MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • RR vs CSK : ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ ఘోర ఓటమి.. అసలు కారణం ఇదే

RR vs CSK : ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ ఘోర ఓటమి.. అసలు కారణం ఇదే

RR vs CSK : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయం పాలైంది. వైభవ్ సూర్యవంశీ మెరుపు హాఫ్ సెంచరీతో రాజస్థాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 31 2026, 12:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తడబడిన సీఎస్కే బ్యాటింగ్ ఆర్డర్
Image Credit : X@IPL

తడబడిన సీఎస్కే బ్యాటింగ్ ఆర్డర్

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రారంభం నుంచే ఇబ్బందుల్లో పడింది. గౌహతి పిచ్‌పై తేమ ఉండటంతో రాజస్థాన్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్ అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రారంభంలోనే మూడు కీలక వికెట్లు తీశారు. చెన్నై బ్యాటర్లు పిచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడటంలో విఫలమయ్యారు. అనుభవం లేని మిడిల్ ఆర్డర్ ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. జేమీ ఓవర్టన్ చేసిన 43 పరుగులే ఆ జట్టులో అత్యధికం కావడం వారి బ్యాటింగ్ వైఫల్యానికి అద్దం పడుతోంది.

25
ధోనీ లోటు కనిపించింది..
Image Credit : X/@mufaddal_vohra

ధోనీ లోటు కనిపించింది..

ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టుకు ఎంఎస్ ధోనీ ఆన్ ఫీల్డ్ మెంటర్ షిప్ లేకపోవడం పెద్ద లోటుగా కనిపించింది. యువ ఆటగాళ్లతో కూడిన జట్టుకు క్లిష్ట పరిస్థితుల్లో మార్గనిర్దేశం చేసే అనుభవజ్ఞుడైన ఆటగాడు లేకపోవడంతో సీఎస్కే 127 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా పిచ్ పరిస్థితులు కఠినంగా ఉన్నాయని, ఆరంభంలో బౌలర్లు అద్భుతమైన లెంగ్త్‌లో బౌలింగ్ చేశారని పేర్కొన్నారు.

Related Articles

Related image1
IPL 2026 : రికార్డుల మోత మోగించిన హిట్ మ్యాన్ సేన
Related image2
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిన వైభవ్ సూర్యవంశీ
35
రవీంద్ర జడేజా స్పిన్ మ్యాజిక్
Image Credit : Instagram@CSK/RR

రవీంద్ర జడేజా స్పిన్ మ్యాజిక్

గతంలో చెన్నై జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న రవీంద్ర జడేజా, ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ తన పాత జట్టును దెబ్బతీశాడు. తన మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు తీసి చెన్నై వెన్ను విరిచాడు. గౌహతి వికెట్ స్పిన్‌కు సహకరిస్తుందని గ్రహించి, సరైన ఏరియాల్లో బౌలింగ్ చేస్తూ 18 పరుగులకే 2 వికెట్లు పడగొట్టాడు.

45
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
Image Credit : X/IPL

వైభవ్ సూర్యవంశీ విధ్వంసం

128 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కలలో కూడా ఊహించని ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మొదటి బంతికే క్యాచ్ డ్రాప్ కావడంతో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న అతను, దుమ్మురేపాడు. పవర్‌ప్లేలోనే 74 పరుగులు రావడంతో మ్యాచ్ అప్పటికే రాజస్థాన్ వైపు వెళ్లింది. వైభవ్ 17 బంతుల్లో 52 పరుగులు చేసి ఔటైనప్పటికీ, అప్పటికే చెన్నై ఓటమి ఖాయమైంది.

55
సీఎస్కే బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలు
Image Credit : Getty

సీఎస్కే బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలు

స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో చెన్నై బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. మాట్ హెన్రీ తన మొదటి ఓవర్లోనే 18 పరుగులు సమర్పించుకున్నాడు. ఫీల్డింగ్ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. మొదటి ఓవర్లోనే సూర్యవంశీ ఇచ్చిన క్యాచ్‌ను కార్తీక్ శర్మ జారవిడవడం చెన్నై కొంపముంచింది. అలాగే, రివ్యూలను ఉపయోగించుకోవడంలో కూడా చెన్నై విఫలమైంది. మొత్తానికి ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించి సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిన వైభవ్ సూర్యవంశీ
Recommended image2
IPL Rules : ఐపీఎల్‌లో జట్ల తెలివితేటలకు చెక్...! డీఆర్ఎస్ రూల్‌ను మార్చేసిన బీసీసీఐ
Recommended image3
IPL 2026 : రికార్డుల మోత మోగించిన హిట్ మ్యాన్ సేన
Related Stories
Recommended image1
IPL 2026 : రికార్డుల మోత మోగించిన హిట్ మ్యాన్ సేన
Recommended image2
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిన వైభవ్ సూర్యవంశీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved