MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Akula Sreeja : పారిస్ ఒలింపిక్స్ లో చ‌రిత్ర సృష్టించిన తెలుగ‌మ్మాయి ఆకుల శ్రీజ

Akula Sreeja : పారిస్ ఒలింపిక్స్ లో చ‌రిత్ర సృష్టించిన తెలుగ‌మ్మాయి ఆకుల శ్రీజ

Paris Olympics 2024:  26 ఏళ్ల భార‌త‌ టేబుల్ టెన్నిస్ స్టార్ శ్రీజ ఆకుల టేబుల్ టెన్నిస్ ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. జియాన్ జెంగ్‌ను ఓడించి మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్స్‌లో చేరింది. ఇప్పటికే మరో భారత ప్లేయర్ మనిక బాత్రా కూడా ఈ రౌండ్ కు చేరుకుంది. 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 31 2024, 08:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రౌండ్ 32 మ్యాచ్‌లో సింగపూర్‌కు చెందిన జియాన్ జెంగ్‌పై 4-2 తేడాతో గెలిచి ఒలింపిక్స్ ప్రీ-క్వార్టర్‌ఫైనల్‌లోకి ప్రవేశించిన రెండో భారతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా ఆకుల శ్రీజ చ‌రిత్ర సృష్టించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
Sreeja akula

Sreeja akula

త‌న పుట్టిన రోజున అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో భార‌త్ కు మ‌రో మెడ‌ల్ అందించే దిశ‌గా పారిస్ ఒలింపిక్స్ లో ముంద‌డుగు వేసింది. ఒలింపిక్స్‌లో 16వ రౌండ్‌కు చేరిన తొలి భారతీయ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణిగా మణికా బ‌త్రా రికార్డు సృష్టించింది. ఆ త‌ర్వాత ఆకుల శ్రీజ కూడా ఒలింపిక్స్ లో 16వ రౌండ్ కు చేరుకుని సంచ‌న‌లం రేపింది. 

35

బుధ‌వారం సింగ‌పూర్‌కు చెందిన జియాన్ జెంగ్ తో హోరాహోరీగా త‌ల‌ప‌డిన శ్రీ‌జ 4-2తో మ్యాచ్ ను గెలుచుకుంది. మొద‌టి నుంచి ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో శ్రీజ అద్భుత ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించింది. 

45

ఆరంభంలో తొలి సెట్‌లో వెన‌క‌డినా ఆ త‌ర్వాత పుంజుకొని ప్ర‌త్య‌ర్థికి వ‌రుస‌గా షాకిచ్చింది. శ్రీ‌జ‌ 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10 తో విజ‌యాన్ని అందుకుంది. 

 

55
Akula Sreeja

Akula Sreeja

51 నిమిషాల పాటు సాగిన ఈ పోటీలో శ్రీజ ఓపెనింగ్ గేమ్‌లో ఓడినా, గట్టిపోటీనిచ్చి విజేతగా నిలిచింది. ప్రీక్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి సన్ యింగ్షాతో శ్రీజ తలపడనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
హైదరాబాద్
భారత దేశం
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL Playoffs : ఐపిఎల్ లో సెమీ ఫైనల్స్ ఎందుకుండవు? ఈ ప్లేఆఫ్స్ విధానమే ఎందుకు?
Recommended image2
Ram Charan: బుమ్రాకు క్షమాపణలు చెప్పిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఏం జరిగిందంటే?
Recommended image3
Rishabh Pant: రిషభ్ పంత్‌కు బిగ్ షాక్.. లక్నో కెప్టెన్సీ నుంచి ఔట్.. ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved