MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • IPL 2026 Records: ఐపీఎల్ 2026లో రికార్డుల సునామీ.. 27 వేలకు పైగా రన్స్, 1426 సిక్సర్లు

IPL 2026 Records: ఐపీఎల్ 2026లో రికార్డుల సునామీ.. 27 వేలకు పైగా రన్స్, 1426 సిక్సర్లు

IPL 2026 Records: ఐపీఎల్ 2026 సీజన్ రికార్డుల వేటతో ముగిసింది. ఏకంగా 27,450 రన్స్, 1426 సిక్సర్లు నమోదయ్యాయి. అలాగే, 15 సెంచరీలతో బ్యాటర్లు సృష్టించిన నయా హిస్టరీ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 01 2026, 07:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఐపీఎల్ 2026లో రికార్డుల మోత
Image Credit : ANI

ఐపీఎల్ 2026లో రికార్డుల మోత

ఐపీఎల్ 2026 సీజన్ సూపర్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. ఈసారి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ట్రోఫీని ముద్దాడి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ 19వ సీజన్‌లో బ్యాటర్లు రేపిన అలజడి అంతా ఇంతా కాదు. గ్రౌండ్‌లోకి దిగితే చాలు సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించారు. ఒక టీమ్ 200 ప్లస్ స్కోరు బోర్డు మీద పెడితే, అవతలి టీమ్ చాలా ఈజీగా దాన్ని అందుకుంది.

ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధికంగా 200 ప్లస్ స్కోర్లు నమోదైన సీజన్‌గా ఇది నిలిచిపోయింది. ఫోర్లు, సిక్సర్ల రికార్డులన్నీ బద్దలైపోయాయి. ఐపీఎల్ చరిత్రలో ముగ్గురు బ్యాటర్లు ఒకే సీజన్‌లో 700 కంటే ఎక్కువ రన్స్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైమ్. టోటల్‌గా చూస్తే ఈ సీజన్ ఒక రికార్డ్ బ్రేకర్ అని చెప్పొచ్చు. ఇంతకీ ఈ సీజన్ ఎందుకు అంత స్పెషల్‌గా నిలిచింది? ఎలాంటి రికార్డులు క్రియేట్ అయ్యాయో మీకు తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పరుగుల వర్షం.. గత 18 సీజన్ల రికార్డులు బ్రేక్
Image Credit : X/IPL

పరుగుల వర్షం.. గత 18 సీజన్ల రికార్డులు బ్రేక్

ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో బ్యాటర్ల హవా నడిచింది. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగుల వరద పారించారు. గత 18 సీజన్లలో ఉన్న అన్ని రికార్డులను ఈ ఏడాది బ్రేక్ చేశారు. ఐపీఎల్ 2026లో మొత్తం 74 మ్యాచ్‌లు జరిగాయి. ఈ మ్యాచ్‌లన్నింటిలో కలిపి ఏకంగా 27,450 రన్స్ వచ్చాయి. ఐపీఎల్ హిస్టరీలో ఒకే సీజన్‌లో ఇన్ని రన్స్ రావడం ఇదే మొదటిసారి.

అంతేకాదు, ముగ్గురు బ్యాటర్లు 700 పరుగుల మార్క్‌ను దాటి సరికొత్త మైలురాయిని అందుకున్నారు. అందులో వైభవ్ సూర్యవంశీ, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ ఉన్నారు. ఈ ముగ్గురు టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో దుమ్మురేపారు.

36
సిక్సర్లు, ఫోర్ల మోత.. రాజస్థాన్ రాయల్స్ టాప్
Image Credit : IPL MEDIA

సిక్సర్లు, ఫోర్ల మోత.. రాజస్థాన్ రాయల్స్ టాప్

ఈ సీజన్‌లో బ్యాటర్లు బాల్‌ను బౌండరీ లైన్ దాటించడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియంలను హోరెత్తించారు. ఈ ఒక్క సీజన్‌లోనే రికార్డు స్థాయిలో 1426 సిక్సర్లు నమోదయ్యాయి. దీనితో పాటు బ్యాటర్లు 2332 ఫోర్లు కూడా బాదారు.

ఇక ఇండివిడ్యువల్ రికార్డుల విషయానికి వస్తే.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అందరికంటే ఎక్కువగా 72 సిక్సర్లు కొట్టి రికార్డు క్రియేట్ చేశాడు. ఒకే సీజన్‌లో ఒక బ్యాటర్ ఇన్ని సిక్సర్లు కొట్టడం ఇదే తొలిసారి. టీమ్ పరంగా చూస్తే రాజస్థాన్ రాయల్స్ ఈ లిస్ట్‌లో అందరికంటే ముందుంది. రాజస్థాన్ బ్యాటర్లు ఏకంగా 180 సార్లు బాల్‌ను స్టాండ్స్‌లోకి పంపించారు.

46
సెంచరీల రికార్డ్ బద్దల్.. సంజూ శాంసన్ హవా
Image Credit : ANI

సెంచరీల రికార్డ్ బద్దల్.. సంజూ శాంసన్ హవా

ఐపీఎల్ 19వ సీజన్‌లో సెంచరీల రికార్డ్ కూడా పూర్తిగా చెరిగిపోయింది. ఈ ఏడాది టోర్నమెంట్‌లో మొత్తం 15 సెంచరీలు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో 15 వందలు నమోదు కావడం ఇదే ఫస్ట్ టైమ్. ఇంతకుముందు ఐపీఎల్ 2025 సీజన్‌లో 14 సెంచరీలు వచ్చాయి.

ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ సంజూ శాంసన్ ఈ సీజన్‌లో అదరగొట్టాడు. అతడు అత్యధికంగా రెండు సెంచరీలు చేసి తన క్లాస్ ఏంటో చూపించాడు.

56
65 సార్లు 200 ప్లస్ స్కోర్లు.. ఛేజింగ్‌లోనూ కింగ్స్
Image Credit : ANI

65 సార్లు 200 ప్లస్ స్కోర్లు.. ఛేజింగ్‌లోనూ కింగ్స్

ఈ సీజన్‌లో బ్యాటర్లు బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. ప్రతి మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే సీజన్ మొత్తంలో 65 సార్లు టీమ్స్ 200 కంటే ఎక్కువ స్కోర్లు సాధించాయి. కేవలం స్కోర్లు చేయడమే కాదు, వాటిని చేజ్ చేయడంలోనూ జట్లు వెనక్కి తగ్గలేదు.

200 లేదా అంతకంటే ఎక్కువ రన్స్ టార్గెట్‌ను టీమ్స్ చాలా ఈజీగా అందుకున్నాయి. అలా ఈ సీజన్‌లో 17 మ్యాచ్‌లలో 200 ప్లస్ భారీ టార్గెట్స్ విజయవంతంగా అందుకున్నాయి.

66
పేస్ గుర్రాల జోరు.. రబడాకు పర్పుల్ క్యాప్
Image Credit : ANI

పేస్ గుర్రాల జోరు.. రబడాకు పర్పుల్ క్యాప్

బ్యాటర్ల హవా నడిచిన ఈ సీజన్‌లోనూ ఫాస్ట్ బౌలర్లు తమ పవర్ ఏంటో చూపించారు. టోర్నమెంట్ మొత్తంలో కలిపి 878 వికెట్లు పడగా.. అందులో ఏకంగా 603 వికెట్లు ఫాస్ట్ బౌలర్ల ఖాతాలోనే పడ్డాయి. ఇక స్పిన్నర్లు 232 వికెట్లు మాత్రమే తీయగలిగారు.

గుజరాత్ టైటాన్స్ స్పీడ్‌స్టర్ కగిసో రబడా ఈ సీజన్‌లో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అతడు తన పదునైన బౌలింగ్‌తో మొత్తం 29 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఆర్సీబీ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 28 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image2
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image3
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
IPL 2026 Final: గిల్ ప్లాన్ రివర్స్.. గుజరాత్ టైటాన్స్‌ను ఓడిపోవడానికి టాప్ 5 కారణాలు ఇవే !
Recommended image2
IPL 2026 Purple Cap Winner: రబాడ చేతికి పర్పుల్ క్యాప్.. హిస్టరీ క్రియేట్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్న భువనేశ్వర్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved