MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • IPL 2026: మరోసారి రిపీట్ అయితే శ్రేయాస్ అయ్యర్‌పై బ్యాన్.! కష్టాల్లో సర్పంచ్ సాబ్..

IPL 2026: మరోసారి రిపీట్ అయితే శ్రేయాస్ అయ్యర్‌పై బ్యాన్.! కష్టాల్లో సర్పంచ్ సాబ్..

IPL 2026: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్‌పై పంజాబ్ కింగ్స్ గెలిచిన ఆనందం ఎంతోసేపు నిలవలేదు. నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు 24 లక్షల రూపాయల జరిమానా విధించారు. 

1 Min read
Author : Pavithra D
Published : Apr 06 2026, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పంజాబ్ కింగ్స్‌కు ఐపీఎల్ షాక్
Image Credit : ANI

పంజాబ్ కింగ్స్‌కు ఐపీఎల్ షాక్

ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్నప్పటికీ, క్రమశిక్షణా చర్యలు ఆ జట్టును కలవరపెడుతున్నాయి. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు కావడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మొదటి తప్పుగా పరిగణించి..
Image Credit : X/PunjabKingsIPL

మొదటి తప్పుగా పరిగణించి..

పంజాబ్ జట్టుకు ఈ సీజన్‌లో ఇది రెండో స్లో ఓవర్ రేట్ నేరం. గతంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా పంజాబ్ ఓవర్లను నిర్ణీత సమయంలో పూర్తి చేయలేకపోయింది. అప్పుడు మొదటి తప్పుగా పరిగణించి కేవలం కెప్టెన్‌కు మాత్రమే జరిమానా విధించారు.

35
రెండోసారి తప్పు చేయడంతో భారీ మూల్యం
Image Credit : ANI

రెండోసారి తప్పు చేయడంతో భారీ మూల్యం

కానీ, ఇది రెండోసారి కావడంతో శిక్ష తీవ్రత పెరిగింది. నిబంధనల ప్రకారం శ్రేయస్ అయ్యర్‌కు 24 లక్షల రూపాయల జరిమానా విధించగా, జట్టులోని మిగిలిన 10 మంది ఆటగాళ్లకు కూడా ఒక్కొక్కరికి 6 లక్షల రూపాయలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాగా పడింది.

45
అయ్యర్ కెరీర్‌పై సస్పెన్షన్ కత్తి
Image Credit : Pinterest

అయ్యర్ కెరీర్‌పై సస్పెన్షన్ కత్తి

ప్రస్తుతం లీగ్ దశలో ఇంకా 12 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఐపీఎల్ నిబంధనల ప్రకారం, మూడోసారి కూడా స్లో ఓవర్ రేట్ నమోదైతే కెప్టెన్‌కు 30 లక్షల రూపాయల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. పంజాబ్ వంటి కీలక జట్లకు కెప్టెన్ అందుబాటులో లేకపోవడం పెద్ద దెబ్బ అవుతుంది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ సిఎస్కేపై 29 బంతుల్లో 50 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చిన తరుణంలో, ఇటువంటి సస్పెన్షన్లు జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.

55
విజయాలు సాధించినా..
Image Credit : ANI

విజయాలు సాధించినా..

మున్ముందు మ్యాచ్‌లలో పంజాబ్ జట్టు ఫీల్డింగ్ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో విజయాలు సాధించినా, టెక్నికల్ కారణాల వల్ల కెప్టెన్ దూరం కావడం ఆ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను ప్రభావితం చేయవచ్చు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రీడలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asian Games 2026: ఒకే రోజు రెండు సిల్వర్ మెడల్స్ కొట్టిన భారత షూటర్.. ఎవరీ ఎలావెనిల్ వలరివాన్?
Recommended image2
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image3
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Related Stories
Recommended image1
IPL 2026: ఆ ఇద్దరిపై రూ. 28.40 కోట్లు హాంఫట్.! CSKను తిట్టిపోస్తున్న నెటిజన్లు..
Recommended image2
IPL 2026: స్పీడ్ గన్ పగిలిపోయింది! 154.2 కిమీ వేగం.. ఎవరీ అశోక్ శర్మ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved