MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Rohit Sharma : 37 ఏళ్ల రికార్డు బద్దలు.. ద్రవిడ్‌ రికార్డు క్లోజ్.. సచిన్, కోహ్లీ సరసన రోహిత్ శర్మ

Rohit Sharma : 37 ఏళ్ల రికార్డు బద్దలు.. ద్రవిడ్‌ రికార్డు క్లోజ్.. సచిన్, కోహ్లీ సరసన రోహిత్ శర్మ

Rohit Sharma record : 39 ఏళ్ల వయసులోనూ రోహిత్ శర్మ వీరబాదుడు కొనసాగుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌పై 79 రన్స్ చేసిన రోహిత్ శర్మ.. 37 ఏళ్ల నాటి రికార్డ్‌ను బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. దిగ్గజ ప్లేయర్ల సరసన చేరాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 21 2026, 07:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆఫ్ఘనిస్తాన్‌ను ఊచకోత కోసిన రోహిత్.. భారత క్రికెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్ బ్రేక్
Image Credit : X/BCCI

ఆఫ్ఘనిస్తాన్‌ను ఊచకోత కోసిన రోహిత్.. భారత క్రికెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్ బ్రేక్

భారత క్రికెట్ దిగ్గజ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మైదానంలో మరోసారి రెచ్చిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ వీరవిహారం చేశాడు. అదిరిపోయే రేంజ్‌లో హాఫ్ సెంచరీ బాదాడు. వన్డే కెరీర్‌లో తన 62వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్న రోహిత్.. కేవలం 69 బంతుల్లోనే 79 పరుగులు చేసి దుమ్మురేపాడు. 114.49 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన హిట్ మ్యాన్, తన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు దంచికొట్టాడు. ఈ సూపర్ ఇన్నింగ్స్‌తో వన్డే క్రికెట్‌లో ఏకంగా 37 ఏళ్ల నాటి ఒక భారీ రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
37 ఏళ్ల అమర్‌నాథ్ రికార్డ్ ఖతం
Image Credit : Rohit Sharma\BCCI

37 ఏళ్ల అమర్‌నాథ్ రికార్డ్ ఖతం

భారత్ తరఫున వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో హాఫ్ సెంచరీ లేదా అంతకంటే ఎక్కువ స్కోరు సాధించిన అత్యంత వృద్ధ క్రికెటర్‌గా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఈ విషయంలో మాజీ భారత క్రికెటర్ మొహిందర్ అమర్‌నాథ్ పేరిట ఉన్న పాత రికార్డును రోహిత్ చెరిపేశాడు.

15 అక్టోబర్ 1989లో షార్జాలో పాకిస్తాన్‌పై అమర్‌నాథ్ 80 బంతుల్లో 88 రన్స్ చేసినప్పుడు ఆయన వయసు 39 సంవత్సరాల 21 రోజులు. కాగా, 20 జూన్ 2026 న ఆఫ్ఘనిస్తాన్‌పై 79 పరుగులు చేసిన రోహిత్ శర్మ వయసు 39 సంవత్సరాల 51 రోజులు. దీంతో భారత్ తరఫున ఈ ఘనత సాధించిన అత్యంత పెద్ద వయస్కుడిగా రోహిత్ నిలిచాడు.

35
వన్డేల్లో 50+ స్కోర్ చేసిన టాప్ ఇండియన్స్ వీరే
Image Credit : AFP

వన్డేల్లో 50+ స్కోర్ చేసిన టాప్ ఇండియన్స్ వీరే

భారత్ తరఫున వన్డేల్లో అత్యంత ఎక్కువ వయసులో యాభై ప్లస్ స్కోరు చేసిన టాప్ 5 ప్లేయర్స్ లిస్ట్ గమనిస్తే..

1. రోహిత్ శర్మ: (39 సంవత్సరాల, 51 రోజులు) - 79 పరుగులు

2. మొహిందర్ అమర్‌నాథ్: (39 సంవత్సరాల, 21 రోజులు) - 88 పరుగులు

3. సచిన్ టెండూల్కర్: (38 సంవత్సరాల, 329 రోజులు) - 52 పరుగులు

4. సచిన్ టెండూల్కర్: (38 సంవత్సరాల, 327 రోజులు) - 114 పరుగులు

5. రాహుల్ ద్రవిడ్: (38 సంవత్సరాల, 248 రోజులు) - 69 పరుగులు

45
వరల్డ్ రికార్డు ఎవరి పేరిట ఉందంటే?
Image Credit : AFP

వరల్డ్ రికార్డు ఎవరి పేరిట ఉందంటే?

ప్రపంచ వన్డే క్రికెట్‌లో అత్యంత ఎక్కువ వయసులో యాభై ప్లస్ స్కోరు చేసిన రికార్డు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) బ్యాట్స్‌మెన్ ఖుర్రమ్ ఖాన్ పేరిట ఉంది. 2 డిసెంబర్ 2014న దుబాయ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 80 బంతుల్లో నాటౌట్‌గా 85 రన్స్ చేసినప్పుడు ఖుర్రమ్ ఖాన్ వయసు 43 సంవత్సరాల 164 రోజులు. వన్డేల్లో సెంచరీ కొట్టిన ప్రపంచంలోనే అత్యంత వృద్ధ ఆటగాడు కూడా ఇతనే.

30 నవంబర్ 2014న దుబాయ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 132 రన్స్ చేసినప్పుడు అతని వయసు 43 సంవత్సరాల 162 రోజులు. ఇక టెస్ట్ ఆడే దేశాల పరంగా చూస్తే, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ మహ్మద్ నబీ అత్యంత వృద్ధ క్రికెటర్‌గా ఉన్నాడు. 14 అక్టోబర్ 2025న అబుదాబిలో బంగ్లాదేశ్‌పై 37 బంతుల్లో 62 రన్స్ చేసినప్పుడు నబీ వయసు 40 సంవత్సరాల 286 రోజులు.

55
రాహుల్ ద్రవిడ్‌ను దాటేసిన హిట్ మ్యాన్
Image Credit : Getty

రాహుల్ ద్రవిడ్‌ను దాటేసిన హిట్ మ్యాన్

రోహిత్ శర్మ వన్డే కెరీర్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం ఇది 95వ సారి. ఈ ఇన్నింగ్స్‌తో రోహిత్.. భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను వెనక్కి నెట్టాడు. ద్రవిడ్ వన్డేల్లో 94 సార్లు యాభై ప్లస్ స్కోర్లు (12 సెంచరీలు, 82 హాఫ్ సెంచరీలు) చేశాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు 33 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలతో 95 సార్లు ఈ ఘనత సాధించాడు. భారత్ తరఫున వన్డేల్లో రోహిత్ కంటే ఎక్కువ సార్లు 50+ స్కోర్లు చేసిన వారిలో సచిన్ టెండూల్కర్ (145 సార్లు), విరాట్ కోహ్లీ (131 సార్లు) మాత్రమే ముందున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Related Stories
Recommended image1
Ira Aery : క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఆల్‌రౌండర్.. ఈ ముక్కుపుడక సుందరి ఎవరో తెలిస్తే షాకవుతారు !
Recommended image2
India Map Sri Lanka : ఇండియా మ్యాప్‌లో శ్రీలంక ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved