MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2026: స్పీడ్ గన్ పగిలిపోయింది! 154.2 కిమీ వేగం.. ఎవరీ అశోక్ శర్మ?

IPL 2026: స్పీడ్ గన్ పగిలిపోయింది! 154.2 కిమీ వేగం.. ఎవరీ అశోక్ శర్మ?

154.2 kmph Fastest Ball of IPL 2026: ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ పేసర్ అశోక్ శర్మ 154.2 కిమీ వేగంతో బంతిని విసిరి రికార్డు సృష్టించాడు. జైపూర్ సమీపంలోని ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈ యువకుడి ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 05 2026, 04:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
IPL 2026లో కొత్త స్పీడ్‌స్టర్.. అశోక్ శర్మ 154.2 కిమీ వేగంతో రికార్డు
Image Credit : ANI

IPL 2026లో కొత్త స్పీడ్‌స్టర్.. అశోక్ శర్మ 154.2 కిమీ వేగంతో రికార్డు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఎప్పుడూ కొత్త ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తూనే ఉంటుంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పుడు అందరి దృష్టి గుజరాత్ టైటాన్స్ యంగ్ పేసర్ అశోక్ శర్మపై పడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అశోక్ శర్మ గంటకు 154.2 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇది ఈ సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యంత వేగవంతమైన డెలివరీ కావడం విశేషం. అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ అన్రిచ్ నోర్ట్జే పేరిట ఉన్న 150.9 కిమీ రికార్డును అశోక్ బ్రేక్ చేశాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రెండో మ్యాచ్‌లోనే అద్భుతం.. గిల్‌ ప్రశంసల వర్షం
Image Credit : Social Media

రెండో మ్యాచ్‌లోనే అద్భుతం.. గిల్‌ ప్రశంసల వర్షం

అశోక్ శర్మకు ఇది కేవలం రెండో ఐపీఎల్ మ్యాచ్ మాత్రమే. తన అరంగేట్రం మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై తొలి బంతినే 149.7 కిమీ వేగంతో విసిరి తన బౌలింగ్ పదును చూపించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16వ ఓవర్ ఆఖరి బంతిని ధ్రువ్ జురెల్‌కు అత్యంత వేగవంతమైన యార్కర్‌గా సంధించాడు. అశోక్ శర్మ ప్రతిభను కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కొనియాడారు. అనుభవం పెరిగే కొద్దీ అశోక్ జట్టుకు ఎంతో విలువైన ఆటగాడిగా మారతాడని గిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం వేగమే కాకుండా, బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం అతనికి అదనపు బలం.

35
రైతు కుటుంబం నుంచి ఐపీఎల్ వరకు అశోక్ శర్మ ప్రయాణం
Image Credit : AFP + X/@CricketopiaCom

రైతు కుటుంబం నుంచి ఐపీఎల్ వరకు అశోక్ శర్మ ప్రయాణం

రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలో ఉన్న రాంపూర్ అనే చిన్న గ్రామానికి చెందిన అశోక్ శర్మ ప్రయాణం సామాన్యమైంది కాదు. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన అశోక్, తన అన్నయ్య అక్షయ్ శర్మ త్యాగం వల్ల ఈ స్థాయికి చేరుకున్నాడు. అక్షయ్ కూడా క్రికెటర్ కావాలని అనుకున్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందుల వల్ల తమ్ముడి కెరీర్ కోసం తన కలను వదులుకున్నాడు. ఒక దశలో క్రికెట్‌కు స్వస్తి చెప్పి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించాలని అశోక్ భావించాడు. కానీ ఒక టాలెంట్ హంట్‌లో ఆలస్యంగా వెళ్లినప్పటికీ, అక్కడి కోచ్‌లను తన వేగంతో మెప్పించి మళ్ళీ కెరీర్‌ను గాడిలో పెట్టాడు.

45
దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టి.. కోట్లు కొల్లగొట్టిన అశోక్ శర్మ
Image Credit : Getty

దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టి.. కోట్లు కొల్లగొట్టిన అశోక్ శర్మ

2022లో కోల్‌కతా నైట్ రైడర్స్ అశోక్ శర్మను రూ. 55 లక్షలకు కొనుగోలు చేసినప్పటికీ, అతనికి ఆ సీజన్‌లో ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత 2025లో రాజస్థాన్ రాయల్స్ రూ. 30 లక్షలకు తీసుకుంది. అయితే 2025-26 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాజస్థాన్ తరపున 10 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు తీసి అశోక్ సంచలనం సృష్టించాడు. ఈ అద్భుత ప్రదర్శనే ఐపీఎల్ 2026 వేలంలో గుజరాత్ టైటాన్స్ అతడిని రూ. 90 లక్షలకు దక్కించుకునేలా చేసింది. నెట్ బౌలర్‌గా ప్రారంభించి, ఈరోజు లీగ్‌లోనే ఫాస్టెస్ట్ బౌలర్‌గా ఎదగడం అశోక్ పట్టుదలకు నిదర్శనం.

55
టీమిండియా తలుపు తడుతున్న స్పీడ్‌స్టర్
Image Credit : Getty

టీమిండియా తలుపు తడుతున్న స్పీడ్‌స్టర్

ప్రస్తుత భారత క్రికెట్‌లో 150 కిమీ కంటే ఎక్కువ వేగంతో నిలకడగా బౌలింగ్ చేసే వారు చాలా తక్కువ. ఉమ్రాన్ మాలిక్, మయాంక్ యాదవ్ తర్వాత అశోక్ శర్మ ఆ జాబితాలో చేరాడు. తన ఆరాధ్య దైవం డేల్ స్టెయిన్ లాగే బంతులు విసరాలని లక్ష్యంగా పెట్టుకున్న అశోక్, యార్కర్లు, బౌన్సర్లతో బ్యాటర్లను భయపెడుతున్నాడు. ఇదే జోరు కొనసాగిస్తే త్వరలోనే టీమిండియా బ్లూ కలర్ జెర్సీలో అశోక్ శర్మను చూడటం ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గుజరాత్ టైటాన్స్ మేనేజ్మెంట్ కూడా అతనికి పూర్తి సపోర్టు ఇస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image2
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image3
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Related Stories
Recommended image1
CSK vs PBKS : 200 పైగా రన్స్ కొట్టినా సీఎస్కే ఎందుకు ఓడిపోయింది?
Recommended image2
IPL 2026 : 210 రన్స్ ఛేజింగ్.. పంజాబ్ కింగ్స్ సృష్టించిన వరల్డ్ రికార్డులు ఇవే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved