MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • Fastest T20 Century: టీ20 వరల్డ్ కప్ చరిత్రలో టాప్ 5 ఫాస్టెస్ట్ సెంచరీలు ఇవే

Fastest T20 Century: టీ20 వరల్డ్ కప్ చరిత్రలో టాప్ 5 ఫాస్టెస్ట్ సెంచరీలు ఇవే

Fastest T20 Century: టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్తాన్‌పై హ్యారీ బ్రూక్ 50 బంతుల్లో సెంచరీ చేసి బ్రెండన్ మెకల్లమ్ రికార్డు బ్రేక్ చేశాడు. అయితే, టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగంగా ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 ప్లేయర్లు ఎవరో తెలుసా?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 25 2026, 06:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
50 బంతుల్లో సెంచరీ.. టీ20 వరల్డ్ కప్‌లో బ్రూక్ సూపర్ స్ట్రైక్
Image Credit : X/ICC

50 బంతుల్లో సెంచరీ.. టీ20 వరల్డ్ కప్‌లో బ్రూక్ సూపర్ స్ట్రైక్

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో మరో సంచలనం నమోదైంది. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తన సూపర్ బ్యాటింగ్‌తో కొత్త చరిత్ర సృష్టించాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను కేవలం 50 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ సెంచరీతో అతను తన గురువు, ప్రస్తుత ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20 వరల్డ్ కప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్‌పై పూర్తి ఆధిపత్యం చాటింది. లక్ష్య ఛేదనలో హ్యారీ బ్రూక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని సెంచరీతో ఇంగ్లాండ్ జట్టు 165 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుంది. ఈ విజయంతో ఇంగ్లాండ్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది.

అయితే, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వేగంగా సెంచరీ చేసిన టాప్ 5 ఆటగాళ్లు ఎవరో మీకు తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. క్రిస్ గేల్ ఇప్పటికీ నంబర్ 1
Image Credit : Getty

1. క్రిస్ గేల్ ఇప్పటికీ నంబర్ 1

వెస్టిండీస్ మాజీ దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ ఇప్పటికీ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. అతను 2016 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌పై కేవలం 47 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇది ఇప్పటికీ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వేగవంతమైన సెంచరీగా కొనసాగుతోంది.

ఇదే కాకుండా, గేల్ 2007 టీ20 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికాపై 50 బంతుల్లో సెంచరీ కూడా చేశాడు. టీ20 ఫార్మాట్‌లో అతని ధనాధన్ బ్యాటింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

36
2. రెండో స్థానంలో హ్యారీ బ్రూక్
Image Credit : Getty

2. రెండో స్థానంలో హ్యారీ బ్రూక్

ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఇప్పుడు ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అతను టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్తాన్‌పై కేవలం 50 బంతుల్లో సెంచరీ సాధించాడు.

ఈ సెంచరీతో ఇంగ్లాండ్ జట్టు 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. సెమీ ఫైనల్‌కు చేరుకుంది. టీ20 వరల్డ్ కప్‌లో కెప్టెన్‌గా సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా బ్రూక్ చరిత్ర సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతను తన గురువు బ్రెండన్ మెకల్లమ్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.

46
3. మూడో స్థానంలో బ్రెండన్ మెకల్లమ్
Image Credit : Getty

3. మూడో స్థానంలో బ్రెండన్ మెకల్లమ్

న్యూజిలాండ్ మాజీ ఆటగాడు, ప్రస్తుత ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ 2012 టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌పై 51 బంతుల్లో సెంచరీ చేశాడు.

ఆ సమయంలో ఇది అత్యంత వేగవంతమైన సెంచరీలలో ఒకటిగా నిలిచింది. మెకల్లమ్ తన దూకుడైన బ్యాటింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అయితే, ఇప్పుడు మెకల్లమ్ రికార్డును అతని శిష్యుడు హ్యారీ బ్రూక్ బ్రేక్ చేశాడు.

56
4. రిలీ రోసో ధనాధన్ సెంచరీ
Image Credit : PTI

4. రిలీ రోసో ధనాధన్ సెంచరీ

దక్షిణాఫ్రికా బ్యాటర్ రిలీ రోసో 2022 టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌పై 52 బంతుల్లో సెంచరీ చేశాడు.

అతను ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. రోసో తన దూకుడైన బ్యాటింగ్ శైలికి ప్రసిద్ధి చెందాడు. అతని ఇన్నింగ్స్ దక్షిణాఫ్రికా విజయానికి కీలకంగా మారింది.

66
5. పాతుమ్ నిస్సంక అద్భుత సెంచరీ
Image Credit : X/OfficialSLC

5. పాతుమ్ నిస్సంక అద్భుత సెంచరీ

శ్రీలంక ఆటగాడు పాతుమ్ నిస్సంక టీ20 వరల్డ్ కప్ 2026లో ఆస్ట్రేలియాపై కేవలం 52 బంతుల్లో సెంచరీ సాధించాడు. అతను 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

అతని ఇన్నింగ్స్‌తో శ్రీలంక జట్టు 182 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. ఈ ఓటమితో టోర్నమెంట్ నుంచి అవుట్ అయింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Related Stories
Recommended image1
IND vs ZIM : జింబాబ్వేతో మ్యాచ్.. భారత్‌కు చావో రేవో ! ముగ్గురు స్టార్లు ఔట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved