MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • IND vs NZ : సంజూ, అభిషేక్ తాండవం.. హిస్టరీ క్రియేట్ చేసిన టీమిండియా

IND vs NZ : సంజూ, అభిషేక్ తాండవం.. హిస్టరీ క్రియేట్ చేసిన టీమిండియా

IND vs NZ : ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 255/5 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ మెరుపు హాఫ్ సెంచరీలతో కివీస్‌కు చుక్కలు చూపించారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 08 2026, 09:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫైనల్ లో భారత్ దెబ్బకు కివీస్ మైండ్ బ్లాక్.. హిస్టరీ క్రియేట్ చేసిన ఓపెనర్లు
Image Credit : Getty

ఫైనల్ లో భారత్ దెబ్బకు కివీస్ మైండ్ బ్లాక్.. హిస్టరీ క్రియేట్ చేసిన ఓపెనర్లు

అహ్మదాబాద్ గడ్డ... భారత్ అడ్డా.. నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ, స్టేడియం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించారు. ఫైనల్ ఫోరులో కివీస్ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ భారత్ 255 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఇది కేవలం ఆట కాదు... వరల్డ్ కప్ వేట.

టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే భారత ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ మొదటి రెండు ఓవర్లు జాగ్రత్తగా ఆడి ఆ తర్వాత విరుచుకుపడ్డారు. కేవలం 18 బంతుల్లోనే అభిషేక్ శర్మ తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. భారత్ పవర్‌ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే బెస్ట్ పవర్‌ప్లే స్కోరును నమోదు చేసింది. 7.1 ఓవర్ల వద్ద అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. అభిషేక్ 21 బంతుల్లో 52 పరుగులు చేశారు. తన ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. శర్మ అవుటైనప్పటికీ భారత్ దూకుడు తగ్గలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సంజూ శాంసన్ క్లాస్.. ఇషాన్ కిషన్ మాస్
Image Credit : Getty

సంజూ శాంసన్ క్లాస్.. ఇషాన్ కిషన్ మాస్

వరుసగా మూడో నాకౌట్ మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ సాధించి సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. అతను 46 బంతుల్లో 89 పరుగులు చేశాడు. 5 ఫోర్లు, 8 సిక్సర్లతో కివీస్ బౌలర్లను హడలెత్తించాడు. మరోవైపు ఇషాన్ కిషన్ కూడా కేవలం 23 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశాడు. వీరు ముగ్గురూ ఒకే ఇన్నింగ్స్‌లో 50కి పైగా పరుగులు చేయడం టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇదే తొలిసారి. రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో సంజూ హ్యాట్రిక్ సిక్సర్లతో దుమ్మురేపాడు.

35
నీషమ్ మెరుపులు.. కివీస్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన వేళ
Image Credit : Getty

నీషమ్ మెరుపులు.. కివీస్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన వేళ

భారత్ ఒకానొక సమయంలో 280-290 పరుగులు చేసేలా కనిపించింది. కానీ 16వ ఓవర్లో జేమ్స్ నీషమ్ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్‌ను కట్టడి చేశాడు. ఒకే ఓవర్లో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లను అవుట్ చేసి హ్యాట్రిక్ వికెట్లతో షాక్ ఇచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగడం స్టేడియంలో నిశ్శబ్దాన్ని నింపింది.

45
చివర్లో దూబే మెరుపులు.. 250 దాటిన స్కోరు
Image Credit : X@@ImTanujSingh

చివర్లో దూబే మెరుపులు.. 250 దాటిన స్కోరు

చివరి ఓవర్లలో హార్దిక్ పాండ్య 18 పరుగులతో మెరుపులు మెరిపించినా మ్యాట్ హెన్రీ చేతికి చిక్కాడు. అయితే శివమ్ దూబే కేవలం 8 బంతుల్లో 26 పరుగులు చేసి భారత్ స్కోరును 250 మార్కును దాటించాడు. దూబే తన నాక్ లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. నీషమ్ వేసిన చివరి ఓవర్లో దూబే రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 24 పరుగులు పిండుకున్నాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 255 పరుగులు చేయగలిగింది.

55
రికార్డుల మోత.. టీమిండియా అరుదైన ఘనత
Image Credit : ANI

రికార్డుల మోత.. టీమిండియా అరుదైన ఘనత

ఈ మ్యాచ్‌లో భారత్ మొత్తం 18 సిక్సర్లు బాదింది. ఒక టీ20 ప్రపంచకప్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్లలో భారత్ మూడో స్థానానికి చేరుకుంది. అంతేకాకుండా, టీ20ల్లో 250కి పైగా స్కోరును ఏడుసార్లు నమోదు చేసిన జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. శ్రీలంక (260/6) తర్వాత టీ20 ప్రపంచకప్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. కివీస్ బౌలర్లలో జేమ్స్ నీషమ్ 46 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Recommended image2
దంచుడే.. దంచుడు.. 30 బంతుల్లోనే సెంచ‌రీతో అభిషేక్ శర్మ విధ్వంసం
Recommended image3
వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియా జ‌ట్టు ఖ‌రారు.. ఎవ‌రు ఇన్‌, ఎవ‌రు అవుట్ అంటే.?
Related Stories
Recommended image1
Abhishek Sharma: టీ20లో అభిషేక్ శ‌ర్మ‌ అరుదైన రికార్డు.. ఉతికి ఆరేయ‌డం అంటే ఇదే
Recommended image2
IND vs NZ : సంజూ శాంసన్ విధ్వంసం.. వరుసగా మూడో హాఫ్ సెంచరీతో సరికొత్త చరిత్ర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved