MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • T20 World Cup 2026 : మిలింద్ కుమారా ఏంటా పిచ్చి పని? ఇషాన్ కిషన్ దెబ్బకు మైండ్ బ్లాక్

T20 World Cup 2026 : మిలింద్ కుమారా ఏంటా పిచ్చి పని? ఇషాన్ కిషన్ దెబ్బకు మైండ్ బ్లాక్

Ishan Kishan Stumping : ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లో అమెరికా బ్యాటర్ మిలింద్ కుమార్ వింతగా అవుట్ అయ్యారు. ఇషాన్ కిషన్ చాకచక్యంగా వ్యవహరించి చేసిన స్టంపింగ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 08 2026, 04:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇషాన్ కిషన్ తెలివికి అమెరికా ప్లేయర్ బలి.. ఈ వింత స్టంపింగ్ చూడాల్సిందే!
Image Credit : Getty

ఇషాన్ కిషన్ తెలివికి అమెరికా ప్లేయర్ బలి.. ఈ వింత స్టంపింగ్ చూడాల్సిందే!

ముంబైలోని వాంఖడే స్టేడియంలో శనివారం జరిగిన టీ20 ప్రపంచ కప్ 2026 మూడో మ్యాచ్‌లో భారత్, అమెరికా జట్లు తలపడ్డాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో టీమిండియా 29 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో అమెరికా బ్యాటర్ మిలింద్ కుమార్ అవుట్ అయిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. క్రీజులో పాతుకుపోయి ప్రమాదకరంగా మారుతున్న సమయంలో, మిలింద్ కుమార్ బ్రెయిన్ ఫేడ్ నిర్ణయం అతడి వికెట్‌ను బలితీసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
IND vs USA మ్యాచ్ ను మలుపు తిప్పిన 12వ ఓవర్
Image Credit : Getty

IND vs USA మ్యాచ్ ను మలుపు తిప్పిన 12వ ఓవర్

అమెరికా ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వేసిన ఆఖరి బంతిని మిలింద్ కుమార్ అంచనా వేయడంలో విఫలమయ్యాడు. అది ఒక అద్భుతమైన గూగ్లీ. బంతి మిలింద్ బ్యాట్‌ను తప్పించుకుని నేరుగా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ చేతుల్లోకి వెళ్ళింది. అయితే, కిషన్ ఆ బంతిని మొదట సరిగ్గా అందుకోలేకపోయాడు. బంతి అతడి చేతుల్లోంచి కాస్త జారి పక్కకు వెళ్లింది.

36
మిలింద్ కుమార్ బ్రెయిన్ ఫేడ్
Image Credit : Getty

మిలింద్ కుమార్ బ్రెయిన్ ఫేడ్

బంతి కీపర్ చేతుల్లోంచి జారిపోవడం చూసిన మిలింద్ కుమార్, అది వెనుకకు వెళ్ళిందని భావించి సింగిల్ తీయడానికి క్రీజు వెలుపలికి అడుగు వేశాడు. బంతి ఎక్కడుందో తెలియకుండానే అతను ముందుకు వచ్చాడు. కానీ, కిషన్ వెంటనే తేరుకుని గాల్లో ఉన్న బంతిని అందుకుని రెప్పపాటు కాలంలో బెయిల్స్‌ను ఎగరగొట్టాడు. దీంతో 34 పరుగుల వద్ద మిలింద్ కుమార్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. అతను 34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో నిలకడగా ఆడుతున్న సమయంలో ఈ వింత అవుట్ అమెరికా జట్టును కోలుకోలేని దెబ్బ తీసింది.

Varun Chakaravarthy to Milind Kumar — st Kishan, 34(34).
Pressure creates mistakes. 💥
#INDvsUSA #T20WorldCup #T20WC2026 pic.twitter.com/sxN9W1dj8X

— Pahari Pulse (@paharipulse) February 7, 2026

46
సూర్యకుమార్ యాదవ్ వీరోచిత ఇన్నింగ్స్
Image Credit : Mufaddal Vohra X Page

సూర్యకుమార్ యాదవ్ వీరోచిత ఇన్నింగ్స్

అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్ ఆరంభంలో తడబడింది. ఒక దశలో 13 ఓవర్లలో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అప్పుడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. కేవలం 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 84 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.

56
భారత బౌలర్ల ధాటి.. అమెరికా పతనం
Image Credit : BCCI

భారత బౌలర్ల ధాటి.. అమెరికా పతనం

162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. మహమ్మద్ సిరాజ్ రెండో ఓవర్లోనే ఆండ్రీస్ గౌస్‌ను అవుట్ చేయగా, అర్ష్‌దీప్ సింగ్ కెప్టెన్ మోనాంక్ పటేల్‌ను డకౌట్ చేశాడు. మిలింద్ కుమార్ (34), సంజయ్ కృష్ణమూర్తి (37) నాలుగో వికెట్‌కు 58 పరుగులు జోడించి ఆశలు చిగురింపజేశారు. అయితే మిలింద్ అవుట్ అయ్యాక అమెరికా వరుసగా వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ ఒకే ఓవర్లో సంజయ్, హర్మీత్ సింగ్ వికెట్లు తీసి విజయాన్ని ఖాయం చేశాడు. అమెరికా చివరకు 8 వికెట్ల నష్టానికి 132 పరుగులకే పరిమితమైంది.

66
టీమిండియా చరిత్రాత్మక రికార్డు
Image Credit : Getty

టీమిండియా చరిత్రాత్మక రికార్డు

ఈ విజయంతో టీమిండియా టీ20 ప్రపంచ కప్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచ కప్‌లో వరుసగా 9వ విజయాన్ని నమోదు చేసి, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా (8 వరుస విజయాలు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. అలాగే, వాంఖడే స్టేడియంలో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యంత తక్కువ స్కోరును డిఫెండ్ చేసిన జట్టుగా భారత్ నిలిచింది. మహమ్మద్ సిరాజ్ 3 వికెట్లతో చెలరేగగా, అర్ష్‌దీప్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Most Centuries: సచిన్ నుంచి కోహ్లీ వరకు.. క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే
Recommended image2
Virat Kohli: రిటైర్మెంట్ పై అభిమానుల గుండె పగిలే వార్త చెప్పిన కోహ్లీ
Recommended image3
Virat Kohli: విరాట్ కోహ్లీ విధ్వంసం.. ఒకే సెంచరీతో 10 సంచలన రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
India vs USA : వాంఖడేలో సూర్య ప్రతాపం.. అమెరికా ఖేల్ ఖతం.. భారత్ సంచలన విజయం
Recommended image2
Suryakumar Yadav : చితక్కొట్టిన సూర్యభాయ్ ! బాబర్, కోహ్లీ రికార్డులు బద్ధలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved