Sachin Tendulkar: సరిగ్గా 34 ఏళ్ల క్రితం ఓ అద్భుతం.. ఆనాటి 16 ఏళ్ల కుర్రాడు.. క్రికెట్ దేవుడయ్యాడు!
Sachin Tendulkar: భారత క్రికెట్ చరిత్రలో ఈరోజు మరపురాని రోజు. సరిగ్గా 34 ఏండ్ల క్రితం (నవంబర్ 15, 1989) ఓ 16 ఏళ్ల కుర్రాడు కరాచీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. వసీం అక్రమ్, వకార్ యూనిస్ వంటి దిగ్గజాలున్న పాకిస్తాన్ బౌలింగ్ దాడిని ఎదుర్కొన్న ఆ ఆటగాడు ఆరోజు అల్ప స్కోర్ కే (15 పరుగులు) ఔట్ అయ్యాడు. ఆ రోజు క్రికెట్ ప్రపంచానికి తెలియదు.
Sachin Tendulkar
ఆనాడు ప్రారంభమైన ఆ కుర్రాడి ప్రయాణం కొత్త చరిత్రకు నాంది పలుకుతుందని. ఆ తర్వాత కొద్దీ రోజులకే టీమిండియాలో ఆ ఆటగాడు కీలక ప్లేయర్ గా మారాడు. ఆ ఆటగాడు తన 24 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో అద్భుతాలు స్రుష్టించి.. క్రికెట్ కు దేవుడయ్యాడు. అతడే.. సచిన్ టెండూల్కర్. లిటిల్ మాస్టర్, మాస్టర్ బాస్టర్, క్రికెట్ రారాజు ఇలా ఎన్నో ముద్దు పేర్లతో పిల్చుకుంటారు సచిన్ అభిమానులు.
Sachin Tendulkar
16 ఏళ్ల యువ సచిన్ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ను భారత చిరకాల ప్రత్యర్ధి పాక్ పై ఆడాడు. నవంబర్ 15, 1989న కరాచీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 409 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు వచ్చిన టీమిండియా తడబడింది. కేవలం 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల లోతు కష్టాల్లో పడింది.
Sachin Tendulkar
ఈ సమయంలో సచిన్ క్రీజులోకి అడుగు పెట్టాడు. 24 బంతులాడి.. కేవలం 15 పరుగులు చేశాడు. కానీ, ఈ సిరీస్ తర్వాత టీమిండియా జట్టులో సచిన్ కీలక ప్లేయర్ గా మారిపోయాడు. అలా ప్రారంభమైన తన కెరీర్ ఎన్నో రికార్డు క్రియేట్ చేశారు. కేవలం 17 ఏళ్లలోనే సచిన్ తన తొలి టెస్టు సెంచరీని అది కూడా దిగ్గజ ఆస్ట్రేలియాపై చేశాడు. అంతేకాదు.. ఈ మ్యాచ్ లో భారత్‌ను ఓటమి నుంచి తప్పించాడు.
Sachin Tendulkar
సచిన్ తన కెరీర్ లో టీమిండియా తరపున 664 అంతర్జాతీయ మ్యాచులు ఆడారు. ఇందులో 34,357 పరుగులు చేసిన అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచారు. ఆడిన ప్రతి మ్యాచ్ లో పరుగుల వరద పరించి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. తన కేరీర్ లో 100 అంతర్జాతీయ సెంచరీలు, 164 అర్ధ సెంచరీలు చేశారు. తనకు ఎవరూ సాటిరారని నిరూపించారు. అలాగే.. వంద సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు.
Sachin Tendulkar
200 టెస్టులాడిన సచిన్ 15,921 పరుగులు చేశారు. ఇందులో 51 సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డే ఫార్మట్ లో కూడా ఎన్నో రికార్డులు నెలకొల్పారు. ఇందులో 18,426 పరుగులు చేశారు. అదే సమయంలో 201 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు. ఇలా సచిన్ తన కెరీర్ లో ఎన్నో సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. అతను 2011లో ICC క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు కావడం గమనార్హం.
Sachin Tendulkar
ఇక ఐపీఎల్ కూడా తన మార్క్ సెట్ చేశారు క్రికెట్ గాడ్. ముంబై ఇండియన్స్ తరపున 2008 నుంచి 2013 వరకు ఆరు IPL సీజన్‌లు ఆడారు. ఈ ఫార్మట్ లో 78 మ్యాచ్‌లలో 34.84 సగటుతో మొత్తం 2,334 పరుగులు చేశాడు. సచిన్ తన పేరు మీద 13 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ కూడా ఉంది. 2013 ఎడిషన్ టోర్నమెంట్‌ను ఫ్రాంచైజీతో ప్లేయర్‌గా గెలుచుకున్నాడు. IPL 2010లో సచిన్ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు.
Sachin Tendulkar
ఈ సీజన్ లో 15 మ్యాచ్‌లు ఆడిన సచిన్ 132.61 స్ట్రైక్ రేట్‌తో 618 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో సచిన్ ఐదు అర్ధశతకాలు చేశారు. ఆ సీజన్‌లో 'ఆరెంజ్ క్యాప్' గెలుచుకున్నాడు. కాగా..ఆ సీజన్‌లో ముంబాయి ఇండియన్స్ రన్నరప్‌గా నిలిచింది. 2013లో వెస్టిండీస్‌తో జరిగిన భారత సిరీస్‌లో సచిన్ తన రిటైర్మెంట్ ప్రకటించారు. తన అద్భుతమైన కెరీర్‌కు ముగింపు పలికారు. ఆ సమయంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగుల స్కోరర్‌గా సచిన్ నిలిచాడు.