వీళ్లే లచ్చిందేవి వారసులు.. ఐపీఎల్‌లో కోట్లు కొల్లగొట్టిన ప్లేయర్స్ లిస్టు ఇదిగో
IPL Auction 2026: ఐపీఎల్ మినీ వేలం 2026 ఆసక్తికరంగా సాగింది. కొందరు అన్ క్యాప్డ్ ఆల్ రౌండర్లు ఊహించని ధరకు అమ్ముడయ్యారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ భారీ ధర పలికగా, వెంకటేష్ అయ్యర్..

అన్ క్యాప్డ్ ప్లేయర్స్ జాక్ పాట్..
ఐపీఎల్ మినీ వేలం 2026 ఆసక్తికరంగా సాగింది. ఈ వేలంలో కొందరు అన్ క్యాప్డ్ ఆల్ రౌండర్లు జాక్ పాట్ కొట్టారు. అయితే పలు విదేశీ స్టార్ ఆటగాళ్లను మాత్రం ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. అందరూ అనుకున్నట్టుగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ భారీ ధర పలికాడు.
అన్ క్యాప్డ్ ఆల్ రౌండర్లు అదరగొట్టారు..
కనీస ధర రూ. 30 లక్షలతో వేలంలోకి వచ్చిన ప్రశాంత్ వీర్ కోసం లక్నో, ముంబై, చెన్నై, రాజస్థాన్ జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు చెన్నై సూపర్ కింగ్స్ అతడిని రూ. 14.20 కోట్లకు దక్కించుకుంది. కార్తీక్ శర్మను కూడా అనూహ్యంగా రూ. 14.20 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది . అఖీబ్ దార్ అనే మరో అన్ క్యాప్డ్ ఆల్ రౌండర్‌ను రూ. 8.40 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
పతిరానా జాక్ పాట్..
గత కొన్ని సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడి ఆకట్టుకున్న శ్రీలంక పేసర్ మతీష పతిరానా సైతం ఈ వేలంలో జాక్ పాట్ కొట్టాడు. కనీస ధర రెండు కోట్లతో వేలానికి వచ్చిన పతిరానా కోసం ఢిల్లీ, లక్నో జట్లు పోటీపడగా, మధ్యలో కోల్‌కతా నైట్ రైడర్స్ రేసులోకి వచ్చి అతడిని రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది.
ఆర్సీబీకి అయ్యర్..
వెంకటేష్ అయ్యర్ కనీస ధర రూ. 2 కోట్లు కాగా, అతని కోసం కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీపడ్డాయి. చివరికి బెంగళూరు రూ. 7 కోట్లకు వెంకటేష్‌ను సొంతం చేసుకుంది. అన్ క్యాప్డ్ ఆల్ రౌండర్లు ఈ వేలంలో అద్భుతమైన డీల్స్ దక్కించుకున్నారు.
మార్చి 26 నుంచి ఐపీఎల్..
మార్చి 26 నుంచి మే 31 వరకు ఐపీఎల్ 2026 జరగనుంది. ఇదే విషయాన్ని బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు చెప్పింది. సరిగ్గా టీ20 ప్రపంచకప్ అవ్వగానే ఈ పొట్టి ఫార్మాట్ జరగనుంది. మరి చూడాలి వేలంలో ఎక్కువ ధర పలికిన ఏయే ఆటగాళ్లు దుమ్మురేపుతారో..

