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 26 2026, 06:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. బౌలింగ్‌లో అదరగొట్టిన బౌలర్లు
Image Credit : X/ICC

టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. బౌలింగ్‌లో అదరగొట్టిన బౌలర్లు

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు ఆది నుంచే పదునైన బంతులతో వెస్టిండీస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. కగిసో రబడా తన మొదటి ఓవర్లోనే షాయ్ హోప్ (16), షిమ్రాన్ హెట్మెయర్ (2)లను వెనక్కి పంపి వెస్టిండీస్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. లుంగి ఎన్గిడి కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ బ్రాండన్ కింగ్ (21), రోవ్మన్ పావెల్ (9), రోస్టన్ ఛేజ్ (2) వికెట్లను పడగొట్టాడు. ఒకానొక దశలో వెస్టిండీస్ 83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

26
హోల్డర్, షెపర్డ్ పోరాటం.. విండీస్‌కు గౌరవప్రదమైన స్కోరు
Image Credit : Getty

హోల్డర్, షెపర్డ్ పోరాటం.. విండీస్‌కు గౌరవప్రదమైన స్కోరు

ఏడు వికెట్లు కోల్పోయిన తరుణంలో జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్ అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించారు. వీరిద్దరూ కలిసి 8వ వికెట్‌కు 89 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించారు. షెపర్డ్ 37 బంతుల్లో 52 పరుగులు (4 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి అజేయంగా నిలిచాడు. జేసన్ హోల్డర్ 31 బంతుల్లో 49 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రన్ అవుట్ అయ్యాడు. వీరిద్దరి కృషితో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్గిడి 3 వికెట్లు, రబడా, కోర్బిన్ బాష్ చెరో రెండు వికెట్లు తీశారు.

Related Articles

Related image1
Vaibhav Suryavanshi : మొన్న ఐపీఎల్ సెంచరీ.. నేడు 331 స్ట్రైక్ రేట్ తో అరాచకం.. ఈ కుర్రాడికి ఆకాశమే హద్దు
Related image2
IND vs ZIM : సూర్యకుమార్ యాదవ్ ఔట్? ఓడితే కెరీర్ డేంజర్‌లో పడ్డట్టే
36
మార్క్రామ్ విధ్వంసం.. దక్షిణాఫ్రికా అదరగొట్టింది
Image Credit : Getty

మార్క్రామ్ విధ్వంసం.. దక్షిణాఫ్రికా అదరగొట్టింది

177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్, క్వింటన్ డి కాక్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 95 పరుగులు జోడించి విజయాన్ని సులభతరం చేశారు. మార్క్రామ్ ఆది నుంచే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. డి కాక్ 24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 పరుగులు చేసి రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. డి కాక్ అవుట్ అయినా మార్క్రామ్ తన దూకుడును తగ్గించలేదు.

46
అజేయ హాఫ్ సెంచరీతో కెప్టెన్ నాక్.. రాణించిన రికెల్టన్
Image Credit : Getty

అజేయ హాఫ్ సెంచరీతో కెప్టెన్ నాక్.. రాణించిన రికెల్టన్

డి కాక్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన ర్యాన్ రికెల్టన్, మార్క్రామ్‌కు చక్కని సహకారం అందించాడు. మార్క్రామ్ కేవలం 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విండీస్ బౌలర్లు వికెట్లు తీయడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, దక్షిణాఫ్రికా బ్యాటర్లు వారికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మార్క్రామ్ 46 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రికిల్టన్ కూడా 28 బంతుల్లో 45 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

56
9 వికెట్ల తేడాతో ఘన విజయం.. అజేయంగా సెమీస్‌కు!
Image Credit : X@ProteasMenCSA

9 వికెట్ల తేడాతో ఘన విజయం.. అజేయంగా సెమీస్‌కు!

దక్షిణాఫ్రికా ఇంకా 3.5 ఓవర్లు (23 బంతులు) మిగిలి ఉండగానే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 177 పరుగులు చేసింది. దీంతో 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా ఈ టోర్నీలో అజేయంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ సెమీఫైనల్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ మాత్రమే ఒక వికెట్ తీయగలిగాడు.

66
ఈ మ్యాచ్‌లో నమోదైన రికార్డులు ఇవే
Image Credit : Getty

ఈ మ్యాచ్‌లో నమోదైన రికార్డులు ఇవే

  1. అత్యధిక భాగస్వామ్యం: వెస్టిండీస్ తరపున 83/7 స్కోరు వద్ద జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్ 8వ వికెట్‌కు 89 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
  2. షెపర్డ్ ఘనత: నంబర్ 9 స్థానంలో వచ్చి 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన నాలుగో అంతర్జాతీయ బ్యాటర్‌గా రొమారియో షెపర్డ్ నిలిచారు.
  3. దక్షిణాఫ్రికా ఓపెనింగ్: ఈ టోర్నీలో మార్క్రామ్, డి కాక్ జంట మూడుసార్లు 50 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రికార్డు సృష్టించారు.
  4. బౌలింగ్ రికార్డు: దక్షిణాఫ్రికా పేసర్లు ఈ టోర్నీలో ఐదుసార్లు ఇన్నింగ్స్‌లో గరిష్ఠంగా 16 ఓవర్లు వేసి రికార్డు నెలకొల్పారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vaibhav Suryavanshi : మొన్న ఐపీఎల్ సెంచరీ.. నేడు 331 స్ట్రైక్ రేట్ తో అరాచకం.. ఈ కుర్రాడికి ఆకాశమే హద్దు
Recommended image2
Priya Saroj : రింకూ సింగ్ కు కాబోయే భార్య.. ఎవరీ ప్రియా సరోజ్, ఎంత తోపో తెలుసా..?
Recommended image3
IND vs ZIM : చెన్నైలో ఇండియా-జింబాబ్వే మ్యాచ్... వర్షం ముప్పు పొంచివుందా..?
Related Stories
Recommended image1
Vaibhav Suryavanshi : మొన్న ఐపీఎల్ సెంచరీ.. నేడు 331 స్ట్రైక్ రేట్ తో అరాచకం.. ఈ కుర్రాడికి ఆకాశమే హద్దు
Recommended image2
IND vs ZIM : సూర్యకుమార్ యాదవ్ ఔట్? ఓడితే కెరీర్ డేంజర్‌లో పడ్డట్టే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved