MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • ఐపీఎల్ జట్ల కెప్టెన్ల పై కేఎల్ రాహుల్ సంచలన కామెంట్స్

ఐపీఎల్ జట్ల కెప్టెన్ల పై కేఎల్ రాహుల్ సంచలన కామెంట్స్

KL Rahul : ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఐపీఎల్ జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో కెప్టెన్లు ఎదుర్కొనే మానసిక, శారీరక ఒత్తిడిపై కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ సర్కిల్ మరో కొత్త చర్చకు తెరలేపారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 17 2025, 09:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐపీఎల్ కెప్టెన్సీ ఒత్తిడి ఊహించలేనిది: కేఎల్ రాహుల్
Image Credit : Facebook/Indian Cricket Team

ఐపీఎల్ కెప్టెన్సీ ఒత్తిడి ఊహించలేనిది: కేఎల్ రాహుల్

భారత స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ కేఎల్ రాహుల్ మరోసారి ఐపీఎల్ కెప్టెన్సీపై సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చారు. అంతర్జాతీయ క్రికెట్‌తో పోలిస్తే, ఐపీఎల్‌లో కెప్టెన్లు ఎదుర్కొనే భారం మాటల్లో చెప్పలేనిదని అన్నారు. కెప్టెన్సీ సమయంలో రెండు నెలల టోర్నీ ముగిసేనాటికి 10 నెలల అంతర్జాతీయ క్రికెట్ ఆడినంతకంటే ఎక్కువగా తన శరీరం, మనసు అలసిపోయేదని చెప్పారు.

2022–2024 మధ్య లక్నో సూపర్ జెయింట్స్‌ను నడిపించిన కేఎల్ రాహుల్, తన కెప్టెన్సీ రోజులలో ఎవరూ బయటకు చెప్పని అనేక అనుభవాలను ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
యజమానుల ప్రశ్నలే పెద్ద భారం
Image Credit : ANI

యజమానుల ప్రశ్నలే పెద్ద భారం

ఐపీఎల్ ఫ్రాంచైజీ యాజమాన్యాల నుంచి వచ్చే నిరంతర ఒత్తిడి కీలకమైన విషయమని కేఎల్ రాహుల్ చెప్పాడు. క్రీడా నేపథ్యం లేని వ్యక్తులు మ్యాచ్ వ్యూహాల గురించి నిరంతరం ప్రశ్నలు అడగడం కెప్టెన్లను మానసికంగా పూర్తిగా అలసిపోయేలా చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

“ఎందుకు ఆ మార్పు? ఎందుకు అతను ఆడాడు? ప్రత్యర్థి 200 పరుగులు చేస్తే మనం ఎలా 120కే ఆగిపోయాం?” వంటి ప్రశ్నలు ప్రతి సమావేశంలో ఎదురవుతాయని రాహుల్ వివరించారు.

“కొన్నిసార్లు ఇవన్నీ విచారణలాంటివిగా అనిపిస్తాయి” అనే కేఎల్ రాహుల్ వ్యాఖ్యలు భారత్‌లో ఫ్రాంచైజీ సంస్కృతిపై పెద్ద చర్చకు దారితీస్తోంది.

35
ఐపీఎల్-అంతర్జాతీయ క్రికెట్ ఎందుకు భిన్నం?
Image Credit : ANI

ఐపీఎల్-అంతర్జాతీయ క్రికెట్ ఎందుకు భిన్నం?

అంతర్జాతీయ జట్టులో కెప్టెన్సీ చేసిన అనుభవాన్ని పోల్చుతూ, అక్కడ ప్రశ్నల కంటే అవగాహన ఎక్కువగా ఉంటుందని రాహుల్ చెప్పాడు. కోచ్‌లు, సెలెక్టర్లు ఆటలోని సున్నితమైన వ్యూహాలు అర్థం చేసుకునే వారు కాబట్టి నిర్ణయాలను వివరించడం సులభమని తెలిపారు.

“ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలుస్తామన్న హామీ లేదని తెలిసినవారితో మాట్లాడడం సులభం. కానీ క్రీడా నేపథ్యం లేని వారిని నమ్మించడం చాలా కష్టం” అని ఆయన వ్యాఖ్యానించారు.

45
లక్నో ఘటన కేఎల్ రాహుల్ జీవితాన్నే మార్చిందా?
Image Credit : ANI

లక్నో ఘటన కేఎల్ రాహుల్ జీవితాన్నే మార్చిందా?

2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘోర ఓటమి తర్వాత ఎల్ఎస్జీ యజమాని సంజీవ్ గోయెంకా మైదానంలోనే రాహుల్‌తో చేసిన తీవ్రమైన చర్చ అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఆ వీడియోలు వైరల్ కావడంతో రాహుల్‌పై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. అదే సీజన్ అనంతరం రాహుల్ ఫ్రాంచైజీ నుంచి విడిపోయాడు.

2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆయనను రూ.14 కోట్లకు తీసుకుంది. అయితే అతడు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించకపోవడం గమనార్హం.

55
కేఎల్ రాహుల్ ఇంటర్వ్యూ ఎందుకు వైరల్ అవుతోంది?
Image Credit : ANI

కేఎల్ రాహుల్ ఇంటర్వ్యూ ఎందుకు వైరల్ అవుతోంది?

హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. క్రికెటర్లు భరించాల్సిన ఒత్తిడిని సాధారణ ప్రేక్షకుల ముందుకు తెచ్చినందుకు చాలా మంది అభిమానులు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. రాహుల్ తన అనుభవాల ద్వారా ఒక ప్రధాన సందేశాన్ని కూడా ఇచ్చారు.. “క్రీడలో ప్రతీది నియంత్రణలో ఉండదు. కానీ కెప్టెన్లు మాత్రం ప్రతీ నిర్ణయానికి జవాబుదారీగా ఉండాలి”. కేఎల్ రాహుల్ చేసిన ఈ కామెంట్స్ పై ఐపీఎల్ జట్లు ఎలా స్పందిస్తాయో చూడాలి మరి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
ఐపీఎల్ ఆక్షన్ : చెన్నై సూపర్ కింగ్స్ మాస్టర్ ప్లాన్ !
Recommended image2
సునామీ సెంచరీ తర్వాత పాకిస్తాన్ ను దంచికొట్టిన వైభవ్ సూర్యవంశీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved