MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • RCB vs SRH : కోహ్లీ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. బీసీసీఐ సంచలన నిర్ణయం

RCB vs SRH : కోహ్లీ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. బీసీసీఐ సంచలన నిర్ణయం

RCB vs SRH : ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ తలపడనున్నాయి. అయితే గత ఏడాది జరిగిన తొక్కిసలాట దుర్ఘటన కారణంగా ఓపెనింగ్ సెర్మనీని రద్దు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 26 2026, 03:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
IPL 2026: క్రికెట్ అభిమానులకు షాక్..
Image Credit : Getty

IPL 2026: క్రికెట్ అభిమానులకు షాక్..

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. శనివారం బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అయితే, ఈ మెగా టోర్నీ ప్రారంభోత్సవం విషయంలో బీసీసీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించడం లేదని బోర్డు అధికారికంగా ప్రకటించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
గత ఏడాది విషాదం నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయం
Image Credit : ANI

గత ఏడాది విషాదం నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయం

గత ఏడాది ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచింది. ఈ విజయం తర్వాత బెంగళూరులో నిర్వహించిన విజయోత్సవ సభలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. అభిమానుల తాకిడి పెరగడంతో జరిగిన భారీ తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనను స్మరిస్తూ, మరణించిన వారికి నివాళిగా ఈసారి చిన్నస్వామి స్టేడియంలో ఎలాంటి ఆర్భాటాలు, వేడుకలు లేకుండానే టోర్నీని ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది.

36
చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లకు అనుమతి
Image Credit : ipl media

చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లకు అనుమతి

చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై గత వారం వరకు ప్రశ్నలు ఉన్నాయి. గత ఏడాది జరిగిన ప్రమాదం దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం కొన్ని కఠినమైన నిబంధనలను విధించింది. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఆ షరతులన్నింటినీ నెరవేర్చిన తర్వాతే, గత వారం బీసీసీఐకి స్టేడియం వినియోగించుకోవడానికి అనుమతి లభించింది. భద్రతా కారణాల దృష్ట్యా కూడా ప్రారంభ వేడుకలను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

46
2019 తరహాలోనే నివాళి
Image Credit : our own

2019 తరహాలోనే నివాళి

ప్రారంభ వేడుకలను రద్దు చేయడం బీసీసీఐకి ఇది మొదటిసారి కాదు. గతంలో 2019లో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళిగా అప్పటి ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీని కూడా బీసీసీఐ రద్దు చేసింది. అదే స్ఫూర్తితో ఇప్పుడు బెంగళూరు దుర్ఘటన బాధితుల పట్ల గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం క్రికెట్ మ్యాచ్ మాత్రమే జరుగుతుందని, ఎలాంటి బాలీవుడ్ ప్రదర్శనలు లేదా సాంస్కృతిక కార్యక్రమాలు ఉండవని బోర్డు స్పష్టం చేసింది.

56
ఘనంగా ఐపీఎల్ ముగింపు వేడుకలు
Image Credit : Getty

ఘనంగా ఐపీఎల్ ముగింపు వేడుకలు

ప్రారంభ వేడుకలు లేకపోయినా, మే 31న జరిగే ఐపీఎల్ 2026 ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ధృవీకరించారు. టోర్నీ ఆఖరి క్షణాలు అభిమానులకు గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మే నెలాఖరు వరకు సాగే ఈ క్రికెట్ పండుగలో మొత్తం 10 జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి.

66
అత్యంత ఖరీదైన జట్టుగా ఆర్‌సీబీ
Image Credit : Getty

అత్యంత ఖరీదైన జట్టుగా ఆర్‌సీబీ

మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు హాట్ టాపిక్ గా మారింది. ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఆర్‌సీబీ జట్టును రికార్డు స్థాయిలో రూ. 16,600 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన జట్టుగా ఆర్‌సీబీ అవతరించింది. యాజమాన్యం మారిన తర్వాత ఆడుతున్న మొదటి మ్యాచ్ కావడంతో పాటు, డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుండటంతో కోహ్లీ సేనపై భారీ అంచనాలు ఉన్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియా జ‌ట్టు ఖ‌రారు.. ఎవ‌రు ఇన్‌, ఎవ‌రు అవుట్ అంటే.?
Recommended image2
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image3
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Related Stories
Recommended image1
IPL లో 357 సిక్సర్లు, 6 సెంచరీలతో విధ్వంసం.. కానీ అన్ లక్కీ ప్లేయర్
Recommended image2
IPL లో ఫాస్టెస్ట్ సెంచరీలు కొట్టిన భారతీయులు వీరే.. నంబర్ 1 ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved