MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Yuvraj : బంతి బాదుడు అంటే ఇలా ఉండాలి.. 19 ఏళ్లకే సునామీ.. ప్రపంచ క్రికెట్ షాక్

Yuvraj : బంతి బాదుడు అంటే ఇలా ఉండాలి.. 19 ఏళ్లకే సునామీ.. ప్రపంచ క్రికెట్ షాక్

Canada Yuvraj Samra : కెనడా ఓపెనర్ యువరాజ్ సమ్రా 19 ఏళ్లకే టీ20 ప్రపంచకప్‌లో సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. అహ్మద్ షెహజాద్ రికార్డును అధిగమించి ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 17 2026, 11:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చైన్నైలో యువరాజ్ సరికొత్త చరిత్ర
Image Credit : Getty

చైన్నైలో యువరాజ్ సరికొత్త చరిత్ర

చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో మంగళవారం జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ గ్రూప్ డీ మ్యాచ్‌లో కెనడా ఓపెనర్ యువరాజ్ సమ్రా అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ పోరులో కేవలం 58 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు సమ్రా. దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా సమ్రా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. అసోసియేట్ దేశం నుండి టీ20 ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా కూడా అతను గుర్తింపు పొందాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అహ్మద్ షెహజాద్ రికార్డు బద్దలు
Image Credit : Getty

అహ్మద్ షెహజాద్ రికార్డు బద్దలు

ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడే సమయానికి యువరాజ్ సమ్రా వయసు కేవలం 19 ఏళ్ల 141 రోజులు మాత్రమే. దీనితో పాకిస్థాన్ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ పేరిట ఉన్న దశాబ్ద కాలం నాటి రికార్డు బద్దలైంది. 2014లో బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసినప్పుడు షెహజాద్ వయసు 22 ఏళ్ల 127 రోజులు.

టీ20 ప్రపంచకప్‌లో అతి పిన్న వయస్కులైన సెంచరీ వీరులు

  1. యువరాజ్ సమ్రా (కెనడా): 19 ఏళ్ల 141 రోజులు (v న్యూజిలాండ్, 2026)
  2. అహ్మద్ షెహజాద్ (పాకిస్థాన్): 22 ఏళ్ల 127 రోజులు (v బంగ్లాదేశ్, 2014)
  3. సురేష్ రైనా (భారత్): 23 ఏళ్ల 156 రోజులు (v సౌత్ ఆఫ్రికా, 2010)
  4. అలెక్స్ హేల్స్ (ఇంగ్లాండ్): 25 ఏళ్ల 83 రోజులు (v శ్రీలంక, 2014)

Related Articles

Related image1
T20 World Cup : దశాబ్దాల నిరీక్షణకు తెర.. సూపర్ 8కు జింబాబ్వే.. భారత్‌తో పోరు ఎప్పుడంటే?
Related image2
India Super 8 Schedule : సూపర్-8 సమరానికి సూర్య సేన రెడీ.. భారత్ ఢీకొట్టే జట్లు ఇవే
35
కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డ సమ్రా
Image Credit : Getty

కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డ సమ్రా

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కెనడాకు సమ్రా అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వాతో కలిసి తొలి వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 36 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న అతను, ఆ తర్వాత గేర్ మార్చి కివీస్ పేసర్లు మాట్ హెన్రీ, కైల్ జేమీసన్ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. మొత్తం 65 బంతుల్లో 110 పరుగులు చేసిన సమ్రా ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. 103 పరుగుల వద్ద జిమ్మీ నీషమ్ క్యాచ్ వదిలేయడంతో లైఫ్ దొరికింది. చివరకు గ్లెన్ ఫిలిప్స్ చేతికి చిక్కి అవుట్ అయ్యాడు.

45
తండ్రి కల.. కొడుకు విజయం
Image Credit : Getty

తండ్రి కల.. కొడుకు విజయం

యువరాజ్ సమ్రా విజయ వెనుక అతని తండ్రి బల్జీత్ బాలీ సమ్రా ఎంతో కృషి ఉంది. అమృత్‌సర్‌కు చెందిన బల్జీత్, దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు పెద్ద అభిమాని. తన కొడుకు కూడా క్రికెటర్‌గా ఎదగాలనే కోరికతో అతనికి యువరాజ్ అని పేరు పెట్టారు. కెనడాలో స్థిరపడినప్పటికీ, కొడుకు శిక్షణ కోసం భారత్, అమెరికా, కరేబియన్ దేశాలకు తిప్పారు. కెనడాలోని ఇండోర్ నెట్స్ నుండి మొహాలీలోని పిచ్‌ల వరకు సమ్రా కఠినమైన శిక్షణ పొందాడు. అమ్రీందర్ భిందర్, గగన్‌దీప్ సింగ్ వంటి కోచ్‌ల పర్యవేక్షణలో మెరుగులు దిద్దుకున్న సమ్రా, నేడు మెగా టోర్నీలో మెరిశాడు.

55
సమ్రా సూపర్ నాక్.. కానీ న్యూజిలాండ్ గెలుపు
Image Credit : Getty

సమ్రా సూపర్ నాక్.. కానీ న్యూజిలాండ్ గెలుపు

సమ్రా అద్భుత సెంచరీతో కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అయితే, ఈ లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం 15.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రచిన్ రవీంద్ర (59*), గ్లెన్ ఫిలిప్స్ (76*) మెరుపు ఇన్నింగ్స్‌లతో కివీస్‌కు 8 వికెట్ల విజయాన్ని అందించారు. కెనడా ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ, యువరాజ్ సమ్రా ఆడిన ఇన్నింగ్స్ మాత్రం టోర్నీలోనే హైలైట్‌గా నిలిచింది. పాతుమ్ నిస్సంక తర్వాత ఈ వరల్డ్ కప్‌లో సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా సమ్రా నిలిచాడు. ఐపీఎల్ వంటి పెద్ద లీగ్‌లలో ఆడే సత్తా తనకు ఉందని సమ్రా తన నాక్ తో నిరూపించాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
క్రీడలు
క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Related Stories
Recommended image1
T20 World Cup : దశాబ్దాల నిరీక్షణకు తెర.. సూపర్ 8కు జింబాబ్వే.. భారత్‌తో పోరు ఎప్పుడంటే?
Recommended image2
India Super 8 Schedule : సూపర్-8 సమరానికి సూర్య సేన రెడీ.. భారత్ ఢీకొట్టే జట్లు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved