టీ20లకు కెప్టెన్‌గా శార్దుల్.. సూర్యకుమార్ యాదవ్‌కు నో ఛాన్స్..
Shardul Thakur: ముంబై క్రికెట్ అసోసియేషన్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీకి జట్టును ప్రకటించింది. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు కాకుండా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు ముంబై పగ్గాలు అప్పగించారు.

కెప్టెన్ గా స్కై అవుట్..
ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ కోసం తమ జట్టును ప్రకటించింది. ఈ టోర్నమెంట్‌కు ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను కెప్టెన్‌గా నియమించారు. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించలేదు. 17 మంది సభ్యుల ముంబై జట్టులో శార్దూల్ ఠాకూర్, సూర్యకుమార్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, అజింక్యా రహానేలతో సహా ఐదుగురు భారత ప్లేయర్లు ఉన్నారు.
శ్రేయాస్ అయ్యర్ దూరం..
గత ఏడాది టైటిల్ గెలిచిన జట్టుకు నాయకత్వం వహించిన శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమయ్యారు. రంజీ ట్రోఫీలో ఐదు మ్యాచ్‌లలో 530 పరుగులు చేసిన సిద్ధేశ్ లాడ్ జట్టులోకి వచ్చాడు. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 18 వరకు జరగనున్న ఈ ట్రోఫీ మొదటి రౌండ్ లక్నో, హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతాలో జరుగుతుంది, నాకౌట్ రౌండ్ ఇండోర్‌లో ఉంటుంది.
ముంబై మొదటి మ్యాచ్
ముంబై తన మొదటి మ్యాచ్‌ను నవంబర్ 26న లక్నోలో రైల్వేస్‌తో ఆడనుంది. ఐపీఎల్ 2025లో సూర్యకుమార్ అద్భుతంగా రాణించినప్పటికీ, ఈ సంవత్సరం అంతర్జాతీయ మ్యాచ్‌లలో తన ఫామ్‌ను కొనసాగించలేకపోయాడు. ఆసియా కప్, ఆస్ట్రేలియా పర్యటనలో నిరాశపరిచిన ఆయన, రాబోయే దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరచాలని చూస్తున్నాడు.
టీ20 సిరీస్ డిసెంబర్ 9 నుంచి
దక్షిణాఫ్రికాతో జరిగితే టీ20 సిరీస్ డిసెంబర్ 9 నుంచి జరగనుంది. మొదటి టీ20 కటక్‌లో జరగనుండగా.. చివరిగా 5వ టీ20 మ్యాచ్ గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ సిరీస్‌కు గాయం కారణంగా శుభ్‌మాన్ గిల్ దూరం కానున్నాడు. అలాగే టీ20ల్లో వైస్ కెప్టెన్సీ బాధ్యతలను రిషబ్ పంత్‌కు అప్పగించే అవకాశం ఉంది.
టోర్నీలోకి ఫేవరెట్‌లుగా బరిలోకి..
అటు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌పై ఓ క్లారిటీ రావడంతో.. టీమిండియా ఆ టోర్నీలోకి ఫేవరెట్‌లుగా బరిలోకి దిగనుంది. అలాగే ఈ సఫారీలతో జరిగే టీ20 సిరీస్ కూడా భారత్‌కు కీలకం కానుంది. టీ20ల్లో ఎవరెవరు అద్భుత ప్రదర్శనలు చేపడతారో..? వారి ప్రదర్శనలు ఆధారంగా ప్రపంచకప్ జట్టులో ఛాన్స్ ఇవ్వనున్నారు.

