MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Tilak : మృత్యువుతో పోరాడి గెలిచాడు.. తిలక్ వర్మను వణికించిన ఆ భయంకర వ్యాధి ఏంటో తెలుసా?

Tilak : మృత్యువుతో పోరాడి గెలిచాడు.. తిలక్ వర్మను వణికించిన ఆ భయంకర వ్యాధి ఏంటో తెలుసా?

Tilak Varma : హైదరాబాద్ స్టార్.. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ చావు అంచువరకు వెళ్లి వచ్చాడు. అసలు తిలక్ వర్మకు వచ్చిన వ్యాధి ఏంటి? తిలక్ ను కాపాడిన ఆ ముంబై ఇండియన్స్ వ్యక్తి ఎవరు?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 29 2026, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కొద్ది గంటలు ఆలస్యమైతే ప్రాణాలు పోయేవి.. ఐపీఎల్ స్టార్ తిలక్ వర్మ కన్నీటి గాథ
Image Credit : Getty

కొద్ది గంటలు ఆలస్యమైతే ప్రాణాలు పోయేవి.. ఐపీఎల్ స్టార్ తిలక్ వర్మ కన్నీటి గాథ

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ తన రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఈ పోరుపై భారీ అంచనాలు ఉన్నాయి. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ, అందరి దృష్టి ఇప్పుడు ఒక యంగ్ ప్లేయర్ పైనే ఉంది. అతడే తెలుగు తేజం తిలక్ వర్మ. ముంబై మిడిల్ ఆర్డర్‌లో వెన్నెముకలా మారిన తిలక్, గత కొన్ని సీజన్లుగా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. అయితే, ఈ స్థాయికి చేరుకోవడానికి అతను దాటి వచ్చిన కష్టాలు, ఎదుర్కొన్న అనారోగ్యం వివరాలు వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ప్రాణాంతక వ్యాధి రాబ్డోమియోలిసిస్ బారినపడ్డ తిలక్ వర్మ
Image Credit : Getty

ప్రాణాంతక వ్యాధి రాబ్డోమియోలిసిస్ బారినపడ్డ తిలక్ వర్మ

23 ఏళ్ల తిలక్ వర్మ 2022 ఐపీఎల్ అరంగేట్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ ఆ మెరుపుల వెనుక ఒక భయంకరమైన చీకటి ఉంది. ఇటీవల బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, తను అనుభవించిన నరకాన్ని తిలక్ వివరించాడు. అతనికి రాబ్డోమియోలిసిస్ అనే అరుదైన, ప్రమాదకరమైన వ్యాధి సోకింది. ఈ పరిస్థితిలో శరీరంలోని కండరాలు వేగంగా విచ్ఛిన్నమై, మయోగ్లోబిన్ అనే హానికరమైన పదార్థాన్ని రక్తంలోకి విడుదల చేస్తాయి. దీనివల్ల తీవ్రమైన కండరాల నొప్పి, బలహీనత కలగడమే కాకుండా, కిడ్నీలు పూర్తిగా దెబ్బతిని ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది.

36
శరీరాన్ని ఎక్కువ కష్టపెట్టడం వల్లే తిలక్ వర్మకు ప్రాణాపాయం
Image Credit : Twitter/BCCI

శరీరాన్ని ఎక్కువ కష్టపెట్టడం వల్లే తిలక్ వర్మకు ప్రాణాపాయం

తనకు ఆ వ్యాధి రావడానికి గల కారణాన్ని తిలక్ నిజాయితీగా అంగీకరించాడు. "నేను టెస్ట్ టీమ్‌లో చోటు దక్కించుకోవాలని చాలా కష్టపడేవాడిని. దేశవాళీ క్రికెట్ ఆడుతూనే, రెస్ట్ తీసుకునే రోజుల్లో కూడా జిమ్‌లో తీవ్రంగా వర్కౌట్లు చేసేవాడిని. ప్రపంచంలోనే అత్యంత ఫిట్‌గా ఉండే ప్లేయర్ కావాలని కలలు కనేవాడిని. నా శరీరం తట్టుకోలేనంతగా ఒత్తిడికి గురిచేశాను. కేవలం ఐస్ బాత్ తీసుకుని నిద్రపోతే రికవరీ అయిపోతుందని భావించాను, కానీ అది సరిపోదని అప్పుడు తెలియదు" అని తిలక్ అన్నారు.

