MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • IPL 2026 : విధ్వంసకర ఓపెనర్లతో SRH మైండ్ బ్లోయింగ్ ప్లేయింగ్ XI ఇదే !

IPL 2026 : విధ్వంసకర ఓపెనర్లతో SRH మైండ్ బ్లోయింగ్ ప్లేయింగ్ XI ఇదే !

SRH vs RCB: ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్ లో ఆర్సీబీతో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. ప్యాట్ కమిన్స్ లేకపోవడతో ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో హైదరాబాద్ బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలోనే జట్టులో భారీ మార్పులకు సిద్ధమైంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 28 2026, 04:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
RCB vs SRH : సన్‌రైజర్స్ తుది జట్టులో భారీ మార్పులు !
Image Credit : AI Generated

RCB vs SRH : సన్‌రైజర్స్ తుది జట్టులో భారీ మార్పులు !

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో భాగంగా శనివారం ఒక ఉత్కంఠభరిత పోరుకు తెరలేవనుంది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో మాజీ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది.

ఈ కీలక పోరుకు కొన్ని గంటల ముందే భారత మాజీ ఓపెనర్, ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు ఆకాష్ చోప్రా సన్‌రైజర్స్ కోసం తన అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించారు. ఈ జట్టులో పలు ఆసక్తికర మార్పులు సూచించిన చోప్రా, ఎస్ఆర్‌హెచ్ విజయావకాశాలపై తన విశ్లేషణను పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ప్యాట్ కమిన్స్ దూరం.. కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
Image Credit : Pinterest

ప్యాట్ కమిన్స్ దూరం.. కెప్టెన్‌గా ఇషాన్ కిషన్

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సీజన్ ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వ్యక్తిగత కారణాల వల్ల ప్రారంభ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఆయన దూరం కావడంతో 2026 టీ20 ప్రపంచకప్ హీరో ఇషాన్ కిషన్ జట్టు పగ్గాలు చేపట్టనున్నారు. కాగా, కమిన్స్ స్థానాన్ని భర్తీ చేసేందుకు జట్టులో బ్రైడన్ కార్స్, డేవిడ్ పేన్, ఇషాన్ మలింగ వంటి నాణ్యమైన బౌలర్లు ఉన్నప్పటికీ, ఆకాష్ చోప్రా మాత్రం ఒక ప్రత్యేక వ్యూహంతో ముందుకు వచ్చారు.

36
నితీష్ కుమార్ రెడ్డి స్థానంపై చోప్రా కీలక సూచన
Image Credit : Getty

నితీష్ కుమార్ రెడ్డి స్థానంపై చోప్రా కీలక సూచన

ఆకాష్ చోప్రా తన ఎక్స్‌ అకౌంట్ లో విడుదల చేసిన వీడియోలో యువ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చర్చించారు. నితీష్ రెడ్డి బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో మేనేజ్‌మెంట్ ఇంకా నిర్ణయం తీసుకోవడంలో ఆలోచనలు చేస్తోందని అభిప్రాయపడ్డారు. "నితీష్ కుమార్ రెడ్డిని ఏ స్థానంలో ఆడించాలో జట్టుకు ఇంకా స్పష్టత రాలేదు. ఆయనను కొన్నిసార్లు నంబర్ 4లో, మరికొన్ని సార్లు నంబర్ 6లో పంపిస్తున్నారు. నా అభిప్రాయం ప్రకారం, ఆయనను నంబర్ 5 స్థానానికి పరిమితం చేయాలి. అంతకంటే కిందకు పంపడం జట్టుకు మంచిది కాదు" అని చోప్రా పేర్కొన్నారు.

46
హైదరాబాద్ ఓపెనింగ్‌లో విధ్వంసకర జోడీ
Image Credit : Instagram/kavyamaran.offical, X/SunRisers

హైదరాబాద్ ఓపెనింగ్‌లో విధ్వంసకర జోడీ

బ్యాటింగ్ విభాగంలో ఆకాష్ చోప్రా ఎటువంటి ప్రయోగాలు చేయలేదు. గత సీజన్ తరహాలోనే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనర్లుగా ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వీరిద్దరూ పవర్ ప్లేలో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే సామర్థ్యం ఉన్నవారని ఆయన గుర్తు చేశారు. ఇక మూడో స్థానంలో కెప్టెన్ ఇషాన్ కిషన్, నాలుగో స్థానంలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ బరిలోకి దిగనున్నారు. ఈ టాప్-4 బ్యాటింగ్ లైనప్ లీగ్‌లోనే అత్యంత ప్రమాదకరమైనదిగా చోప్రా అభివర్ణించారు.

56
ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ విభాగం.. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్
Image Credit : SRH Instagram

ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ విభాగం.. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్

ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా ఉందని భావించిన ఆకాష్ చోప్రా, డెత్ ఓవర్ల కోసం శ్రీలంక పేసర్ ఇషాన్ మలింగను జట్టులోకి తీసుకోవాలని సూచించారు. దేశీయ పేసర్లుగా హర్షల్ పటేల్, శివమ్ మావి, జయదేవ్ ఉనద్కత్ వైపు ఆయన మొగ్గు చూపారు. వీరికి తోడుగా మిడిల్ ఆర్డర్‌లో లియామ్ లివింగ్‌స్టోన్ ఆల్ రౌండర్ పాత్ర పోషించనున్నారు. స్పిన్ విభాగంలో ఇంపాక్ట్ ప్లేయర్లుగా జీషన్ అన్సారీ లేదా శివాంగ్ కుమార్‌లను ఉపయోగించుకోవాలని చోప్రా మేనేజ్‌మెంట్‌కు సలహా ఇచ్చారు.

66
ఆకాష్ చోప్రా ఎంపిక చేసిన SRH ప్లేయింగ్ XI:
Image Credit : SRH Twitter

ఆకాష్ చోప్రా ఎంపిక చేసిన SRH ప్లేయింగ్ XI:

1. అభిషేక్ శర్మ

2. ట్రావిస్ హెడ్

3. ఇషాన్ కిషన్ (కెప్టెన్)

4. హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్)

5. నితీష్ కుమార్ రెడ్డి

6. లియామ్ లివింగ్‌స్టోన్

7. సలీల్ అరోరా

8. హర్షల్ పటేల్

9. శివమ్ మావి

10. జయదేవ్ ఉనద్కత్

11. ఇషాన్ మలింగ

ఇంపాక్ట్ ప్లేయర్: జీషన్ అన్సారీ / శివాంగ్ కుమార్

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Recommended image2
Team India New Captain: టీమిండియాకు కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్లు.. పూర్తి వివరాలు ఇవే
Recommended image3
స్మృతి మంధాన చేతికి టీమిండియా పగ్గాలు.. హర్మన్‌ప్రీత్ స్థానంలో కొత్త కెప్టెన్
Related Stories
Recommended image1
RCB vs SRH : కోహ్లీ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. బీసీసీఐ సంచలన నిర్ణయం
Recommended image2
IPL : ఉత్కంఠ రేపుతున్న RCB vs SRH మ్యాచ్.. బెంగళూరులో గెలిచేది ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved