MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Cricket: డ్రంక్ అండ్‌ డ్రైవ్ కేసులో అరెస్ట్ అయిన క్రికెట‌ర్‌.. విచార‌ణ‌కు హాజ‌ర‌వ్వాల‌ని ఆదేశం

Cricket: డ్రంక్ అండ్‌ డ్రైవ్ కేసులో అరెస్ట్ అయిన క్రికెట‌ర్‌.. విచార‌ణ‌కు హాజ‌ర‌వ్వాల‌ని ఆదేశం

Cricket: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ డ్రంక్ డ్రైవింగ్ కేసులో అరెస్ట్ కావడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో ఆడుతున్న వార్నర్, ఈ కేసుకు సంబంధించి ఆయన త్వరలో కోర్టులో హాజరుకావాల్సి ఉంది.

1 Min read
Author : Narender Vaitla
Published : Apr 07 2026, 06:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
డ్రంక్ డ్రైవింగ్ కేసులో అరెస్ట్
Image Credit : Asianet News

డ్రంక్ డ్రైవింగ్ కేసులో అరెస్ట్

సిడ్నీలోని మారౌబ్రా ప్రాంతంలో ఆదివారం రాత్రి పోలీసులు నిర్వహించిన ర్యాండమ్ బ్రెత్ టెస్ట్ సమయంలో ఈ ఘటన జరిగింది. వార్తల ప్రకారం, పరీక్షా కేంద్రానికి కొద్దిదూరంలోనే వార్నర్ తన వాహనాన్ని ఆపి పార్క్ చేశాడు. దీనిని గమనించిన పోలీసులు వాహనం వద్దకు వెళ్లి పరీక్ష నిర్వహించారు. పరీక్షలో వార్నర్ శరీరంలో ఆల్కహాల్ లెవల్స్ చట్టపరమైన పరిమితికి దాదాపు రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి మారౌబ్రా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

23
మే నెలలో కోర్టులో హాజరు
Image Credit : Getty

మే నెలలో కోర్టులో హాజరు

పోలీసుల ప్రకటన ప్రకారం, ఆదివారం సాయంత్రం 5:30 గంటల సమయంలో మలబార్ రోడ్డులో స్టేషనరీ ర్యాండమ్ బ్రెత్ టెస్టింగ్ జరుగుతోంది. పరీక్షా కేంద్రానికి ముందే ఒక వాన్ ఆగి నిలిచినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ట్రాఫిక్ అండ్ హైవే పట్రోల్ అధికారులు డ్రైవర్‌కు పరీక్ష నిర్వహించగా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన పరీక్షలో ఆల్కహాల్ స్థాయి 0.1గా నమోదైంది. ఈ కేసులో వార్నర్ మే నెలలో కోర్టులో హాజరుకానున్నారు.

Related Articles

Related image1
Smart Watch: స్మార్ట్‌వాచ్‌లో వీడియో call ఫీచ‌ర్‌.. దీంతో మీ పిల్ల‌లు ఎక్క‌డున్నా సేఫ్
Related image2
రూ. 1.3 ల‌క్ష‌ల కోట్ల‌తో నిర్మాణం, ఈనెల 28న శంకుస్థాప‌న‌.. ఏపీలో ఈ ప్రాంతం మ‌రో హైటెక్ సిటీ కావ‌డం ఖాయం
33
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
Image Credit : Getty

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

డేవిడ్ వార్నర్ 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తర్వాత ఆయన మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. 2024 జనవరిలో వెస్టిండీస్‌తో జరగాల్సిన వన్డే సిరీస్‌కు నాలుగు వారాల ముందు ఆయన రిటైర్మెంట్ ప్రకటించడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇదిలా ఉంటే వార్నర్‌ ప్రస్తుతం పాకిస్థాన్‌ క్రికెట్‌ లీగ్‌లో ఆడుతున్నాడు. కరాచీ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న అతడు.. ఇటీవలే వ్యక్తిగత సెలవు తీసుకుని ఆస్ట్రేలియా వెళ్లాడు. ఈ లీగ్‌ కోసం త్వరలోనే మళ్లీ పాక్‌కు వెళ్లనున్నాడు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
క్రికెట్
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
MS Dhoni: బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించే ధోనికి అదంటే చచ్చెంత భ‌యం.. మిస్ట‌ర్ కూల్ ఆస‌క్తిక విష‌యాలు
Recommended image2
Hardik Pandya : హార్దిక్-నటాషా మళ్లీ ఒక్కటవుతున్నారా..? అత్తవారింట్లో మాజీ కోడలు సందడి
Recommended image3
IPL సందడి వేళ వైజాగ్‌లో ఘోరం.. రన్ అవుట్ వివాదంతో అంపైర్ దారుణ హత్య
Related Stories
Recommended image1
Smart Watch: స్మార్ట్‌వాచ్‌లో వీడియో call ఫీచ‌ర్‌.. దీంతో మీ పిల్ల‌లు ఎక్క‌డున్నా సేఫ్
Recommended image2
రూ. 1.3 ల‌క్ష‌ల కోట్ల‌తో నిర్మాణం, ఈనెల 28న శంకుస్థాప‌న‌.. ఏపీలో ఈ ప్రాంతం మ‌రో హైటెక్ సిటీ కావ‌డం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved