MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • IPL చరిత్రలో మొదటి బంతి ఆడింది, వేసింది, క్యాచ్ పట్టింది, సెంచరీ చేసింది ఎవరు..? పాకిస్థానీ క్రికెటర్ పేరిట అద్భుత రికార్డు

IPL చరిత్రలో మొదటి బంతి ఆడింది, వేసింది, క్యాచ్ పట్టింది, సెంచరీ చేసింది ఎవరు..? పాకిస్థానీ క్రికెటర్ పేరిట అద్భుత రికార్డు

IPL 2026 : ప్రస్తుతం ఐపిఎల్ 19వ సీజన్ కొనసాగుతోంది.. వచ్చే ఏడాది ఈ మెగా లీగ్ 20వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో ఐపిఎల్ చరిత్రను ఓసారి తిరగేసి మొదటి బంతి వేసిందెవరు, ఆడిందెవరు, సెంచరీ చేసిందెవరు..? వంటి విషయాలు తెలుసుకుందాం.  

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 13 2026, 02:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
క్రికెట్ రూపాన్నే మార్చేసిన ఐపిఎల్
Image Credit : stockPhoto

క్రికెట్ రూపాన్నే మార్చేసిన ఐపిఎల్

Indian Premier League : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) రాకతో క్రికెట్ రూపమే మారిపోయింది. టెస్ట్, వన్డేలతో స్లోగా సాగే క్రికెట్ టీ20 రాకతో స్పీడెక్కింది.. ఈ ఐపిఎల్ ఎంట్రీతో జెట్ స్పీడ్ ను అందుకుంది. మండుటెండల్లో భారతీయులకు క్రికెట్ మజాను అందిస్తూనే దేశానికి వేల కోట్ల రెవెన్యూ జనరేట్ చేస్తోంది... బిసిసిఐ, టీమ్ ఓనర్లకు లాభాలు తెచ్చిపెడుతోంది.

అయితే ఈ ఐపిఎల్ ప్రయాణం 2008 లో ప్రారంభమయ్యింది... సక్సెస్ ఫుల్ గా 19 సీజన్ కొనసాగుతోంది. రెండో దశాబ్దంలోకి అడుగుపెట్టేందుకు సిద్దంగా ఉన్న నేపథ్యంలో అసలు ఐపిఎల్ ఎలా ప్రారంభమయ్యింది..? మొదటి మ్యాచ్ ఎవరెవరి మధ్య జరిగింది..? మొదటి బంతి ఎవరు ఎదరర్కొన్నారు.. బౌలర్ ఎవరు..? వంటి ఆసక్తికర విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఐపిఎల్ ఆలోచన ఎవరిది..?
Image Credit : X@IPL

ఐపిఎల్ ఆలోచన ఎవరిది..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆలోచన బిసిసిఐ మాజీ ఉపాధ్యక్షుడు లలిత్ మోదీది. ఇతర క్రీడల్లొ మాదిరిగా క్రికెట్ లోనూ ప్రాంచైజీ ఆధారిత లీగ్ ను ప్రవేశపెట్టారు...ఇది ప్రపంచ క్రికెట్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది... ఇప్పుడు ఐపిఎల్ అంటే కేవలం ఆటే కాదు లక్షలకోట్ల బిజినెస్.

2007 లో బిసిసిఐ ఇండియన్ ప్రీమియన్ లీగ్ ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది... ఏడాదిపాటు ఆటగాళ్ల వేలం, లోకల్ పేర్లతో టీంల ఏర్పాటు ప్రక్రియ సాగింది... 2008 లొ అధికారికంగా ఈ లీగ్ ప్రారంభమయ్యింది. అప్పటినుండి నిర్విరామంగా కొనసాగుతోంది.

Related Articles

Related image1
Cricket: డ్రంక్ అండ్‌ డ్రైవ్ కేసులో అరెస్ట్ అయిన క్రికెట‌ర్‌.. విచార‌ణ‌కు హాజ‌ర‌వ్వాల‌ని ఆదేశం
Related image2
IPL ఎంట్రీకి ముందే 40 సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు.. క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ !
36
ఐపిఎల్ లో మొదటి బంతి ఆడిందెవరు..?
Image Credit : PTI

ఐపిఎల్ లో మొదటి బంతి ఆడిందెవరు..?

2008 లో ఐపిఎల్ తొలి అడుగు బెంగళూరులో పడింది... చిన్నస్వామి స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యింది. మొదటి మ్యాచ్ ఏప్రిల్ 18న లోకల్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగింది. ఈ క్రమంలో కెకెఆర్ మొదట బ్యాటింగ్ చేయగా ఓపెనర్ గా బరిలోకి దిగిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మొదటి బంతిని ఎదుర్కొన్నారు.

46
ఐపిఎల్ లో మొదటి బంతి వేసిన బౌలర్ ఎవరు..?
Image Credit : ANI

ఐపిఎల్ లో మొదటి బంతి వేసిన బౌలర్ ఎవరు..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మొదటి బంతి ఎదుర్కొన్నది గంగూలీ అయితే ఆ బౌలర్ ఎవరు..? అనేగా మీ ప్రశ్న. ఆర్సిబి మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్ ఐపిఎల్ చరిత్రలో మొదటి బంతి విసిరిన బౌలర్ గా నిలిచారు. అతడు వేసిన మొదటి బంతి డాట్ బాల్.. అంటే గంగూలీ పరుగేమీ చేయలేదన్నమాట.

56
ఐపిఎల్ లో మొదటి క్యాచ్ ఎవరిది..?
Image Credit : Getty

ఐపిఎల్ లో మొదటి క్యాచ్ ఎవరిది..?

ఐపిఎల్ లో మొదటి క్యాచ్ కూడా కెకెఆర్ మాజీ కెప్టెన్ గంగూలీదే. అయితే క్యాచ్ అందుకున్నది మాత్రం సౌతాఫ్రికా మాజీ ఆల్రౌండర్ మొదటి క్యాచ్ అందుకున్నాడు. ఇలా ఐపిఎల్ చరిత్రలో నిలిచిపోయింది ఈ క్యాచ్.

అయితే ఐపిఎల్ లో తొలి స్టంప్ ఔట్ రికార్డు మాత్రం పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమాన్ అక్మల్ పేరిట ఉంది. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన అతడు మొదటి స్టంప్ ఔట్ చేశాడు. ఈ సీజన్ విజేత కూడా రాజస్థాన్ రాయల్సే.

66
ఐపిఎల్ లో మొదటి సెంచరీ..?
Image Credit : Getty

ఐపిఎల్ లో మొదటి సెంచరీ..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మొదటి సెంచరీ బ్రెండన్ మెకల్లమ్ ది. అతడు కెకెఆర్ తరపున మొదటి మ్యాచ్ లోనే సెంచరీ బాదాడు. కేవలం 73 బంతుల్లో 158 నాటౌట్ గా నిలిచాడు... ఇందులో 10 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాడు. అయితే ఐపిఎల్ లో మొదటి సెంచరీ బాదిన ఇండియన్ ప్లేయర్ మాత్రం మనీష్ పాండే... ఇతడు 2009 లో ఈ ఘనత సాధించాడు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Related Stories
Recommended image1
Cricket: డ్రంక్ అండ్‌ డ్రైవ్ కేసులో అరెస్ట్ అయిన క్రికెట‌ర్‌.. విచార‌ణ‌కు హాజ‌ర‌వ్వాల‌ని ఆదేశం
Recommended image2
IPL ఎంట్రీకి ముందే 40 సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు.. క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved