MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • RCB: ఆర్సీబీకి బిగ్ షాక్.. ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన వెంటనే కోహ్లీ టీమ్ లెజెండ్ సడన్ రిటైర్మెంట్.. అసలు ఏం జరుగుతోంది?

RCB: ఆర్సీబీకి బిగ్ షాక్.. ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన వెంటనే కోహ్లీ టీమ్ లెజెండ్ సడన్ రిటైర్మెంట్.. అసలు ఏం జరుగుతోంది?

RCB : ఐపీఎల్ 2026 టైటిల్ గెలిచిన ఆనందంలో ఉన్న ఆర్‌సీబీకి భారీ షాక్ తగిలింది. జట్టు సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ బసు శంకర్ రిటైర్మెంట్ ప్రకటించారు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 04 2026, 11:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కోహ్లిని రన్ మెషిన్ చేసిన గురువు అవుట్.. ఆర్‌సీబీ క్యాంప్‌లో బిగ్ షాక్
Image Credit : X/RCBTweets

కోహ్లిని రన్ మెషిన్ చేసిన గురువు అవుట్.. ఆర్‌సీబీ క్యాంప్‌లో బిగ్ షాక్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు బిగ్ షాక్. రజత్ పాటిదార్ కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్‌ను వన్-సైడెడ్ మ్యాచ్‌లో చిత్తు చేసి, వరుసగా రెండోసారి ఆర్‌సీబీ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత బ్యాక్-టు-బ్యాక్ టైటిల్స్ గెలిచిన మూడో టీమ్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

అయితే, ఈ హిస్టారికల్ విక్టరీ సెలబ్రేషన్స్ జోరుగా సాగుతున్న టైమ్‌లోనే ఆర్‌సీబీ క్యాంప్‌లో బిగ్ షాక్ తగిలింది. జట్టు సక్సెస్ వెనుక ఉన్న మెయిన్ పిల్లర్, లెజెండరీ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ బసు శంకర్ తన రిటైర్మెంట్‌ను అనౌన్స్ చేశారు. వచ్చే సీజన్ నుండి తాను ఆర్‌సీబీతో ఉండటం లేదని చెప్పి అందరినీ షాక్‌కు గురిచేశారు. బుధవారం తన అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్‌లో ఆర్‌సీబీ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ ఎమోషనల్ పోస్ట్
Image Credit : stockPhoto

ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ ఎమోషనల్ పోస్ట్

బసు శంకర్ రిటైర్మెంట్ నిర్ణయం తమను తీవ్రంగా కలిచివేసిందని ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. "బసు శంకర్ సర్... మీరు తీసుకున్న ఈ డెసిషన్ మా అందరి కళ్లల్లో నీళ్లు తెప్పించింది. ఈ సీజన్‌లో సాధించిన గ్రాండ్ సక్సెస్ వెనుక స్క్రీన్ వెనకాల మీరు పడిన కష్టం ఎంతో ఉంది. లెక్కలేనన్ని గంటల పాటు మీరు పడ్డ కష్టానికి దక్కిన రివార్డ్ ఇది. బసు శంకర్ సర్, మీతో సాగిన ఈ జర్నీ మరువలేనిది. మీ లెగసీ ఎప్పటికీ ఆర్‌సీబీలో భాగమే" అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చింది. ఆర్‌సీబీ రిలీజ్ చేసిన ఫేర్‌వెల్ వీడియోలో ప్లేయర్స్, సపోర్ట్ స్టాఫ్ బసు శంకర్‌కు ఘనంగా వీడ్కోలు పలుకుతుండగా, ఆయన చాలా ఎమోషనల్ అవ్వడం కనిపించింది.

36
ఐపీఎల్ ఎనిమిది సీజన్ల లాంగ్ జర్నీ
Image Credit : X/StarSportsIndia

ఐపీఎల్ ఎనిమిది సీజన్ల లాంగ్ జర్నీ

బసు శంకర్ 2019లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుండి దాదాపు ఎనిమిది సీజన్ల పాటు ఆయన ఆర్‌సీబీకి సేవలు అందించారు. ఐపీఎల్ లాంటి సుదీర్ఘమైన, బిజీ షెడ్యూల్ ఉన్న టోర్నమెంట్‌లో ప్లేయర్స్ ఫిట్‌నెస్‌ను కాపాడటం అంటే మామూలు విషయం కాదు.

బసు శంకర్ ప్రతి ప్లేయర్ బాడీ టైప్, వారి స్ట్రెంత్, వీక్‌నెసెస్‌ను స్టడీ చేసి పర్సనలైజ్డ్ ఫిట్‌నెస్ ప్లాన్స్ డిజైన్ చేసేవారు. జిమ్‌లో కఠినమైన వర్కవుట్స్ చేయిస్తూ, గ్రౌండ్‌లో ప్లేయర్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా చూశారు. ఆర్‌సీబీ వరుసగా రెండు సార్లు ఛాంపియన్‌గా నిలవడంలో స్క్రీన్ వెనుక ఉండి నడిపించిన అసలైన సూత్రధారి ఈయనే.

This news made us all teary eyed. 𝐁𝐚𝐬𝐮 𝐒𝐡𝐚𝐧𝐤𝐞𝐫 𝐒𝐢𝐫… ❤️🥺

This season was built on countless hours of hard work behind the scenes. To every member of our support staff and management who made this journey possible, thank you. 🤗🫶

A special salute to Basu Shanker… pic.twitter.com/K2UInIBhC9

— Royal Challengers Bengaluru (@RCBTweets) June 3, 2026

46
టీమిండియాలో యోయో టెస్ట్ తెచ్చిన కింగ్
Image Credit : X/ImTanujSingh

టీమిండియాలో యోయో టెస్ట్ తెచ్చిన కింగ్

ఆర్‌సీబీ కంటే ముందు బసు శంకర్ ఇండియన్ నేషనల్ క్రికెట్ టీమ్‌కు హెడ్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా పనిచేశారు. ఇండియన్ క్రికెట్‌లో ఫిట్‌నెస్ లెవెల్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లిన క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. టీమిండియాలో తప్పనిసరిగా మారిన ఫేమస్ యోయో టెస్ట్‌ను ఇంట్రడ్యూస్ చేసి, బాగా పాపులర్ చేసింది బసు శంకరే. వరల్డ్‌లోనే ఇండియన్ టీమ్‌ను మోస్ట్ ఫిటెస్ట్ ప్రొఫెషనల్ టీమ్‌గా మార్చడంలో ఆయన రోల్ ఎప్పటికీ మరువలేనిది.

🚨 BASU SHANKAR HAS RETIRED FROM COACHING 🚨

Basu Shankar is the Man who always stands behind with Virat Kohli & RCB. He supports & help Virat Kohli a lot in his fitness Jersey and keeping Kohli fit.

- Thank you, Basu Shankar sir for your all the hard work & support. ♥️🙇‍♂️ pic.twitter.com/oR6i6kuRxh

— Tanuj (@ImTanujSingh) June 3, 2026

56
విరాట్ కోహ్లి ఫేట్ మార్చేసిన గురువు
Image Credit : Asianet News

విరాట్ కోహ్లి ఫేట్ మార్చేసిన గురువు

రన్ మెషిన్ విరాట్ కోహ్లి ఈరోజు వరల్డ్ క్రికెట్‌లోనే మోస్ట్ ఫిటెస్ట్ అథ్లెట్‌గా ఉన్నాడంటే దానికి కారణం బసు శంకరే. కోహ్లి గతంలో ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఓపెన్‌గా ఒప్పుకున్నాడు. మొదట్లో జిమ్‌లో వెయిట్ లిఫ్టింగ్ చేయడం తనకు అస్సలు నచ్చలేదని, కానీ బసు సర్ కేవలం 'నన్ను నమ్ము' అని మాత్రమే చెప్పారని కోహ్లి గుర్తుచేసుకున్నాడు. 2015 శ్రీలంక సిరీస్ టైమ్‌లో బసు సర్ దగ్గర వెయిట్ లిఫ్టింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాక, తన బాడీలో వచ్చిన మార్పులు చూసి షాక్ అయ్యానని, అప్పటి నుండి ఫిట్‌నెస్ పట్ల తన ఆలోచనా విధానమే మారిపోయిందని కోహ్లి చెప్పాడు. విరాట్ కోహ్లి రికమండేషన్‌తోనే బసు శంకర్ ఆర్‌సీబీ కోచింగ్ స్టాఫ్‌లోకి రావడం విశేషం.

66
ఆర్‌సీబీలో బసు శంకర్ ప్లేస్ లోకి వచ్చేది ఎవరు?
Image Credit : RCB MEDIA

ఆర్‌సీబీలో బసు శంకర్ ప్లేస్ లోకి వచ్చేది ఎవరు?

బసు శంకర్ లాంటి లెజెండ్ టీమ్‌ను వీడిపోవడంతో ఆర్‌సీబీ సపోర్ట్ స్టాఫ్‌లో ఒక పెద్ద గ్యాప్ ఏర్పడింది. క్రికెటర్ల ఫ్లెక్సిబిలిటీని, స్టామినాను పెంచి మ్యాచ్ విన్నర్లుగా మార్చే ఇలాంటి ఎక్స్‌పర్ట్ కోచ్‌ను రీప్లేస్ చేయడం ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్‌కు అంత ఈజీ కాదు. మరి వచ్చే సీజన్ కల్లా బసు శంకర్ ప్లేస్‌లోకి ఎవరిని తెస్తారనేది ఇప్పుడు క్రీడాలోకంలో హాట్ టాపిక్‌గా మారింది. ట్రోఫీ గెలిచిన ఆనందంలో ఉన్న అభిమానులు, బసు శంకర్ ఫేర్‌వెల్ కాస్త ఎమోషనల్ టచ్ ఇచ్చిందనే చెప్పాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
విరాట్ కోహ్లీ
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image2
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Recommended image3
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Related Stories
Recommended image1
IRCTC South India Tour: ఒక్క టికెట్‌తో రామేశ్వరం, అరుణాచలం సహా 7 పుణ్యక్షేత్రాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Recommended image2
India T20 captain: వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్‌పై బీసీసీఐ వేటు ! టీమిండియా కొత్త కెప్టెన్ ఇతనేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved