MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Jadeja: జడ్జూ.. ఏంటీ కసి? సీఎస్‌కే వికెట్ తీసి గన్‌తో కాల్చినంత పని చేసిన జడేజా

Jadeja: జడ్జూ.. ఏంటీ కసి? సీఎస్‌కే వికెట్ తీసి గన్‌తో కాల్చినంత పని చేసిన జడేజా

Ravindra Jadeja : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన రవీంద్ర జడేజా, తన పాత జట్టు సీఎస్‌కేపై అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. కీలకమైన రెండు వికెట్లు తీసిన తర్వాత గన్ ఫైర్ సెలబ్రేషన్‌తో సోషల్ మీడియాను ఊపేస్తున్నాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 31 2026, 04:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
17 ఏళ్ల తర్వాత రాజస్థాన్ జెర్సీలో జడేజా ఊచకోత
Image Credit : PTI

17 ఏళ్ల తర్వాత రాజస్థాన్ జెర్సీలో జడేజా ఊచకోత

ఐపీఎల్ 2026 సీజన్ క్రికెట్ అభిమానులకు ఊహించని మలుపులను, భావోద్వేగాలను అందిస్తోంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సర్ రవీంద్ర జడేజా తన పాత జట్టు రాజస్థాన్ రాయల్స్‌లోకి తిరిగి రావడం. గత ఏడాది వరకు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులో కీలక ఆయుధంగా ఉన్న జడేజా, ఈసారి రాజస్థాన్ జెర్సీలో తన మాజీ జట్టుపైనే విరుచుకుపడ్డాడు. సోమవారం గువహటిలో జరిగిన మ్యాచ్‌లో జడేజా తన బౌలింగ్‌తోనే కాకుండా, తన దూకుడుతో కూడిన సెలబ్రేషన్‌తో వార్తల్లో నిలిచాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
శివమ్ దూబే అవుట్.. జడేజా గన్ సెలబ్రేషన్ వైరల్
Image Credit : X/rajasthanroyals

శివమ్ దూబే అవుట్.. జడేజా గన్ సెలబ్రేషన్ వైరల్

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న జడేజా, సీఎస్‌కే బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ముఖ్యంగా 8వ ఓవర్‌లో కెప్టెన్ రియాన్ పరాగ్ బంతిని జడేజాకు అందించగా, రెండో బంతికే సీఎస్‌కే ఇంపాక్ట్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్‌ను ఎల్బీడబ్ల్యూ చేసి పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే తొలి బంతికే సిక్సర్ కొట్టి జడేజాను ఊరించాడు. అయితే అదే ఓవర్ చివరి బంతికి జడేజా ప్రతీకారం తీర్చుకున్నాడు. దూబేను రవి బిష్ణోయ్ చేతికి చిక్కేలా చేసి అవుట్ చేశాడు. వికెట్ తీసిన ఆనందంలో జడేజా మైదానం మధ్యలో గన్ ఫైర్ సెలబ్రేషన్ చేస్తూ కనిపించాడు. ఇది చూసిన సీఎస్‌కే అభిమానులు నీకు పాత ఇంటి జ్ఞాపకాలు రావడం లేదా జడ్జూ? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Good morning from Banna 💗🔥pic.twitter.com/gzhzPMs61z

— Rajasthan Royals (@rajasthanroyals) March 31, 2026

35
17 ఏళ్ల తర్వాత రాజస్థాన్ గూటికి జడేజా.. అరుదైన రికార్డు
Image Credit : X/rajasthanroyals

17 ఏళ్ల తర్వాత రాజస్థాన్ గూటికి జడేజా.. అరుదైన రికార్డు

రవీంద్ర జడేజాకు రాజస్థాన్ రాయల్స్ జట్టుతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 2008లో ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో షేన్ వార్న్ నాయకత్వంలోని రాజస్థాన్ జట్టులోనే జడేజా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. 2009 తర్వాత ఆ జట్టుకు దూరమైన జడేజా, సరిగ్గా 17 ఏళ్ల తర్వాత మళ్లీ అదే జెర్సీని ధరించాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున రెండు మ్యాచ్‌ల మధ్య జడేజా ఏకంగా 214 మ్యాచ్‌లు కోల్పోయాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే జట్టు తరపున ఆడేందుకు ఇంత సుదీర్ఘ విరామం తీసుకున్న ఆటగాళ్ల జాబితాలో జడేజా మూడవ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో భువనేశ్వర్ కుమార్ (238 మ్యాచ్‌లు - RCB) అగ్రస్థానంలో ఉండగా, కర్ణ్ శర్మ (225 మ్యాచ్‌లు - RCB) రెండో స్థానంలో ఉన్నారు.

45
కుప్పకూలిన చెన్నై బ్యాటింగ్.. ఆదుకున్న ఓవర్టన్
Image Credit : X/rajasthanroyals

కుప్పకూలిన చెన్నై బ్యాటింగ్.. ఆదుకున్న ఓవర్టన్

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు రాజస్థాన్ బౌలర్ల ధాటికి తలవంచారు. నిర్ణీత ఓవర్లలో సీఎస్‌కే కేవలం 127 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ 36 బంతుల్లో 43 పరుగులు చేసి జట్టును ఆదుకోకపోయి ఉంటే సీఎస్‌కే స్కోరు 100 కూడా దాటేది కాదు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కేవలం 6 పరుగులకే అవుట్ అయి నిరాశపరిచాడు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు తీసి సీఎస్‌కే పతనాన్ని శాసించారు.

55
నిరాశపరిచిన సంజూ శాంసన్
Image Credit : X/rajasthanroyals

నిరాశపరిచిన సంజూ శాంసన్

ఒకవైపు రవీంద్ర జడేజా తన పాత జట్టుపై అద్భుతంగా రాణించగా, సీఎస్‌కే తరపున ఆడుతున్న సంజూ శాంసన్ మాత్రం తన పాత జట్టు ఆర్ఆర్ పై పై ప్రభావం చూపలేకపోయాడు. కేవలం 6 పరుగులు మాత్రమే చేసిన సంజూ, నండ్రే బర్గర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. జడేజా తన 3 ఓవర్ల కోటాలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టి అద్భుతంగా ఆర్ఆర్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
RR vs CSK : ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ ఘోర ఓటమి.. అసలు కారణం ఇదే
Recommended image2
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిన వైభవ్ సూర్యవంశీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved