MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • డిసెంబర్ 7న స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ పెళ్లి? క్లారిటీ వచ్చింది !

డిసెంబర్ 7న స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ పెళ్లి? క్లారిటీ వచ్చింది !

Smriti Mandhana and Palash Muchhal Wedding : స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ పెళ్లి డిసెంబర్ 7న జరగనుందని సోషల్ మీడియాలో ఒక వెడ్డింగ్ కార్డు వైరల్ గా మారింది. ఈ పెళ్లి వార్తల పై కుటుంబ సభ్యులు స్పందించారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 02 2025, 09:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మంధాన, ముచ్చల్ వివాహం ఎప్పుడు?
Image Credit : stockPhoto

మంధాన, ముచ్చల్ వివాహం ఎప్పుడు?

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. నవంబర్ 23న జరగాల్సిన ఈ జంట పెళ్లి అనుకోని పరిస్థితుల వల్ల వాయిదా పడింది. 

దీని తర్వాత ఇంటర్నెట్‌లో ఊహాగానాలకు అడ్డులేకుండా పోయింది. తాజాగా, డిసెంబర్ 7 కొత్త ముహూర్తమని పేర్కొంటున్న పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొందరు ఈ తేదీతో ఉన్న ఒక వెడ్డిండ్ కార్డును కూడా షేర్ చేస్తూ దానిని అసలైనదిగా ప్రచారం చేశారు. ఈ పోస్టులు క్షణాల్లో వైరల్ కాగా, అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారు?
Image Credit : stockPhoto

కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారు?

పలాష్ ముచ్చల్ సంబంధికులు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న సమాచారాన్ని స్పష్టంగా ఖండించారు. “డిసెంబర్ 7 పెళ్లి గురించి మాకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. వివాహం ప్రస్తుతం వాయిదా లోనే ఉంది” అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో స్మృతి మంధాన సోదరుడు శ్రవణ్ మంధాన కూడా ఇదే విషయం చెప్పారు.  పుకార్ల వల్ల కుటుంబాలకు ఇబ్బంది కలుగుతున్న సమయంలో వీరి కామెంట్స్ కూడా వైరల్ గా మారాయి.

కొంతమంది అభిమానులు షేర్ చేసిన ఆహ్వాన పత్రికపై కూడా ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. దీంతో డిసెంబర్ 7 అనే తేదీపై వస్తున్న పెళ్లి వార్తలు ఫేక్ గా తెలుస్తోంది.

Related Articles

Related image1
446 పరుగులు, 19 సిక్సర్లు.. SMAT లో హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ విధ్వంసం
Related image2
వీరి పేర్లు చెబితేనే బౌలర్లకు వణుకు.. కోట్లు కుమ్మరిస్తామంటున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు
34
ఆరోగ్య సమస్యలే పెళ్లి వాయిదాకు కారణమా?
Image Credit : Smriti Mandhana

ఆరోగ్య సమస్యలే పెళ్లి వాయిదాకు కారణమా?

నవంబర్ 23 తేదీకి జరగాల్సిన వివాహానికి ఒక రోజు ముందు వరకూ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హల్దీ, సంగీత్ వంటి వేడుకలు కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరిగాయి. కానీ పెళ్లి రోజునే స్మృతి మంధాన తండ్రి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవడం పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. అత్యవసరంగా ఆసుపత్రికి తరలించడంతో, రెండు కుటుంబాలు కలసి పెళ్లిని వాయిదా వేయాలని నిర్ణయించాయి. 

అలాగే, వరుడు పలాష్ ముచ్చల్ కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చిందన్న వార్తలు బయటకు వచ్చాయి. ఆరోగ్య పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని వివాహాన్ని తిరిగి ప్లాన్ చేసుకోవాలని కుటుంబాలు భావించాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

44
ఆన్లైన్‌లో వైరల్ అయిన చాట్స్, వివాదాలు.. ఏమిటి నిజం?
Image Credit : Instagram@Palash

ఆన్లైన్‌లో వైరల్ అయిన చాట్స్, వివాదాలు.. ఏమిటి నిజం?

పెళ్లి వాయిదా అనంతరం, పలాష్ ముచ్చల్ కొంతమంది మహిళలతో సంబంధం కలిగి ఉన్నారనీ,  చాటింగ్ చేస్తున్నట్లు చూపించే అనేక స్క్రీన్‌షాట్‌లు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. నెటిజన్లు ఇవే వివాహం నిలిచిపోవడానికి కారణమని ఆరోపించారు. ముచ్చలు చీట్ చేశాడని విమర్శలు వచ్చాయి.

కానీ ఈ ఆరోపణలను ఏ కుటుంబం కూడా ధృవీకరించలేదు. రెండు కుటుంబాలు కూడా ఆరోగ్య సమస్యలే వాయిదాకు ప్రధాన కారణమని పేర్కొన్నాయి. ఇంకా కొత్త తేదీ గురించి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image2
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
టీమిండియా దెబ్బ‌కు పాకిస్థాన్ చిత్తు.. ఆసియాక‌ప్‌లో దుమ్మురేపిన అమ్మాయిలు
Related Stories
Recommended image1
446 పరుగులు, 19 సిక్సర్లు.. SMAT లో హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ విధ్వంసం
Recommended image2
వీరి పేర్లు చెబితేనే బౌలర్లకు వణుకు.. కోట్లు కుమ్మరిస్తామంటున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved