MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Sports
  • CSK vs DC : స్టబ్స్ గ్లవ్స్ మార్చుకోడానికి ఎందుకు అనుమతించలేదు.. ఐపిఎల్ రూల్స్ ఏం చెబుతున్నాయి..?

CSK vs DC : స్టబ్స్ గ్లవ్స్ మార్చుకోడానికి ఎందుకు అనుమతించలేదు.. ఐపిఎల్ రూల్స్ ఏం చెబుతున్నాయి..?

IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్, డిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. అయితే ఇందులో ఓ ఆసక్తికరమైన ఐపిఎల్ నిబంధన గురించి బైటపడింది. 

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 12 2026, 12:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఎట్టకేలకు చెన్నై విజయం..
Image Credit : Getty

ఎట్టకేలకు చెన్నై విజయం..

CSK vs DC : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 లో ఎట్టకేలకు చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. వరుసగా హ్యాట్రిక్ ఓటముల తర్వాత సొంత మైదానంలో, ప్రేక్షకులను అలరిస్తూ విజయాన్ని అందుకుంది. చెన్నై స్టేడియంలో డిల్లీ క్యాపిటల్స్ తో తలపడ్డ సీఎస్కే 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. 213 పరుగల టార్గెట్ ను చేదించే క్రమంలో స్టబ్స్ వీరోచిత పోరాటం చేశాడు... కానీ అనూహ్యంగా అతడు ఔట్ అవడంతో చెన్నై విజయం ఖాయమయ్యింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
స్టబ్స్ పోరాటం వృధా..
Image Credit : X/IPL

స్టబ్స్ పోరాటం వృధా..

చెన్నై నిర్దేశించిన 213 పరుగల లక్ష్యాన్ని చేధించే క్రమంలో డిసికి శుభారంభం లభించింది. ఓపెనర్ పతుమ్ నిసంక కేవలం 24 బంతుల్లో 41 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా కేవలం 10 బంతుల్లో 18 పరుగులు చేశాడు. ఇలా ఇద్దరు ఓపెనర్లు దూకుడుగా ఆడటంతో మొదటి వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదయ్యింది.

అయితే వెంటనేవెంటనే వికెట్లు పడటంతో డిల్లీ ఒత్తిడిలో పడింది... ఓపెనర్లతో పాటు సమీర్ రిజ్వి, అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ ఒకరి తర్వాత ఒకరు ఔట్ అయ్యారు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన స్టబ్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 38 బంతుల్లో 60 పరుగులు చేసి డిసి గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. కానీ జేమీ ఓవర్టన్ బౌలింగ్ లో నూర్ అహ్మద్ కు క్యాచ్ ఇచ్చి ఔటవడంతో డిసి ఓటమి తప్పలేదు.

Related Articles

Related image1
IPL 2026: 7 సిక్సర్లతో ప్రత్యర్ధిని ఏడిపించాడు.. కట్ చేస్తే.. ధోనికే అంకితమిచ్చాడు.. ఎవరీ ముకుల్ చౌదరీ
Related image2
CSK vs DC : స్టబ్స్ పోరాటం వృధా.. ఎట్టకేలకు బోణీ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్..!
34
స్టబ్స్ అసహనం... ఎందుకో తెలుసా..?
Image Credit : ANI

స్టబ్స్ అసహనం... ఎందుకో తెలుసా..?

డిల్లీ జట్టును గెలిపించేందుకు దూకుడుగా ఆడిన స్టబ్స్ అనూహ్యంగా ఔటవడంతో తీవ్ర అసహనానికి గురయ్యాడు. పెవిలియన్ కు చేరుకోగానే బ్యాట్ ను విసిరేశాడు.. అంతేకాదు డ్రెస్సింగ్ రూంలో హెల్మెట్ ను కోపంగా పడేశాడు. దీన్నిబట్టి అతడు తీవ్ర అసహానికి గురయ్యాడని అర్థమవుతోంది.

అయితే ఈ కోపానికి అతడిపట్ల అపైర్లు వ్యవహరించిన తీరే కారణమని తెలుస్తోంది. స్టబ్స్ ఔట్ అయ్యేకంటే ముందు గ్లవ్స్ మార్చుకునేందుకు సిద్దమయ్యాడు... కానీ అంపైర్లు అందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఇబ్బందికరంగా ఉన్నా అవే గ్లౌవ్స్ తో బ్యాటింగ్ చేశాడు... అందువల్లే ఔట్ అయ్యానని భావించిన స్టబ్స్ అసహనానికి గురయి ఉంటాయని కామెంటేటర్స్ అభిప్రాయపడ్డారు.

44
ఓవర్ మధ్యలో గ్లవ్స్ మార్చుకోవచ్చా...?
Image Credit : X@IPL

ఓవర్ మధ్యలో గ్లవ్స్ మార్చుకోవచ్చా...?

సాధారణంగా క్రికెట్ నియమాల ప్రకారం, బ్యాటర్లు తమ ఇష్టానుసారం ఆట మధ్యలో గ్లవ్స్ మార్చుకోవడానికి వీలుండదు. ఐపీఎల్ లేదా అంతర్జాతీయ క్రికెట్ (MCC రూల్స్) ప్రకారం దీనికి సంబంధించిన నిబంధనలు ఇలా ఉన్నాయి.

సాధారణంగా ఓవర్ మధ్యలో గ్లౌవ్స్ మార్చడానికి అనుమతించరు. కేవలం ఓవర్ పూర్తయిన తర్వాత లేదా డ్రింక్స్ బ్రేక్ సమయంలో మాత్రమే గ్లౌవ్స్ మార్చుకోవాలి. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అంపైర్ అనుమతితో మధ్యలో మార్చుకోవచ్చు.

అయితే ఐపీఎల్‌లో 'స్లో ఓవర్ రేట్' నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. బ్యాటర్లు మాటిమాటికీ గ్లవ్స్ లేదా బ్యాట్లు మారుస్తూ సమయాన్ని వృధా చేస్తే అది ఫీల్డింగ్ టీమ్ ఓవర్ రేట్‌పై ప్రభావం చూపుతుంది. అందుకే బ్యాటర్ అనవసరంగా ఆలస్యం చేస్తున్నాడని అంపైర్ భావిస్తే, అతడిని హెచ్చరించవచ్చు. తాజాగా స్టబ్స్ విషయంలో ఇదే జరిగివుంటుంది.. ఆట వేగానికి ఆటంకం కలగకూడదనే అతడు గ్లవ్స్ మార్చుకునేందుకు అంపైర్లు అనుమతించకపోవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రీడలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Related Stories
Recommended image1
IPL 2026: 7 సిక్సర్లతో ప్రత్యర్ధిని ఏడిపించాడు.. కట్ చేస్తే.. ధోనికే అంకితమిచ్చాడు.. ఎవరీ ముకుల్ చౌదరీ
Recommended image2
CSK vs DC : స్టబ్స్ పోరాటం వృధా.. ఎట్టకేలకు బోణీ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved