MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Rinku Singh: కేకేఆర్‌కు అతిపెద్ద సమస్యగా మారాడు ! ఏమైంది రింకూ భయ్యా

Rinku Singh: కేకేఆర్‌కు అతిపెద్ద సమస్యగా మారాడు ! ఏమైంది రింకూ భయ్యా

KKR Rinku Singh : ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ చేతిలో కేకేఆర్ ఓటమిపాలైంది. ఒక స్టార్ బ్యాటర్ ఇప్పుడు విలన్ గా మారాడు. రింకూ సింగ్ పేలవ ఫామ్ జట్టును కష్టాల్లోకి నెట్టింది. అసలు ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 18 2026, 08:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
IPL 2026: ఫినిషర్ నుంచి విలన్‌గా మారిన రింకూ సింగ్.. కేకేఆర్‌కు తప్పని ఓటమి!
Image Credit : X@IPL

IPL 2026: ఫినిషర్ నుంచి విలన్‌గా మారిన రింకూ సింగ్.. కేకేఆర్‌కు తప్పని ఓటమి!

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై గుజరాత్ టైటాన్స్ (GT) 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఈ ఓటమితో కేకేఆర్ శిబిరంలో ఆందోళన మొదలైంది, ముఖ్యంగా స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ వైఫల్యం జట్టును వేధిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వరుసగా విఫలమవుతున్న రింకూ సింగ్
Image Credit : ANI

వరుసగా విఫలమవుతున్న రింకూ సింగ్

కేకేఆర్ జట్టులో ఫినిషర్ హోదాలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన రింకూ సింగ్, ఈ మ్యాచ్‌లో మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన ఆయన, కేవలం 2 బంతులు ఆడి 1 పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. 14.5 ఓవర్లలో కేకేఆర్ స్కోరు 147/5 వద్ద ఉన్నప్పుడు రింకూ సింగ్ ఏడవ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. క్రీజులో ఉన్న కేమరూన్ గ్రీన్ తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పుతాడని భావించినా, కగిసో రబాడా వేసిన ఓవర్లో జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ సీజన్‌లో రింకూ ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

35
రింకూ సింగ్ దారుణమైన ఫామ్.. గణంకాలు ఇవే
Image Credit : ANI

రింకూ సింగ్ దారుణమైన ఫామ్.. గణంకాలు ఇవే

ఐపీఎల్ 2026లో రింకూ సింగ్ ఫామ్ అత్యంత దారుణంగా ఉంది. గత ఆరు మ్యాచ్‌లలో ఆయన చేసిన పరుగులు వరుసగా 33*, 35, 4, 6, 1. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం 19.75 సగటుతో 79 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు కేవలం 35 పరుగులు మాత్రమే కావడం గమనార్హం.

గతంలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపించిన రింకూ, ఇప్పుడు మాత్రం జట్టుకు భారంలా మారుతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్ కెరీర్ మొత్తంలో 64 మ్యాచ్‌ల్లో 29.45 సగటుతో 1178 పరుగులు చేసిన రింకూ, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ప్లేయింగ్ ఎలెవన్‌లో కొనసాగే అర్హత కోల్పోతున్నాడా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

45
చేతులెత్తేసిన కేకేఆర్ బ్యాటర్లు
Image Credit : PTI

చేతులెత్తేసిన కేకేఆర్ బ్యాటర్లు

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ అజింక్యా రహానే ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరగా, అంగ్క్రిష్ రఘువంశీ (8 పరుగులు), టీమ్ సీఫెర్ట్ (19 పరుగులు) కూడా నిరాశపరిచారు. అయితే, ఒకవైపు వికెట్లు పడుతున్నా కేమరూన్ గ్రీన్ మాత్రం మంచి నాక్ ఆడాడు. 55 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసి ఈ సీజన్‌లో తన మొదటి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. రొవ్‌మన్ పావెల్ 27 పరుగులు చేసినా, రింకూ సింగ్, ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లేకపోవడంతో కేకేఆర్ భారీ స్కోరు సాధించలేకపోయింది.

55
గుజరాత్ టైటాన్స్ ఆధిపత్యం
Image Credit : PTI

గుజరాత్ టైటాన్స్ ఆధిపత్యం

181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ నిలకడగా ఆడి విజయాన్ని అందుకుంది. కేకేఆర్ బౌలర్లు కట్టడి చేయడానికి ప్రయత్నించినప్పటికీ, గుజరాత్ బ్యాటర్లు కీలక సమయాల్లో బౌండరీలు బాదుతూ మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకున్నారు. చివరి ఓవర్ వరకు సాగిన ఈ పోరులో గుజరాత్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రబాడా అద్భుత బౌలింగ్‌తో కేకేఆర్ నడ్డి విరవగా, బ్యాటింగ్‌లోనూ గుజరాత్ తన బలాన్ని చూపించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image2
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Recommended image3
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Related Stories
Recommended image1
MI vs PBKS : ఇదేం బాదుడు సామీ.. పంజాబ్ బౌలర్లను చితక్కొట్టిన క్వింటన్ డి కాక్ !
Recommended image2
Team India : రోహిత్ కంటే డేంజర్.. టీమిండియా ఓపెనర్లుగా ఆ నలుగురు కుర్రాళ్లు రెడీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved