MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • RCB vs SRH : హైదరాబాద్ కొత్త బాస్ ఇషాన్ కిషన్.. కమిన్స్ లేకపోయినా తగ్గేదేలే.. దుమ్మురేపాడు భయ్యా

RCB vs SRH : హైదరాబాద్ కొత్త బాస్ ఇషాన్ కిషన్.. కమిన్స్ లేకపోయినా తగ్గేదేలే.. దుమ్మురేపాడు భయ్యా

RCB vs SRH : ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 3000 పరుగుల మైలురాయిని దాటి, కేఎల్ రాహుల్ రికార్డును బద్దలు కొట్టాడు. కింగ్ కోహ్లీ క్లబ్ లో చేరాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 28 2026, 09:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిసిన ఇషాన్ కిషన్
Image Credit : X/SunRisers

కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిసిన ఇషాన్ కిషన్

ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL) 19వ సీజన్ సన్ రైజర్స్ సిక్సర్ల మోతతో ప్రారంభమైంది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ జరిగింది. ఈ పోరులో హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వరుసగా వికెట్లు పడుతున్నా, ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 27 బంతుల్లోనే ఫోర్‌తో తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఈ సీజన్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా ఇషాన్ నిలిచాడు. మొత్తంగా 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 80 పరుగులు చేసి తన జట్టుకు భారీ స్కోరు అందించే బాధ్యతను భుజాన వేసుకున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
3000 పరుగుల క్లబ్‌లో కిషన్.. కేఎల్ రాహుల్ రికార్డ్ బద్దలు
Image Credit : Getty

3000 పరుగుల క్లబ్‌లో కిషన్.. కేఎల్ రాహుల్ రికార్డ్ బద్దలు

ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఇషాన్ కిషన్ ఐపీఎల్ కెరీర్‌లో ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్‌లో 3000 పరుగులు పూర్తి చేసుకున్న ప్రత్యేక ఆటగాళ్ల జాబితాలో చేరాడు. కేవలం పరుగులు చేయడమే కాకుండా, అత్యంత వేగంగా (తక్కువ బంతుల్లో) 3000 పరుగులు పూర్తి చేసిన భారతీయ బ్యాటర్ల జాబితాలో కేఎల్ రాహుల్‌ను వెనక్కి నెట్టి ఆరో స్థానానికి చేరుకున్నాడు. కిషన్ ఈ ఘనతను 2180 బంతుల్లో అందుకోగా, రాహుల్ దీని కోసం 2203 బంతులు తీసుకున్నాడు. ఈ జాబితాలో రిషబ్ పంత్ (2028 బంతులు) టాప్ లో కొనసాగుతున్నాడు.

35
కమిన్స్ లేని లోటు తీరుస్తున్న యంగ్ కెప్టెన్ ఇషాన్ కిషన్
Image Credit : X/SunRisers

కమిన్స్ లేని లోటు తీరుస్తున్న యంగ్ కెప్టెన్ ఇషాన్ కిషన్

సన్‌రైజర్స్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెన్నునొప్పి కారణంగా ఈ సీజన్ తొలి మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడంతో, మేనేజ్మెంట్ ఇషాన్ కిషన్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. కిషన్ తన 27 ఏళ్ల వయసులో హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ, కేన్ విలియమ్సన్ తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ను నడిపిస్తున్న రెండో అతి పిన్న వయస్కుడైన భారతీయ కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. కోచ్ డేనియల్ వెట్టోరి ఇషాన్ కిషన్ నాయకత్వ లక్షణాలపై ప్రశంసలు కురిపిస్తూ, అతను అండర్-19 జట్టును, తన రాష్ట్ర జట్టును సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతగా నడిపించిన అనుభవం జట్టుకు ఎంతో ప్లస్ అవుతుందని పేర్కొన్నాడు.

45
క్లిష్ట పరిస్థితుల్లో అద్భుత భాగస్వామ్యం
Image Credit : X/SunRisers

క్లిష్ట పరిస్థితుల్లో అద్భుత భాగస్వామ్యం

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు పవర్‌ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ రెడ్డి తక్కువ పరుగులకే వెనుదిరిగిన వేళ, కిషన్, హెన్రిచ్ క్లాసెన్ జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ కలిసి 50 పరుగుల కంటే ఎక్కువ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును బలమైన స్థితికి చేర్చారు. కిషన్ దూకుడు చూస్తుంటే, ఈసారి హైదరాబాద్‌కు ట్రోఫీ ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు అత్యధిక పరుగుల రికార్డులతో (8661 పరుగులు) కొనసాగుతుండగా, కిషన్ తనదైన శైలిలో కొత్త చరిత్రను లిఖిస్తున్నాడు.

55
మ్యాచ్ విన్నర్‌ ఇషాన్ కిషన్
Image Credit : X/SunRisers

మ్యాచ్ విన్నర్‌ ఇషాన్ కిషన్

చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టిన కిషన్, చివరకు అభినందన్ సింగ్ బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. అయితే, అప్పటికే అతను జట్టును భారీ స్కోరు వైపు నడిపించాడు. ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టు దూకుడుగా ఆడుతుందని, కిషన్, అభిషేక్ శర్మల నాయకత్వ బృందం ముందుండి నడిపిస్తుందని కోచ్ వెట్టోరి ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే ఇన్ని రికార్డులు సృష్టించిన ఇషాన్ కిషన్, రాబోయే రోజుల్లో సన్‌రైజర్స్‌కు మరిన్ని విజయాలు అందిస్తాడని స్పష్టమవుతోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
హైదరాబాద్
బెంగళూరు
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Glenn Maxwell: అంతర్జాతీయ క్రికెట్‌కు ది బిగ్ షో గుడ్ బై.. గ్లెన్ మాక్స్‌వెల్ రిటైర్మెంట్ కు కారణం ఏమిటి?
Recommended image2
IPL 2027: రూ.14 కోట్ల ప్లేయర్ కు సీఎస్కే గుడ్ బై.. ధోని టీమ్ ఏం ప్లాన్ చేస్తోంది?
Recommended image3
ఐదో టీ20లో భారత్‌కు ఓటమి.. 3-2తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
Related Stories
Recommended image1
IPL 2026: ఆరెంజ్ ఆర్మీకి బిగ్ అలర్ట్.. ఈ ఐదుగురు RCB ప్లేయర్లతో జాగ్రత్త !
Recommended image2
IPL 2026: కింగ్ ఈజ్ బ్యాక్.. ఈ ఒక్క సీజన్‌తో కోహ్లీ ఖాతాలో 5 వరల్డ్ రికార్డులు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved