Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Jio: ఐపీఎల్‌ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. ఉచితంగా జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌

Jio: ఐపీఎల్‌ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. ఉచితంగా జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌

ఐపీఎల్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఐపీఎల్‌ 18వ సీజన్‌ ప్రారంభానికి సమయం ఆసన్నమవుతోంది. మరో ఐదురోజుల్లో ఇండియ‌న్ ప్రీమియం లీగ్ (ఐపీఎల్)కు తెర‌లేవ‌నుంది. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్‌ లవర్స్‌కి  ప్రముఖ టెలికం సంస్థ జియో బంపరాఫర్‌ ప్రకటించింది.. 
 

Narender Vaitla | Published : Mar 17 2025, 02:28 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
13
JioHotstar

JioHotstar

జియో, డిస్నీహాట్‌స్టార్‌ కలిసి జియో హాట్‌స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఐపీఎల్‌ మ్యాచ్‌లను జియో సినిమాలో ఉచితంగా చూసిన క్రికెట్‌ అభిమానులు ఇప్పుడు కచ్చితంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అలాంటిదేం లేకుండా యూజర్లు ఉచితంగా మ్యాచ్‌ను వీక్షించేందుకు వీలును కల్పించింది జియో. కొన్ని ప్లాన్స్‌తో రీఛార్జ్‌ చేసుకున్న యూజర్లకు 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశాన్ని కల్పించింది. 

23
Asianet Image

ఇందులో భాగంగా రూ. 299 అంతకంటే ఎక్కువ ప్లాన్స్‌తో రీఛార్జ్‌ చేసుకునే వారికి ఈ అవకాశాన్ని కల్పించారు. ఈ ప్లాన్స్‌తో రీఛార్జ్‌ చేసుకున్న యూజర్లు 90 రోజుల పాటు ఉచితంగా జియోహాట్‌ స్టార్‌ సేవలను యాక్సెస్‌ చేసుకోవచ్చు. కేవలం మొబైల్‌కి మాత్రమే పరిమితం కాకుండా టీవీల్లోనూ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు.

4కే రిజల్యూషన్‌తో టీవీలో కంటెంట్‌ వీక్షించవచ్చు. దీంతో పాటు 50 రోజుల జియో ఫైబర్‌ సేవలను కూడా ఉచితంగా పొందొచ్చు. ఇందులో అన్‌లిమిటెడ్‌ వైఫై, 800ప్లస్‌ ఓటీటీ ఛానల్స్‌, 11 ఓటీటీ యాప్స్‌ను యాక్సెస్‌ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్‌ మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. 
 

33
Asianet Image

జియో రూ. 100 ప్లాన్‌: 

ఇదిలా ఉంటే ఐపీఎల్ లవర్స్‌ కోసం జియో మరో బెస్ట్‌ ప్లాన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 100తో రీఛార్జ్‌ చేసుకుంటే 90 రోజుల పాటు జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు. అలాగే ఈ ప్లాన్‌లో 5జీబీ డేటా కూడా లభిస్తోంది. అయితే ఇది కేవలం డేటా ప్లాన్‌ మాత్రమే. ఇందులో ఎలాంటి కాల్స్‌, ఎస్‌ఎమ్‌ఎస్‌లు వంటివి లభించవు. అప్పటికే డేటా ప్లాన్‌ ఉన్నవారు, వైఫై సదుపాయం ఉన్న వారికి ఇది బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్‌గా చెప్పొచ్చు. 5జీబీ డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbpsకు పరిమితం అవుతుంది. 

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Top Stories