46
బంగ్లాదేశ్ పర్యటనలో భయానక అనుభవంలో తిలక్
Image Credit : our own

బంగ్లాదేశ్ పర్యటనలో భయానక అనుభవంలో తిలక్

2022 చివరలో ఇండియా-ఏ తరఫున బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్నప్పుడు ఈ సమస్య ముదిరింది. ఒక మ్యాచ్‌లో 101 బంతుల్లో 33 పరుగులు చేసిన తర్వాత, తిలక్ చేతులు పూర్తిగా బిగుసుకుపోయాయి. కనీసం వేళ్లు కూడా కదిలించలేని స్థితికి చేరుకున్నాడు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, అతని చేతికి ఉన్న గ్లౌజులను కత్తెరతో కోసి తీయాల్సి వచ్చింది. ఆ సమయంలో ముంబై ఇండియన్స్ యజమాని ఆకాష్ అంబానీ వెంటనే స్పందించి, బీసీసీఐ అధికారులతో మాట్లాడారు. తిలక్‌ను యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు.

56
తిలక్ చావు అంచున ఉన్న ఆ గంటలు..
Image Credit : our own

తిలక్ చావు అంచున ఉన్న ఆ గంటలు..

వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం, చికిత్స అందడం మరికొన్ని గంటలు ఆలస్యమైతే తిలక్ ప్రాణాలు దక్కేవి కావు. అతని కండరాలు ఎంత గట్టిగా బిగుసుకుపోయాయంటే, ఇంజెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు సూదులు కూడా విరిగిపోయాయట. దాదాపు నెల రోజుల పాటు తిలక్ కదలలేని స్థితిలో బెడ్‌కే పరిమితమయ్యాడు. ఆ సమయంలో అతని తల్లి అతనికి అన్నం తినిపించాల్సి వచ్చింది. "ఆ వయసులో అది చాలా భయంకరమైన అనుభవం. నేను మళ్లీ క్రికెట్ ఆడతానో లేదో అని కాదు, కనీసం బతికితే చాలు అని దేవుడిని ప్రార్థించాను" అని తిలక్ ఆ క్షణాలను గుర్తు చేసుకున్నాడు.

66
రైజింగ్ స్టార్ తిలక్ వర్మ.. మృత్యుంజయుడి గర్జన
Image Credit : PTI

రైజింగ్ స్టార్ తిలక్ వర్మ.. మృత్యుంజయుడి గర్జన

సకాలంలో చికిత్స అందడంతో తిలక్ కోలుకున్నాడు. ఆ తర్వాత 2023 ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 46 బంతుల్లో 84 పరుగులు చేసి అద్భుతమైన రీఎంట్రీ ఇచ్చాడు. అక్కడి నుంచి తిలక్ వెనక్కి తిరిగి చూడలేదు. 2025 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై 69 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ గా నిలిచాడు. అలాగే భారత్ గెలిచిన టీ20 వరల్డ్ కప్ 2026లోనూ కీలక పాత్ర పోషించాడు. నేడు ఐపీఎల్ 2026లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ 5 ఏళ్ల టైటిల్ కరవును తీర్చుకోవాలంటే తిలక్ వర్మ ఫామ్ అత్యంత కీలకం కానుంది. మరి హైదరాబాద్ స్టార్ ఏం చేస్తాడో చూడాలి మరి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియా జ‌ట్టు ఖ‌రారు.. ఎవ‌రు ఇన్‌, ఎవ‌రు అవుట్ అంటే.?
Recommended image2
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image3
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Related Stories
Recommended image1
IPL ఎంట్రీలోనే సన్‌రైజర్స్‌కు చుక్కలు చూపించాడు.. ఎవడ్రా ఈ జేకబ్ డఫీ?
Recommended image2
IPL 2026: హిట్‌మ్యాన్ ఈజ్ బ్యాక్.. ఆ రికార్డు ఇక రోహిత్ సొంతం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved