- Home
- Sports
- Cricket
- Team India: టీమిండియాకు 'హరీస్ రౌఫ్' దొరికేశాడ్రోయ్.. అయ్యో.! గంభీర్ శిష్యుడిని ఏకీపారేస్తున్నారుగా
Team India: టీమిండియాకు 'హరీస్ రౌఫ్' దొరికేశాడ్రోయ్.. అయ్యో.! గంభీర్ శిష్యుడిని ఏకీపారేస్తున్నారుగా
Team India: పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ నిరాశపరిచింది. వర్షం కారణంగా 26 ఓవర్లతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 136/9 పరుగులు చేయగా.. బౌలర్లు కూడా లక్ష్యాన్ని కాపాడటంతో ఫెయిల్ అయ్యారు.

టీమిండియా ఓటమి..
పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘోర పరాజయాన్ని ఎదుర్కుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడం.. మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ కూడా క్రీజులో సరిగ్గా నిలదోక్కుకోకపోవడంతో.. భారత్ ఓటమిని ఎదుర్కోవడమే కాదు.. మూడు వన్డేల సిరీస్ లో 1-0 తేడాతో వెనకబడింది.
టాస్ ఓడిపోవడమే శాపం..
ఈ వేదికపై మొదట బౌలింగ్ చేసిన జట్టు కచ్చితంగా గెలిచిన రికార్డులు పూర్వం చాలానే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే టీమిండియా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ టాస్ ఓడిపోయాడు. ఇక వర్షం కారణంగా భారత బ్యాటింగ్ లైనప్ కూడా తడబడింది. రోహిత్(8), కోహ్లీ(0) తక్కువ స్కోర్ కే పెవిలియన్ చేరగా.. మిగిలిన ఎవ్వరూ కూడా చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. లాస్ట్ లో నితీష్ కుమార్ రెడ్డి మెరుపులు మెరిపించడంతో భారత్ 26 ఓవర్లలో 136/9 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక డక్‌వర్త్-లూయిస్-పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియాకు 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
తడబడ్డ రోహిత్, కోహ్లీ
చాలా రోజుల తర్వాత అంటే.. సుమారు 223 రోజుల తర్వాత ఈ సీనియర్ ఆటగాళ్లు మళ్లీ వన్డేల్లోకి అడుగుపెట్టారు. కానీ మొదటి వన్డేలోనే తడబడ్డారు. ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. రోహిత్ శర్మ 14 బంతులు ఎదుర్కుని 8 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ అవుట్ సైడ్ వచ్చిన బంతిని కొట్టడానికి ట్రై చేసి.. 8 బంతుల్లో డకౌట్ గా వెనుదిరిగాడు.
నిరాశపరిచిన టీమిండియా బౌలింగ్..
131 పరుగుల స్వల్పలక్ష్యాన్ని కాపాడటంలో టీమిండియా బౌలింగ్ నిరాశపరిచింది. అర్ష్‌దీప్ సింగ్ మొదట ట్రావిస్ హెడ్‌ను అవుట్ చేసినా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా పుంజుకుని.. తమకు నిర్దేశించిన లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది, ఇంకా 29 బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఇక ఈ రెండు జట్ల మధ్య రెండో వన్డే అక్టోబర్ 23న జరగనుంది.
హర్షిత్ రాణాపై ట్రోలింగ్..
ఇదిలా ఉండగా.. టీమిండియా బౌలర్ హర్షిత్ రాణాపై క్రికెట్ ఫ్యాన్స్ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. రాణా తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో వికెట్ తీసుకోకుండా 27 పరుగులు ఇచ్చాడు. కేవలం గంభీర్ కోచ్‌గా ఉండటం వల్లే రాణా టీంలో ఉన్నాడని.. టీమిండియాకి దొరికిన హరీస్ రౌఫ్‌లా ధారాళంగా పరుగులు సమర్పించాడని అతడ్ని సోషల్ మీడియా వేదికగా తిట్టిపోస్తున్నారు ఫ్యాన్స్. ఇక రాణా నెక్స్ట్ మ్యాచ్‌లో కూడా సరిగ్గా ఆడలేకపోతే.. కచ్చితంగా ఒత్తిడికి లోనవ్వడం ఖాయం.