MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • IND vs NZ : సంజూ శాంసన్ విధ్వంసం.. వరుసగా మూడో హాఫ్ సెంచరీతో సరికొత్త చరిత్ర

IND vs NZ : సంజూ శాంసన్ విధ్వంసం.. వరుసగా మూడో హాఫ్ సెంచరీతో సరికొత్త చరిత్ర

T20 World Cup Final 2026 : ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌లో సంజూ శాంసన్ దుమ్మురేపాడు. అదిరిపోయే నాక్ తో న్యూజిలాండ్ బౌలర్లను దంచికొట్టాడు. వరుస హాఫ్ సెంచరీలతో రికార్డుల మోత మోగించాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 08 2026, 08:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాదిన సంజూ శాంసన్
Image Credit : Getty

వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాదిన సంజూ శాంసన్

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఈ కీలక పోరులో శాంసన్ కేవలం 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 89 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో సంజూ శాంసన్ టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

ఈ టోర్నీలో సంజూ శాంసన్ తిరుగులేని ఫామ్‌ను కనబరుస్తున్నాడు. తాజా ఫైనల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా, టీ20 ప్రపంచ కప్‌లో వరుసగా మూడు 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. అంతకుముందు సెమీఫైనల్‌లోనూ సంజూ అర్ధ సెంచరీతో రాణించాడు. ఒకే టీ20 ప్రపంచ కప్ ఎడిషన్‌లో సెమీఫైనల్, ఫైనల్ రెండింటిలోనూ హాఫ్ సెంచరీలు సాధించిన మూడవ ఆటగాడిగా సంజూ నిలిచాడు. అంతకుముందు షాహిద్ అఫ్రిది – 2009లో, విరాట్ కోహ్లీ 2014 లో ఈ ఘనత సాధించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సిక్సర్ల సునామీ.. ఫిన్ అలెన్ రికార్డ్ బ్రేక్ చేసిన సంజూ
Image Credit : Getty

సిక్సర్ల సునామీ.. ఫిన్ అలెన్ రికార్డ్ బ్రేక్ చేసిన సంజూ

న్యూజిలాండ్ బౌలర్లపై సంజూ శాంసన్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా రచిన్ రవీంద్ర వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా ఒక టీ20 ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు (21) కొట్టిన ఆటగాడిగా సంజూ సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఫిన్ అలెన్ పేరిట ఉన్న 20 సిక్సర్ల రికార్డును సంజూ అధిగమించాడు.

Related Articles

Related image1
IND vs NZ : ధోనీ, కోహ్లీ వల్లే కాలేదు.. సూర్య భాయ్ కొట్టి చూపిస్తాడా?
Related image2
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ పవర్ ప్యాక్డ్ విధ్వంసం.. పవర్‌ప్లేలోనే వరల్డ్ రికార్డ్
35
కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన శాంసన్
Image Credit : X/BCCI

కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన శాంసన్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ నిర్ణయాన్ని సంజూ తప్పుగా నిరూపించాడు. లాకీ ఫెర్గూసన్ వేసిన ఓవర్‌లో సంజూ వరుస బౌండరీలతో విరుచుకుపడటంతో కివీస్ బౌలర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. కేవలం 33 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్న సంజూ, ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడి జట్టు స్కోరును 200 దాటించాడు. జేమ్స్ నీషమ్ వేసిన ఫుల్ టాస్ బంతిని భారీ షాట్ ఆడబోయి సంజూ అవుట్ అయినప్పటికీ, అప్పటికే అతను టీమిండియాను బలమైన స్థితిలో నిలబెట్టాడు.

45
నిలకడకు మారుపేరుగా సంజూ
Image Credit : X/BCCI

నిలకడకు మారుపేరుగా సంజూ

గతంలో నిలకడలేమితో విమర్శలు ఎదుర్కొన్న సంజూ శాంసన్, ఈ ప్రపంచ కప్‌లో అత్యంత బాధ్యతాయుతంగా ఆడుతున్నాడు. నాకౌట్ వంటి ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లలో వరుసగా మూడుసార్లు క్లచ్ ఇన్నింగ్స్ ఆడటం అతని పరిణతికి నిదర్శనం. సంజూ ఆడుతున్న తీరును చూసి డగౌట్‌లో ఉన్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం లేచి నిలబడి చప్పట్లతో అభినందించడం విశేషం.

55
టీ20 ప్రపంచ కప్‌లో అత్యధిక వరుస 50+ స్కోర్లు
Image Credit : Asianet News

టీ20 ప్రపంచ కప్‌లో అత్యధిక వరుస 50+ స్కోర్లు

టీ20 ప్రపంచ కప్ చరిత్రలో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసిన దిగ్గజాల సరసన సంజూ శాంసన్ చేరాడు.

• మహేల జయవర్ధనే (2010)

• విరాట్ కోహ్లీ (2016-2021)

• బాబర్ ఆజం (2021)

• కేఎల్ రాహుల్ (2021)

• కుశాల్ మెండిస్ (2026)

• సాహిబ్జాదా ఫర్హాన్ (2026)

• సంజూ శాంసన్ (2026)

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image2
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image3
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Related Stories
Recommended image1
IND vs NZ : ధోనీ, కోహ్లీ వల్లే కాలేదు.. సూర్య భాయ్ కొట్టి చూపిస్తాడా?
Recommended image2
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ పవర్ ప్యాక్డ్ విధ్వంసం.. పవర్‌ప్లేలోనే వరల్డ్ రికార్డ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved