MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • PAK vs NAM : భారత్‌పై ఫెయిల్.. చిన్న టీమ్‌పై సెంచరీతో రెచ్చిపోయిన పాక్ ఓపెనర్

PAK vs NAM : భారత్‌పై ఫెయిల్.. చిన్న టీమ్‌పై సెంచరీతో రెచ్చిపోయిన పాక్ ఓపెనర్

Pakistan vs Namibia : టీ20 వరల్డ్ కప్ 2026లో పాక్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ 57 బంతుల్లోనే సెంచరీ బాదాడు. నమీబియాపై 100 పరుగులు చేసి పాకిస్థాన్‌కు భారీ స్కోరు అందించాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 18 2026, 05:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టీ20 వరల్డ్ కప్‌లో పాక్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ సెంచరీ
Image Credit : ANI

టీ20 వరల్డ్ కప్‌లో పాక్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ సెంచరీ

కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ లో బుధవారం జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 నాకౌట్ రేసులో పాకిస్థాన్ కీలక విజయం దిశగా అడుగులు వేసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. నమీబియా బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ కేవలం 57 బంతుల్లోనే తన కెరీర్ లో తొలి టీ20 వరల్డ్ కప్ సెంచరీని నమోదు చేశాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ సాయంతో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు సాధించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
12 ఏళ్ల నిరీక్షణకు ఫర్హాన్ ముగింపు
Image Credit : X/ICC

12 ఏళ్ల నిరీక్షణకు ఫర్హాన్ ముగింపు

పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో ఈ సెంచరీ ఎంతో ప్రత్యేకమైనది. టీ20 వరల్డ్ కప్ టోర్నీలలో పాకిస్థాన్ తరఫున ఒక బ్యాటర్ సెంచరీ సాధించి సుమారు 12 ఏళ్లు దాటింది. చివరిసారిగా 2014లో అహ్మద్ షెహజాద్ బంగ్లాదేశ్‌పై అజేయంగా 111 పరుగులు చేశాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సాహిబ్జాదా ఫర్హాన్ ఈ ఘనత సాధించిన రెండో పాక్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఫర్హాన్ తన ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 172.41 స్ట్రైక్ రేట్‌తో మెరిశాడు.

Related Articles

Related image1
Yuvraj : బంతి బాదుడు అంటే ఇలా ఉండాలి.. 19 ఏళ్లకే సునామీ.. ప్రపంచ క్రికెట్ షాక్
Related image2
ICC T20 Rankings : అభిషేక్ శర్మ అరాచకం.. ఇషాన్ కిషన్ విధ్వంసం
36
గాల్లోకి ఎగిరిన బ్యాట్.. వీడియో వైరల్
Image Credit : X/ICC

గాల్లోకి ఎగిరిన బ్యాట్.. వీడియో వైరల్

ఈ మ్యాచ్‌లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో నమీబియా బౌలర్ జాక్ బ్రాసెల్ వేసిన 136.4 కి.మీ వేగంతో వచ్చిన బంతిని ఫర్హాన్ బలంగా బాదబోయాడు. అయితే కొలంబోలోని విపరీతమైన తేమ, చెమట కారణంగా ఫర్హాన్ చేతిలో నుంచి బ్యాట్ జారి గాల్లోకి ఎగిరి వికెట్ కీపర్ తల మీదుగా స్క్వేర్ లెగ్ రీజియన్‌లో పడింది. బ్యాట్ లేకపోయినా ఫర్హాన్ పరుగు కోసం ప్రయత్నించాడు. వెంటనే డగౌట్ నుంచి షాహీన్ ఆఫ్రిది కొత్త గ్లోవ్స్ పట్టుకుని మైదానంలోకి వచ్చి ఫర్హాన్ కి అందించాడు.

46
భారత్ పై ఫెయిల్.. నమీబియాపై విజృంభణ
Image Credit : X/ICC

భారత్ పై ఫెయిల్.. నమీబియాపై విజృంభణ

గత మ్యాచ్‌లో భారత్‌తో జరిగిన పోరులో ఫర్హాన్ దారుణంగా విఫలమయ్యాడు. హార్దిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్లోనే రింకూ సింగ్ కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. టీమ్ ఇండియా వంటి బలమైన జట్టుపై చేతులెత్తేసిన ఫర్హాన్, నమీబియా వంటి చిన్న జట్టుపై మాత్రం తన ప్రతాపాన్ని చూపించాడు. అనుభవం లేని నమీబియా బౌలర్లను లక్ష్యంగా చేసుకుని మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు.

56
బాబర్ ఆజంకు దక్కని బ్యాటింగ్ అవకాశం
Image Credit : Getty

బాబర్ ఆజంకు దక్కని బ్యాటింగ్ అవకాశం

పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ జట్టు స్టార్ బ్యాటర్ బాబర్ ఆజంకు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఓపెనర్ ఫర్హాన్ ఇన్నింగ్స్ చివరి వరకు నాటౌట్‌గా నిలవగా, సల్మాన్ అలీ ఆఘా (38), షాదాబ్ ఖాన్ (36 నాటౌట్) వేగంగా పరుగులు సాధించారు. భారత్‌తో మ్యాచ్‌లో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కేవలం 5 పరుగులకే క్లీన్ బౌల్డ్ అయిన బాబర్‌ను, ఈ మ్యాచ్‌లో పాక్ మేనేజ్మెంట్ బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకు పంపింది.

66
పాక్ భారీ స్కోరు.. నమీబియాకు కష్టమే
Image Credit : X@ICC

పాక్ భారీ స్కోరు.. నమీబియాకు కష్టమే

ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో ఫర్హాన్, షాదాబ్ కలిసి జాక్ బ్రాసెల్ బౌలింగ్‌లో 20 పరుగులు రాబట్టారు. ఇది మ్యాచ్‌లోనే టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. నమీబియా బౌలర్లలో రూబెన్ ట్రంపెల్‌మాన్ యార్కర్లతో కట్టడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ, పాక్ బ్యాటర్ల ధాటికి వారు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. చివరికి పాకిస్థాన్ 199 పరుగులు చేసి నమీబియా ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
భారత జాతీయ క్రికెట్ జట్టు
పాకిస్తాన్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
క్రికెట్
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Related Stories
Recommended image1
Yuvraj : బంతి బాదుడు అంటే ఇలా ఉండాలి.. 19 ఏళ్లకే సునామీ.. ప్రపంచ క్రికెట్ షాక్
Recommended image2
ICC T20 Rankings : అభిషేక్ శర్మ అరాచకం.. ఇషాన్ కిషన్ విధ్వంసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved