- Home
- Sports
- Cricket
- Team India : ఆసియా కప్ ప్రైజ్ మనీ జూజుబి.. దానికి 10 రెట్లు ఎక్కువ ఇస్తున్న కేంద్రం, ఎంతో తెలుసా?
Team India : ఆసియా కప్ ప్రైజ్ మనీ జూజుబి.. దానికి 10 రెట్లు ఎక్కువ ఇస్తున్న కేంద్రం, ఎంతో తెలుసా?
Team India : పాకిస్థాన్ ను చిత్తుచేసి ఆసియా కప్ 2025 విజేతగా నిలిచిన టీమిండియాకు ప్రైజ్ మనీ ఎంతొస్తుందో దానికి దాదాపు 10రెట్లు నగదు ప్రోత్సాహకాన్ని మోదీ సర్కార్ అందిస్తోంది. ఆ డబ్బెంతో తెలుసా?

ఆసియా కప్ లో టీమిండియా ఆధిపత్యం
Team India : టీమిండియా విజయయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే వన్డే, టీ20 వరల్డ్ కప్ లతో పాటు ఐసిసి నిర్వహించే అన్ని టోర్నీల్లో విజయాలు సాధించింది భారత క్రికెట్ జట్టు. సచిన్, గంగూలీ, సెహ్వాగ్ ల జమానాతో మొదలైన టీమిండియా జైత్రయాత్ర ధోని, కోహ్లీ, రోహిత్ ల కాలంలో కొనసాగింది… ఇప్పుడు శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి యువకులు కూడా టీమిండియా జైత్రయాత్రను ముందుకు నడుపుతున్నారు. ఇలా యువ జట్టు దాయాది పాకిస్థాన్ ను చిత్తుచిత్తుగా ఓడించి ఐసిసి ఆసియా కప్ 2025 విజేతగా నిలిచింది.
టీమిండియాకు విజయాలు కొత్తకాదు.. పాక్ పై విజయమే ప్రత్యేకం
అయితే టీమిండియాకు విజయాలు కొత్తకాదు... ఇప్పటికే ఇలాంటి ఆసియాకప్స్ 8 గెలిచింది, ఇది తొమ్మిదవది. కానీ దాయాది పాకిస్థాన్ ను చిత్తుచేసి గెలవడం... అదీ పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి ఘటనల సమయంలో కావడం చాలా ప్రత్యేకం. అందుకోసమే ఈ విజయాన్ని యావత్ భారతదేశం చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటోంది. భారత ప్రజలను మరోసారి గర్వపడేలా చేసిన ఆసియా కప్ విన్నింగ్ టీంకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అభినందనలు తెలపడమే కాదు భారీ నజరానా ప్రకటించారు. టీమిండియా ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బంది రూ.21 కోట్ల బహుమతిని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
3 blows.
0 response.
Asia Cup Champions.
Message delivered. 🇮🇳
21 crores prize money for the team and support staff. #AsiaCup2025#INDvPAK#TeamIndiapic.twitter.com/y4LzMv15ZC— BCCI (@BCCI) September 28, 2025
తిలక్ వర్మ ప్రశంసల వర్షం
ఇదిలావుంటే ఆసియాకప్ 2025 విజేతగా నిలిచిన టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మరీముఖ్యంగా ఫైనల్లో టీమిండియాను విజయతీరాలకు చేర్చి పాకిస్థాన్ తో ఓటమిగండం నుండి తప్పించిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఇప్పుడు హీరో అయిపోయాడు. అతడిని యావత్ దేశం ప్రశంసిస్తోంది... ఇక తెలుగోళ్లు అయితే మనవాడు ఇంతటి విజయాన్ని అందించడాన్ని గర్వకారణంగా ఫీల్ అవుతున్నారు. తిలక్ వర్మ భరత మాత నుదిటన వీరతిలకం దిద్దాడని పేర్కొంటున్నారు.
Tilak Varma scored a fantastic unbeaten fifty in the chase to power #TeamIndia to a title triumph 🏆 & bagged the Player of the Match award 👏👏
Scorecard ▶️ https://t.co/0VXKuKPkE2#AsiaCup2025 | #Finalpic.twitter.com/17XSNuABmN— BCCI (@BCCI) September 28, 2025
పాకిస్థాన్ పై తిలక్ 'తాండవం'
భారత్ - పాకిస్థాన్ మధ్య జరిగిన ఫైనల్లో రెండు ఇన్నింగ్సుల్లోనూ పాకిస్థాన్ కు శుభారంభమే లభించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన పాక్ కు ఓపెనర్లు మంచి ఆరంభం అందించారు... కానీ మిడిల్, లోయర్ ఆర్డర్ విఫలం కావడంతో పాక్ 146 పరుగులకే పరిమితం అయ్యింది... భారత బౌలర్లు అద్భుతమైన బంతులతో పాక్ ను ముప్పుతిప్పలు పెట్టారు.
147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో టీమిండియా టాప్ ఆర్డర్ కాస్త తడబడింది. ఆసియా కప్ 2025 లో అద్భుత ఫామ్ కొనసాగించిన అభిషేక్ శర్మ ఫైనల్లో తడబడ్డాడు... అలాగే కీలక బ్యాట్ మెన్స్ శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ కూడా రాణించలేకపోయారు. దీంతో కేవలం నాలుగు ఓవర్లలోనే 20 పరుగులు మాత్రమే చేసి 3 కీలక వికెట్లు కోల్పోయింది భారత్. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు... కేవలం 53 బంతుల్లో 69 పరుగులు చేసి భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. అతడికి సంజు శాంమ్సన్, శివమ్ దుబే చక్కటి సహకారం అందించారు. తిలక్ వర్మ సూపర్ బ్యాటింగ్ తో టీమిండియా గెలుపుపై అనుమానాలు మొదలైన స్థాయినుండి కేవలం 19.4 ఓవర్లలో 150 చేసి విజయం సాధించింది టీమిండియా.
What a star! Our Telugu boy, Tilak Varma, absolutely owned the pitch with a match-winning innings to take India to victory! His composure and brilliance under pressure are inspiring. This is the fire Telugu boys are made of. Well done, Tilak, we’re proud of you! #INDvPAK… pic.twitter.com/ukku3pDwJE
— N Chandrababu Naidu (@ncbn) September 29, 2025
That’s me, with the series sultan Abhishek Sharma and the final finisher, our very own Telugu boy Tilak Varma.
PS - I wasn’t at the finals last night. This was at an earlier Lokesh-ion 😀@TilakV9#AsiaCup2025pic.twitter.com/Rp0zYa7hdq— Lokesh Nara (@naralokesh) September 29, 2025
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ రికార్డ్
సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత టీ20 జట్టు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. అతను కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి టీమిండియా 22 టీ20 మ్యాచ్‌లు ఆడగా అందులో 18 విజయాలు సాధించింది. ఆసియా కప్ విజయంతో భారత్ మరో ఐసిసి ట్రోపీని గెలుచుకుంది.
ఆసియా కప్ లో అత్యధిక విజయాలు టీమిండియావే...
ఆసియా కప్ చరిత్రలో టీమిండియా తొమ్మిదిసార్లు ఛాంపియన్‌గా నిలిచి అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. శ్రీలంక ఆరుసార్లు ఆసియా కప్ ట్రోఫీని గెలుచుకుంది. పాకిస్థాన్ జట్టు కేవలం రెండుసార్లు మాత్రమే ఆసియా కప్ ట్రోఫీని ముద్దాడింది. ఇలా ఆసియా కప్ గెలిచిన టీమిండియాకు ఐసిసి నుండి మూడు లక్షల అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 2.6 కోట్లు) బహుమతిగా లభిస్తుంది. దీనికి ప్రభుత్వం అందించే రూ.21 అదనం.