బలుపెక్కి బరితెగించిన పాక్.. ఆ మూడు కండిషన్లకు ఒప్పుకుంటేనే భారత్‌తో మ్యాచ్
Pakistan: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB) టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్‌తో జరగాల్సిన ఫిబ్రవరి 15 మ్యాచ్‌ను బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు యూటర్న్ తీసుకుని ఐసీసీతో కీలక చర్చలు జరుపుతోంది.

పాక్ యూ టర్న్..
టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగడంపై ఇంకా ఉత్కంఠ నెలకొంది. పాకిస్తాన్ ముందుగా ఈ మ్యాచ్‌ను బహిష్కరించినట్టు ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ నిర్ణయంపై పునరాలోచనలో ఉంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB) ఐసీసీతో చర్చలు కొనసాగిస్తోంది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఈ మ్యాచ్ టోర్నమెంట్‌లో హై-వోల్టేజ్‌గా జరగనుంది. అంతేకాదు, దీనిపై ICC-PCB మధ్య రహస్య చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
బహిష్కరణ వెనుక కారణాలు
పాకిస్తాన్ తన నిర్ణయాన్ని వెనకేసుకొచ్చింది. బంగ్లాదేశ్ జట్టుకు తోడుగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతోంది. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ల నుంచి బంగ్లాదేశ్ జట్టు తప్పుకుంటున్నప్పుడు.. ఐసీసీ చూస్తూ ఉండిపోయిందని.. ఈ ఫోర్సెడ్ వేటుపై తాము నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. అయితే ఐసీసీ ఇది సరైన కారణం కాదని.. తీవ్ర చర్యలు ఎదురవుతాయని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఒక మెట్టు దిగి పీసీబీ.. ICCతో మళ్లీ చర్చలు ప్రారంభించింది.
ICC-PCB చర్చలు
ఈ నేపధ్యంలోనే పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఐసీసీ డిప్యూటీ చైర్మన్‌తో సమావేశమయ్యారు. మ్యాచ్‌ను రద్దు చేస్తే భారీగా ఆర్థిక నష్టాలు వస్తాయని ఐసీసీ చెబుతుంటే.. కేవలం మూడు కండిషన్లతోనే తాము ఈ మ్యాచ్ ఒప్పుకుంటామని పీసీబీ పేర్కొంది. ఒకవేళ అలా ఒప్పుకోకపోతే ససేమిరా మ్యాచ్ జరగదని చెబుతోంది.
మూడు కండిషన్లు ఇవే..
ఐసీసీ రెవిన్యూ షేర్ పెంచడం, అలాగే టీమిండియాతో గతంలో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లు పున: ప్రారంభించడం.. వీటితో పాటు హ్యాండ్ షేక్‌ల ప్రోటోకాల్ అమలులోకి రావాలని పీసీబీ పట్టుబడుతోంది. దీనిపై ఐసీసీ, బీసీసీఐ ఏ మేరకు నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి. మ్యాచ్ సమయం దగ్గర పడుతుండటంతో.. మరో రెండు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
శ్రీలంక బోర్డు ఒత్తిడి..
అటు శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా పాకిస్తాన్ బోర్డును పునరాలోచన చేయాలని కోరింది. మ్యాచ్ రద్దు అయితే పర్యాటక ఆదాయం కోల్పోతామని చెప్పింది. పాక్ నిర్ణయం టీ20 ప్రపంచకప్ మొత్తం మీద ఆర్థిక ప్రభావం చూపుతుందని తెలిపింది. మరి ఇలాంటి సూచనల మధ్య ఐసీసీ, పీసీబీ చర్చలు ఎలాంటి ఫైనల్ డెసిషన్ కు దారి తీస్తాయో చూడాలి.

