MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Sports
  • CSK: వరుసగా ఫెయిల్యూర్స్ చూసి అతడ్ని వెళ్లి కలిశా.. దెబ్బకు సెంచరీ కొట్టేశాను.. ఎవరంటే.?

CSK: వరుసగా ఫెయిల్యూర్స్ చూసి అతడ్ని వెళ్లి కలిశా.. దెబ్బకు సెంచరీ కొట్టేశాను.. ఎవరంటే.?

CSK: సంజు శాంసన్ అద్భుత సెంచరీతో ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తన మొదటి విజయాన్ని నమోదు చేసింది. 56 బంతుల్లో 115 పరుగులు చేసిన సంజూ, మూడు వేర్వేరు ఐపీఎల్ జట్ల తరపున సెంచరీలు బాదిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 

2 Min read
Author : Pavithra D
Published : Apr 12 2026, 01:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చెన్నై సూపర్ కింగ్స్ బోణీ
Image Credit : x@IPL

చెన్నై సూపర్ కింగ్స్ బోణీ

ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. వరుస వైఫల్యాల తర్వాత సంజూ శాంసన్ మెరుపు సెంచరీతో జట్టుకు భారీ విజయాన్ని అందించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో చెన్నై భారీ స్కోరు నమోదు చేయడమే కాకుండా, ఢిల్లీని తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. ఈ సెంచరీతో శాంసన్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చెన్నై భారీ స్కోరు
Image Credit : x@IPL

చెన్నై భారీ స్కోరు

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. సంజూ శాంసన్ కేవలం 56 బంతుల్లోనే 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో సెంచరీ సాధించిన మొదటి బ్యాటర్‌గా సంజూ నిలిచాడు. అనంతరం 213 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులు మాత్రమే చేసి 10 వికెట్లు కోల్పోయింది.

Related Articles

Related image1
CSK vs DC : స్టబ్స్ గ్లవ్స్ మార్చుకోడానికి ఎందుకు అనుమతించలేదు.. ఐపిఎల్ రూల్స్ ఏం చెబుతున్నాయి..?
Related image2
CSK vs DC : స్టబ్స్ పోరాటం వృధా.. ఎట్టకేలకు బోణీ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్..!
35
మూడు ఫ్రాంచైజీల తరపున సెంచరీలు
Image Credit : Getty

మూడు ఫ్రాంచైజీల తరపున సెంచరీలు

ఈ సెంచరీతో సంజూ శాంసన్ ఐపీఎల్‌లో తన నాలుగో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మూడు వేర్వేరు ఫ్రాంచైజీల (ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్) తరపున సెంచరీలు సాధించిన రెండో బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు కె.ఎల్. రాహుల్ మాత్రమే ఈ ఘనత సాధించారు.

45
విజయంపై సంజూ శాంసన్ స్పందన
Image Credit : ANI

విజయంపై సంజూ శాంసన్ స్పందన

మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై సంజూ శాంసన్ స్పందిస్తూ, వరుసగా రెండు మూడు మ్యాచ్‌లు విఫలమైనప్పుడు సందేహాలు రావడం సహజమని, కానీ బేసిక్స్‌కు కట్టుబడి ఉండటం వల్లే ఈరోజు ఫలితం వచ్చిందని తెలిపాడు. "మొదట్లో పిచ్ కొంత నెమ్మదిగా ఉంది, పవర్ ప్లేలో అక్షర్ పటేల్ బౌలింగ్ చేస్తున్నప్పుడు బంతి కాస్త ఆగింది. కానీ బంతి పాతబడిన తర్వాత బ్యాటింగ్ సులభమైంది" అని సంజూ వివరించాడు.

55
రవిశాస్త్రిని కలవడం అదృష్టం
Image Credit : Facebook/Chennai Super Kings

రవిశాస్త్రిని కలవడం అదృష్టం

ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రిని కలిశానని, అది తనకు అదృష్టంగా మారిందని సంజూ సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రతి మ్యాచ్‌కు ముందు ఆయనను కలిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఆయుష్‌తో కలిసి చేసిన భాగస్వామ్యం జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిందని సంజూ పేర్కొన్నాడు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Related Stories
Recommended image1
CSK vs DC : స్టబ్స్ గ్లవ్స్ మార్చుకోడానికి ఎందుకు అనుమతించలేదు.. ఐపిఎల్ రూల్స్ ఏం చెబుతున్నాయి..?
Recommended image2
CSK vs DC : స్టబ్స్ పోరాటం వృధా.. ఎట్టకేలకు బోణీ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved