MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • Ira Aery : క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఆల్‌రౌండర్.. ఈ ముక్కుపుడక సుందరి ఎవరో తెలిస్తే షాకవుతారు !

Ira Aery : క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఆల్‌రౌండర్.. ఈ ముక్కుపుడక సుందరి ఎవరో తెలిస్తే షాకవుతారు !

Most Beautiful All Rounder in Cricket : ఆస్ట్రేలియా అండర్-19 మహిళా క్రికెట్ జట్టులో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల ఇరా ఏరి సంచలనం సృష్టిస్తోంది. తన అద్భుతమైన ఆటతో, అందంతో సోషల్ మీడియాలో కొత్త క్రష్‌గా మారింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 19 2026, 10:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆసీస్ క్రికెట్‌లో సరికొత్త స్టార్ ఇరా ఏరి
Image Credit : X/anjanasammu

ఆసీస్ క్రికెట్‌లో సరికొత్త స్టార్ ఇరా ఏరి

ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ ప్రపంచంలో ఒక కొత్త స్టార్ దూసుకొస్తోంది. భారత సంతతికి చెందిన 17 ఏళ్ల యంగ్ ఆల్‌రౌండర్ ఇరా ఏరి తన అద్భుతమైన ఆటతోనే కాదు, మనసు దోచే అందంతోనూ క్రికెట్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియా అండర్-19 మహిళా జట్టులో కీలక ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకుంది. తన టాలెంట్‌తో ఫ్యూచర్ సూపర్‌స్టార్‌గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఈ ముక్కుపుడక సుందరి పేరు మార్మోగిపోతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మన ఇండియన్ రూట్స్.. ఆస్ట్రేలియాలో రైజింగ్ స్టార్
Image Credit : Getty

మన ఇండియన్ రూట్స్.. ఆస్ట్రేలియాలో రైజింగ్ స్టార్

ఇరా ఏరి 2009 ఫిబ్రవరి 25న ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో ఉన్న హైడెల్‌బర్గ్‌లో జన్మించింది. అక్కడే సెటిల్ అయిన ఒక భారతీయ కుటుంబానికి చెందిన అమ్మాయి ఈమె. చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే ఇరాకు పిచ్చి ప్రేమ. స్థానిక క్లబ్‌లలో ఆడుతూ తన టాలెంట్ ఏంటో అందరికీ చూపించింది. స్కూల్ లెవెల్ టోర్నమెంట్లలో ఇరా ఆడిన ఆటతీరును చూసి కోచ్‌లు సైతం ఫిదా అయ్యారు. అలా చిన్న వయసులోనే క్రికెట్ గ్రౌండ్‌లో తనేంటో నిరూపించుకుంది.

35
విక్టోరియా జూనియర్ నుండి జాతీయ జట్టు దాకా
Image Credit : Getty

విక్టోరియా జూనియర్ నుండి జాతీయ జట్టు దాకా

ఆస్ట్రేలియాలోని విక్టోరియా వెస్ట్రన్ రీజన్ జూనియర్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఇరా ఏరి క్రికెట్ జర్నీ స్టార్ట్ అయింది. కఠినమైన క్రమశిక్షణ, బెస్ట్ ఫిట్‌నెస్, ఆటపై ఉన్న అంకితభావంతో ఆమె స్టెప్ బై స్టెప్ పైకి ఎదిగింది. తక్కువ టైమ్‌లోనే స్టేట్ లెవెల్ టీమ్స్‌లో ప్లేస్ సంపాదించింది. ఆ తర్వాత తన కెరీర్‌లో బిగ్గెస్ట్ మైల్‌స్టోన్ రీచ్ అయింది. ఆస్ట్రేలియా మహిళా అండర్19 నేషనల్ టీమ్‌కు సెలెక్ట్ అయి అందరి దృష్టిని ఆకర్షించింది.

45
ట్రై సిరీస్‌లో వికెట్ల వేట.. ఇంగ్లాండ్‌పై మైండ్ బ్లోయింగ్ షో
Image Credit : X/anjanasammu

ట్రై సిరీస్‌లో వికెట్ల వేట.. ఇంగ్లాండ్‌పై మైండ్ బ్లోయింగ్ షో

ఇటీవల బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన అండర్-19 మహిళల ట్రై సిరీస్‌లో ఇరా ఏరి వికెట్ల వేట సాగించింది. ఈ టోర్నమెంట్‌లో కేవలం 9 యావరేజ్‌తో ఏకంగా 13 వికెట్లు పడగొట్టి, జాయింట్ లీడింగ్ వికెట్ టేకర్ గా రికార్డు క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 26 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీయడమే కాకుండా, ఒక కీలక రనౌట్ కూడా చేసింది. దాంతో ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

అలాగే శ్రీలంకతో జరిగిన తక్కువ స్కోరింగ్ మ్యాచ్‌లోనూ 19 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 99 రన్స్ డిఫెండ్ చేసుకుంటూ 3 రన్స్ తేడాతో గెలిచినప్పటికీ, ఇరా బౌలింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం హైలైట్‌గా నిలిచింది. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీస్తూ ప్రెజర్ పెట్టే ఇరా కెపాసిటీ సెలెక్టర్లను బాగా ఇంప్రెస్ చేసింది.

55
సీనియర్ టీమ్‌లోకి ఎంట్రీ.. సోషల్ మీడియాలో కొత్త క్రష్
Image Credit : X/anjanasammu

సీనియర్ టీమ్‌లోకి ఎంట్రీ.. సోషల్ మీడియాలో కొత్త క్రష్

ప్రస్తుతం ఆస్ట్రేలియా నేషనల్ క్రికెట్ సెలెక్టర్లు ఇరా ఏరి ఆటను చాలా క్లోజ్‌గా అబ్సర్వ్ చేస్తున్నారు. ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే, ఆమె త్వరలోనే ఆస్ట్రేలియా సీనియర్ మహిళల జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం. ఆల్‌రౌండర్‌గా బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ రాణించగలగడం ఆమెకు పెద్ద ప్లస్ పాయింట్.

మరోవైపు, సోషల్ మీడియాలో ఇరా ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె లుక్స్, ఫిట్‌నెస్ చూసి అభిమానులు క్రష్‌గా ఫీలవుతున్నారు. కొందరైతే ఆమెను ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఎల్లీస్ పెర్రీతో పోల్చుతున్నారు. అయితే ఇరా మాత్రం తన సొంత టాలెంట్‌తోనే వరల్డ్ వైడ్‌గా క్రికెట్ లవర్స్ గుండెల్లో స్థానం సంపాదిస్తోంది.

New beautiful Australian Cricketer 💙😍 Iraahaery 🔥 pic.twitter.com/PSQfXUCJbz

— A ɴ ᴊ ᴀ ɴ ᴀ ᥫ᭡ (@anjanasammu) June 16, 2026

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Related Stories
Recommended image1
Water Bar Trend: పెళ్లిళ్లలో సరికొత్త క్రేజ్.. మందు బార్లకు పోటీగా వస్తున్న వాటర్ బార్స్! అసలు ఏంటివి?
Recommended image2
Women's T20 World Cup: టీమిండియాకు బిగ్ షాక్.. వరల్డ్ కప్ మధ్యలోనే స్టార్ ప్లేయర్ అవుట్.. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన ఆర్సీబీ బ్యూటీ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved