ఖోఖో వరల్డ్ కప్ 2025: నేపాల్ చిత్తు.. భారత్ ఆరంభం అదిరిపోయింది !
Kho Kho World Cup25: ఖోఖో వరల్డ్ కప్ 2025 ఘనంగా ప్రారంభం అయింది. సూపర్ విక్టరీతో భారత పరుషుల జట్టు టోర్నీని ప్రారంభించింది.
Kho Kho World Cup25: తొలి ఖో ఖో ప్రపంచ కప్ 2025 ఢిల్లీలో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభ ఎడిషన్ జనవరి 13 నుండి 19 వరకు జరగనుంది. భారత్ వేదికగా న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ టోర్నమెంట్ జరుగుతోంది. తొలి మ్యాచ్ లో భారత్ పరుషుల జట్టు నేపాల్ తో తలపడింది. సూపర్ విక్టరీతో భారత పరుషుల జట్టు టోర్నీని ప్రారంభించింది.
Kho Kho World Cup 2025, Kho Kho World Cup, Prateek Waikar
ఖోఖో ప్రపంచ కప్ 2025: టాస్ గెలిచి అటాకింగ్ కు దిగిన భారత్
ఈ వారం దేశవ్యాప్తంగా అభిమానులకు థ్రిల్లింగ్ యాక్షన్ ను అందించడానికి సిద్ధమైన ఖోఖో ప్రపంచ కప్ 2025.. ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభం అయింది. పురుషుల గేమ్‌లో 20 జట్లు, మహిళల పోటీలో 19 జట్లు పాల్గొంటున్నాయి. తొలి మ్యాచ్ లో భారత జట్టు నేపాల్ తో తలపడింది. టాస్ గెలిచింది. తొలుత అటాకింగ్ కు దిగింది.
మొదటి ఇన్నింగ్స్‌లో టర్న్ 1లో భారత పురుషులు అటాకర్‌లుగా మారారు. మొదటి రౌండ్ డిఫెండర్‌లను క్లియర్ చేసి 6 పాయింట్లను సాధించడానికి భారత జట్టుకు కేవలం రెండు నిమిషాల కంటే కొంచెం ఎక్కువ సమయం పట్టింది. వజీర్, కెప్టెన్ ప్రతీక్ వైకర్ నేతృత్వంలోని భారత్ మరో నిమిషం 25 సెకన్లలో ముగ్గురు డిఫెండర్లను ఔట్ చేశారు. ఆ తర్వాత కూడా భారత్ తన జోరును కొనసాగించింది. టర్న్ 1 ముగిసే సమయానికి భారతదేశం నేపాల్‌పై 24-0 ఆధిక్యంలో నిలిచింది.
Kho Kho World Cup, Kho Kho World Cup 2025,
ఖోఖో ప్రపంచ కప్ 2025: నేపాల్ పై భారత్ సూపర్ విక్టరీ
నేపాల్ టర్న్ 2లో నెమ్మదిగా పాయింట్లు సాధించింది. భారత డిఫెండర్లు అద్భుతంగా రాణించారు. తొలి రెండు నిమిషాల తర్వాత నేపాల్ భారతీయులపై ఒత్తిడిని కొనసాగించింది. 3 నిమిషాల కంటే కొంచెం ఎక్కువ సమయం మిగిలి ఉండగానే ఆధిక్యాన్ని 12 పాయింట్లకు తగ్గించింది. మొత్తంగా 20 పాయింట్లతో ముగించింది. దీంతో భారత్‌కు 24-20తో స్వల్ప ఆధిక్యం లభించింది.
టర్న్ 3 లో భారత్ మరోసారి అద్భుత ప్రదర్శన చూపించారు. అలాగే, నేపాల్ ప్లేయర్ల నుంచి బలమైన పోటీ కనిపించింది. టర్న్ 3 ముగిసే సమయానికి 42-21 స్కోరుతో నిలిచింది. నాలుగో టర్న్ లో భారత్ మెరుగైన ప్రదర్శన చేసింది. అలాగే, నేపాల్ చివరి వరకు బలమైన పోటీని ప్రదర్శించింది. అయితే, భారత్ 42-37తో ఉత్కంఠభరితమైన విజయాన్ని సాధించింది. తొలి ఖో ఖో ప్రపంచ కప్ 2025 లో భారత్ తొలి విజయాన్ని అందుకుని టోర్నీని ఘనంగా ప్రారంభించింది. భారత పురుషుల జట్టు మంగళవారం బ్రెజిల్‌తో తలపడనుండగా, మహిళల జట్టు దక్షిణ కొరియాతో తొలి మ్యాచ్ ను ఆడనుంది.
Kho Kho World Cup, Kho Kho World Cup 2025,
ఖోఖో ప్రపంచ కప్ 2025 ఓపెనింగ్ సెర్మనీ అదరిపోయింది
ఇందిరాగాంధీ స్టేడియంలో వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్ జ్యోతి ప్రజ్వలన చేయడంతో ఖో ఖో ప్రపంచకప్ 2025 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా, ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉష హాజరైన ప్రారంభ వేడుకలో సాంస్కృతిక ప్రదర్శనలు, భూమాతకు శాండ్ ఆర్ట్ నివాళులు అర్పించడం వేలాది మందిని ఆకర్షించింది.
Kho Kho World Cup, Kho Kho World Cup 2025,
ఈ కార్యక్రమం స్వదేశీ క్రీడకు ఒక మైలురాయిగా నిలిచింది. ప్రముఖులు దాని అభివృద్ధి చెందుతున్న ప్రపంచ ఆకర్షణను నొక్కిచెప్పారు. ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రపంచ కప్ ట్రోఫీని ఉత్సాహభరితమైన ఆనందోత్సాహాల మధ్య ఆవిష్కరించింది. ప్రదర్శనకారులు భారతదేశం శక్తివంతమైన సంస్కృతిని వివరించారు. టోర్నీలో పాల్గొంటున్న అంతర్జాతీయ అథ్లెట్ల కవాతు ఈ సందర్భంగా ప్రత్యేకంగా నిలిచింది.
23 దేశాలకు చెందిన క్రీడాకారులతో, ప్రారంభ టోర్నమెంట్ ఖో ఖోను ఆసియా క్రీడల వంటి ప్రతిష్టాత్మక వేదికలకు చేరుకోవాలని ఊహించిన అధికారుల నుండి ప్రశంసలు అందుకుంది. క్రీడల మంత్రి మాండవ్య ఖో ఖోను అంతర్జాతీయ పోటీల్లో చేర్చాలనే ఆకాంక్షను పంచుకున్నారు, దాని సాంస్కృతిక ప్రాముఖ్యత, పోటీ సామర్థ్యాన్ని నొక్కిచెప్పారు.
Kho Kho World Cup, Kho Kho World Cup 2025,
ఖోఖో ప్రపంచ కప్ 2025 పోటీలో పురుషులు, మహిళల జట్లు
23 దేశాలకు చెందిన క్రీడాకారులతో, ప్రారంభ టోర్నమెంట్ ఖో ఖోను ఆసియా క్రీడల వంటి ప్రతిష్టాత్మక వేదికలకు చేరుకోవాలని ఊహించిన అధికారుల నుండి ప్రశంసలు అందుకుంది. క్రీడల మంత్రి మాండవ్య ఖో ఖోను అంతర్జాతీయ పోటీల్లో చేర్చాలనే ఆకాంక్షను పంచుకున్నారు, దాని సాంస్కృతిక ప్రాముఖ్యత, పోటీ సామర్థ్యాన్ని నొక్కిచెప్పారు.
కాగా, ఖోఖో ప్రపంచ కప్ 2025 టోర్నీలో మొత్తం 20 పురుషుల జట్లు, 19 మహిళల జట్లు తమ తమ విభాగాల్లో ఛాంపియన్‌లుగా మారాలని చూస్తున్నాయి. పరుషుల జట్లలో నేపాల్, పెరూ, బ్రెజిల్, భూటాన్‌లతో భారత్ గ్రూప్-ఎలో ఉంది. గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా, ఘనా, అర్జెంటీనా, నెదర్లాండ్స్, ఇరాన్ ఉన్నాయి. బంగ్లాదేశ్, శ్రీలంక, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, పోలాండ్ గ్రూప్ సి లో ఉన్నాయి. ఇంగ్లాండ్, జర్మనీ, మలేషియా, ఆస్ట్రేలియా, కెన్యా గ్రూప్ డిలో ఉన్నాయి.
మహిళల ఎడిషన్‌లో 19 జట్లు ఉన్నాయి. ఆతిథ్య భారత్, ఇరాన్, మలేషియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా గ్రూప్ ఎలో ఉన్నాయి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, కెన్యా, ఉగాండా, నెదర్లాండ్స్ గ్రూప్ బిలో ఉన్నాయి. గ్రూప్ సిలో నేపాల్, భూటాన్, శ్రీలంక, జర్మనీ, బంగ్లాదేశ్‌లు ఉన్నాయి. గ్రూప్ డిలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పోలాండ్, పెరూ, ఇండోనేషియా ఉన్నాయి.