MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • T20 World Cup 2026 Final లో ఇషాన్ కిషన్ రచ్చ.. ఇదెక్కడి మాస్ రా సామీ !

T20 World Cup 2026 Final లో ఇషాన్ కిషన్ రచ్చ.. ఇదెక్కడి మాస్ రా సామీ !

Ishan Kishan : టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఇషాన్ కిషన్ (54) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన టాప్ ఆటగాళ్ల జాబితాలో ఇషాన్ చేరాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 08 2026, 10:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇషాన్ కిషన్ ఫైర్.. అహ్మదాబాద్ స్టేడియంలో సిక్సర్ల వర్షం, కివీస్ బౌలర్లు బేజారు
Image Credit : ANI

ఇషాన్ కిషన్ ఫైర్.. అహ్మదాబాద్ స్టేడియంలో సిక్సర్ల వర్షం, కివీస్ బౌలర్లు బేజారు

అహ్మదాబాద్ స్టేడియంలో ఇషాన్ కిషన్ ఊచకోత! టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేళ న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఇషాన్ కిషన్ శివతాండవం చేశాడు. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే సిక్సర్ల వర్షం కురిపిస్తూ, కివీస్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఇది కేవలం హాఫ్ సెంచరీ కాదు... టీమిండియాను విశ్వవిజేతగా నిలిపిన ఇన్నింగ్స్..

అభిషేక్ శర్మ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్, ఏమాత్రం తడబడకుండా మొదటి బంతి నుంచే అటాకింగ్ మొదలుపెట్టాడు. రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో వరుస ఫోర్లతో తన ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇషాన్, స్టేడియంలో ఉన్న అభిమానులను ఉర్రూతలూగించాడు. కివీస్ బౌలర్లు అతన్ని కట్టడి చేసేందుకు వేసిన ప్లాన్లన్నీ ఇషాన్ దెబ్బకు తలకిందులయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో విధ్వంసం
Image Credit : Getty

లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో విధ్వంసం

న్యూజిలాండ్ స్పీడ్ గన్ లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ ఆడిన షాట్లు ఈ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచాయి. ఫెర్గూసన్ వేసిన షార్ట్ బాల్స్‌ను ఇషాన్ కళ్లు చెదిరే సిక్సర్లుగా మలిచాడు. ఫెర్గూసన్ తన రెండు ఓవర్లలోనే 48 పరుగులు సమర్పించుకోవడానికి ఇషాన్ కిషన్ మెరుపు దాడే ప్రధాన కారణం. ముఖ్యంగా లాంగ్-ఆన్ మీదుగా అతను కొట్టిన సిక్సర్ మ్యాచ్ మొత్తానికే ప్రత్యేకం.

35
ఇషాన్ మెరుపు అర్ధసెంచరీ.. కివీస్ మైండ్ బ్లాక్
Image Credit : Getty

ఇషాన్ మెరుపు అర్ధసెంచరీ.. కివీస్ మైండ్ బ్లాక్

ఇషాన్ కిషన్ కేవలం 23 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో అద్భుతమైన షాట్‌తో యాభై మార్కును దాటిన ఇషాన్, ఆకాశం వైపు చూస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. సంజూ శాంసన్ తో కలిసి ఇషాన్ చేసిన విధ్వంసం వల్ల భారత్ స్కోరు బోర్డు 12.75 రన్ రేట్‌తో దూసుకుపోయింది.

45
అత్యధిక పరుగుల రికార్డుల్లో ఇషాన్ కిషన్
Image Credit : X@BCCI

అత్యధిక పరుగుల రికార్డుల్లో ఇషాన్ కిషన్

ఈ టోర్నీలో ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. తాజా ఇన్నింగ్స్‌తో ఒకే టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇషాన్ కూడా చేరిపోయాడు. ఈ లిస్టులో పాక్ ప్లేయర్ టాప్ లో ఉన్నాడు. సంజూ మూడో స్థానంలో ఉన్నాడు.

• సాహిబ్జాదా ఫర్హాన్ (2026): 383 పరుగులు

• టిమ్ సీఫెర్ట్ (2026): 326 పరుగులు

• సంజూ శాంసన్ (2026): 321 పరుగులు

• విరాట్ కోహ్లీ (2014): 319 పరుగులు

• తిలకరత్నే దిల్షాన్ (2009): 317 పరుగులు

• ఇషాన్ కిషన్ (2026): 317 పరుగులు

55
చివర్లో అవుటైనా భారత్‌కు భారీ స్కోరు
Image Credit : X@BCCI

చివర్లో అవుటైనా భారత్‌కు భారీ స్కోరు

జేమ్స్ నీషమ్ బౌలింగ్‌లో మార్క్ చాప్‌మన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యే సమయానికి ఇషాన్ కిషన్ భారత్‌ను సురక్షితమైన స్థితిలో నిలిపాడు. 25 బంతుల్లో 54 పరుగులు చేసి అతను పెవిలియన్ చేరాడు. ఇషాన్ అవుటైనప్పటికీ, అతను అందించిన మెరుపు ఆరంభంతో టీమిండియా 255 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచగలిగింది. ఆ తర్వాత బౌలింగ్ తో కూడా న్యూజిలాండ్ ను దెబ్బకొట్టింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Recommended image2
దంచుడే.. దంచుడు.. 30 బంతుల్లోనే సెంచ‌రీతో అభిషేక్ శర్మ విధ్వంసం
Recommended image3
వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియా జ‌ట్టు ఖ‌రారు.. ఎవ‌రు ఇన్‌, ఎవ‌రు అవుట్ అంటే.?
Related Stories
Recommended image1
T20 World Cup Final : టీమిండియా పాత గాయాలను కెలికిన పాకిస్థాన్.. అక్తర్ బాబు నీకుంది ఇక !
Recommended image2
T20 World Cup 2026 Final లో సంజూ శాంసన్ కొట్టిన 5 రికార్డులు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved