2025 ఖో ఖో ప్రపంచకప్‌లో దుమ్మురేపుతున్న టీమిండియా.. సెమీస్ చేరిన పరుషుల జట్టు
Kho Kho World Cup 2025: ఖో ఖో ప్రపంచకప్ 2025లో భారత పురుషుల, మహిళల జట్లు వరుసగా పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై అద్భుతమైన విజయాలతో సెమీ-ఫైనల్‌లోకి అడుగుపెట్టాయి.
- FB
- TW
- Linkdin
Follow Us

Kho Kho World Cup 2025, Kho Kho
Kho Kho World Cup 2025: ఖోఖో ప్రపంచ కప్ 2025 లో భారత పరుషుల జట్టు అదరగొడుతోంది. అద్భుతమైన ఆటతో ప్రత్యర్థి జట్లకు షాకిస్తూ ఇప్పటికు ఒక్క ఓటమి కూడా లేకుండా సెమీ ఫైనల్ కు చేరుకుంది. శుక్రవారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఖో ఖో ప్రపంచ కప్‌లో భారత పురుషుల జట్టు అద్భుతమైన ప్రదర్శనతో శ్రీలంకపై 100-40 తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది.
Image Credits: Twitter/Odisha Sports
ఖోఖో ప్రపంచ కప్ 2025లో శ్రీలంక చిత్తుగా ఓడించిన భారత్
శుక్రవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఖోఖో వరల్డ్ కప్ 2025 శ్రీలంకపై అద్భుత విజయంతో భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించడానికి ముందు, టోర్నమెంట్ గ్రూప్ దశలోని నాలుగు మ్యాచ్లలోనూ భారత్ విజయం సాధించింది. పరుసగా ఐదు మ్యాచ్ లలో విజయం సాధించి సెమీస్ లోకి అడుగుపెట్టింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ప్రతీక్ వైకర్ సారథ్యంలోని భారత ఖోఖో పరుషుల జట్టు క్వార్టర్ ఫైనల్లో శ్రీలంకతో తలపడాలని నిర్ణయించింది. ఆతిథ్య జట్టు అలుపెరగని పోరాటంతో ఆట ఆరంభంలోనే త్వరితగతిన పాయింట్లు సాధించడంతో భారత పురుషుల జట్టు అటాకర్లతో శ్రీలంక డిఫెండర్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టర్న్ 1 ముగిసేసరికి భారత్ 58 పాయింట్లు సాధించింది. టర్న్ 2లో, శ్రీలంక జట్టు అటాకింగ్ లో ఉత్సాహభరితమైన ప్రదర్శనను కనబరిచింది, కానీ వారు భారత డిఫెండర్లతో సమానంగా నిలవలేకపోయారు.
Image Credits: X/Kho Kho World Cup 2025
ఖోఖో ప్రపంచ కప్ 2025 లో భారత పరుషుల జట్టు జోరు
క్వార్టర్ ఫైనల్ తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత పురుషుల జట్టు స్కోరు 58-18తో శ్రీలంకపై 40 పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్ ఆరంభంలో టర్న్ 3లో భారత్ అటాకింగ్ మోడ్ ను కొనసాగించింది. ప్రత్యర్థి మొత్తం 15 డిఫెండర్లను పట్టుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ టర్న్ 1 తో పోలిస్తే కొంచెం మెరుగ్గా ఆడింది. టర్న్ 3 ముగిసే సమయానికి ప్రతీక్ వైకర్ సారథ్యంలోని జట్టు 100 పాయింట్లకు పెంచుకుంది.
4వ, చివరి టర్న్ లో భారత డిఫెండర్లను పట్టుకునేందుకు శ్రీలంక అటాకర్లను మళ్లీ రంగంలోకి దింపారు. ఆతిథ్య జట్టు ఇప్పటికే లీడ్ పాయింట్ల పరంగా ఆధిక్యం సాధించినప్పటికీ భారత్ పై కాస్త ఒత్తిడి పెంచేందుకు ఉత్సాహభరితమైన పోరాటాన్ని ప్రదర్శించింది. టర్న్ 2లో ఆడిన తీరుతో పోలిస్తే శ్రీలంక అటాకింగ్ జట్టు మెరుగైన ప్రదర్శన కనబరిచింది. టర్న్ 4 ముగిసే సమయానికి మరో 20 పాయింట్లు సాధించి మొత్తంగా 40 పాయింట్లు సాధించి భారత్ ఆధిక్యాన్ని తగ్గించింది.
Image Credits: Twitter/All India Radio News
భారత పురుషుల జట్టులోని రామ్‌జీ కశ్యప్, ప్రతీక్ వైకర్, ఆదిత్య గన్‌పూలేల అద్భుత ప్రదర్శనతో టర్న్ 1లో 58 పాయింట్లు సాధించారు. వారు శ్రీలంక ఆటగాళ్లను ఒక్క పాయింట్ సాధించకుండా అడ్డుకున్నారు. మొదటి టర్న్ చివరిలో గేమ్‌కు బలమైన ప్రారంభాన్ని అందించారు. అనికేత్ పోటే, గన్‌పూలేతో కలిసి టర్న్ 2లో శ్రీలంక ఆటగాళ్ల కష్టాలను మరింత పెంచారు.
3వ టర్న్ లో భారతీయుల అటాక్ అద్బుతంగా సాగింది. శివా రెడ్డి, వి సుబ్రమణి, ప్రతీక్ వైకర్ శ్రీలంక ఆటగాళ్లను కట్టడి చేయడానికి స్కై డైవ్‌లు, పోల్ డైవ్‌లు అనేకం చేశారు. ఖో ఖో ప్రపంచ కప్ 2025లో సెమీ-ఫైనల్‌లో తమ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేస్తూ మూడో టర్న్ ముగిసే సమయానికి భారత జట్టు 100 పాయింట్లకు చేరుకుంది. చివరి టర్న్ ముగిసే సరికి స్కోరు 100-40తో భారత్ శ్రీలంక పై విక్టరీ సాధించి.. సులువుగానే సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది.
ఇంతకుముందు, భారత మహిళల జట్టు కూడా బంగ్లాదేశ్‌పై 95 పాయింట్ల తేడాతో విజయం సాధించి సెమీ ఫైనల్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. పురుషుల విభాగంలో భారత్, ఇరాన్, నేపాల్, దక్షిణాఫ్రికా జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. భారత్, దక్షిణాఫ్రికా జట్లు మాత్రమే అజేయంగా కొనసాగుతున్నాయి.