MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Sports
  • T20 World Cup : సంజూ vs గిల్.. భారత జట్టులో చోటుదక్కేది ఎవరికి?

T20 World Cup : సంజూ vs గిల్.. భారత జట్టులో చోటుదక్కేది ఎవరికి?

  T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026, న్యూజిలాండ్ సిరీస్ కోసం భారత జట్టును డిసెంబర్ 20న ముంబైలో బీసీసీఐ ప్రకటించనుంది. శుభ్ మన్ గిల్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 19 2025, 06:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ముంబైలో కీలక భేటీ: టీ20 ప్రపంచ కప్ జట్టుపై ఉత్కంఠ
Image Credit : X/BCCI

ముంబైలో కీలక భేటీ: టీ20 ప్రపంచ కప్ జట్టుపై ఉత్కంఠ

భారత క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. రాబోయే న్యూజిలాండ్ సిరీస్, ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచ కప్ 2026 కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు రంగం సిద్ధమైంది. ముంబైలోని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రధాన కార్యాలయంలో శనివారం (డిసెంబర్ 20) కీలక సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ మెన్స్ సెలక్షన్ కమిటీ పాల్గొననుంది. జట్టు ఎంపిక తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి వివరాలను వెల్లడించనున్నారు. ఈ సమావేశానికి టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ హాజరుకానున్నట్లు సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రపంచ కప్ సన్నాహాలు, షెడ్యూల్
Image Credit : AFP

ప్రపంచ కప్ సన్నాహాలు, షెడ్యూల్

ప్రస్తుతం భారత జట్టు దక్షిణాఫ్రికాతో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో బిజీగా ఉంది. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబైకి చేరుకుని సెలక్షన్ మీటింగ్‌లో పాల్గొంటారు. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న 2026 టీ20 ప్రపంచ కప్‌కు ముందు ఇదే చివరి దశ సన్నాహకంగా భావిస్తున్నారు.

జనవరి 11 నుండి న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ప్రపంచ కప్ టైటిల్‌ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా చరిత్ర సృష్టించేందుకు సూర్యకుమార్ సేన సన్నద్ధమవుతోంది.

35
ఓపెనింగ్ స్థానంపై సస్పెన్స్: గిల్, ఇషాన్ లేదా సంజూ?
Image Credit : AFP

ఓపెనింగ్ స్థానంపై సస్పెన్స్: గిల్, ఇషాన్ లేదా సంజూ?

జట్టులోని చాలా స్థానాలపై స్పష్టత ఉన్నప్పటికీ, కొన్ని కీలక స్థానాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఆసియా కప్ సమయంలో వైస్ కెప్టెన్‌గా ఎంపికైన గిల్, పొట్టి ఫార్మాట్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. గిల్ జట్టులో ఉండటం వల్ల సంజూ శాంసన్ మిడిల్ ఆర్డర్‌కు డీమోట్ కావడం లేదా తుది జట్టు నుంచి పూర్తిగా అవుట్ అవుతున్నాడు.

మరోవైపు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పరుగుల వరద పారించిన ఇషాన్ కిషన్ కూడా ఓపెనింగ్ రేసులో గట్టి పోటీ ఇస్తున్నాడు. సంజూ శాంసన్ కూడా ఓపెనర్‌గా తన సత్తా చాటుతున్నాడు. గిల్ వైస్ కెప్టెన్ కావడంతో అతడిని పక్కన పెట్టే సాహసం చేస్తారా అనేది చూడాలి. అయితే సంజూ స్థానంలో ఇషాన్ కిషన్‌ను తీసుకుంటే లెఫ్ట్-రైట్ కాంబినేషన్ సమస్య తలెత్తవచ్చు.

45
భారత జట్టు : వికెట్ కీపర్ల మధ్య త్రిముఖ పోటీ
Image Credit : ANI

భారత జట్టు : వికెట్ కీపర్ల మధ్య త్రిముఖ పోటీ

వికెట్ కీపర్ స్థానం కోసం ముగ్గురు ఆటగాళ్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, జితేష్ శర్మ రేసులో ఉన్నారు. సంజూ, ఇషాన్ టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడగా, జితేష్ శర్మ మిడిల్ ఆర్డర్ ఫినిషర్‌గా ఉపయోగపడతాడు. వీరిలో ఎవరికి ప్రపంచ కప్ బెర్త్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. గాయం కారణంగా లక్నోలో జరిగిన 4వ టీ20కి దూరమైన గిల్, న్యూజిలాండ్ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా అనేది కూడా సెలెక్టర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేయవచ్చు.

55
ఆకాష్ చోప్రా అంచనా జట్టు ఇదే
Image Credit : AFP

ఆకాష్ చోప్రా అంచనా జట్టు ఇదే

మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రపంచ కప్ జట్టుపై తన అంచనాలను వెల్లడించారు. గిల్ వైస్ కెప్టెన్సీపై సందేహాలు వ్యక్తం చేసిన చోప్రా, ఆ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించాలని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, గిల్‌ను ఓపెనర్‌గా జట్టులో కొనసాగించారు.

ఆకాష్ చోప్రా ఎంపిక చేసిన జట్టులో అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా వంటి వారు ఉన్నారు. సంజూ శాంసన్‌ను బ్యాకప్ ఓపెనర్, రెండో వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. వాషింగ్టన్ సుందర్ కూడా స్పిన్ విభాగంలో చోటు దక్కించుకున్నారు. శనివారం జరగబోయే సమావేశంలో అజిత్ అగార్కర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
IPL 2026 : ఐపీఎల్ వేలంలో రూ. 74 కోట్లు కొల్లగొట్టిన ఐదుగురు ప్లేయర్లు వీరే!
Recommended image2
IPL 2026 : 9 మంది ఆల్‌రౌండర్లతో ఆర్సీబీ సూపర్ స్ట్రాంగ్.. కానీ ఆ ఒక్కటే చిన్న భయం !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved