- Home
- Sports
- Cricket
- IPL 2026 Purple Cap Winner: రబాడ చేతికి పర్పుల్ క్యాప్.. హిస్టరీ క్రియేట్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్న భువనేశ్వర్ !
IPL 2026 Purple Cap Winner: రబాడ చేతికి పర్పుల్ క్యాప్.. హిస్టరీ క్రియేట్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్న భువనేశ్వర్ !
IPL 2026 Purple Cap Winner: ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ కగిసో రబాడ 29 వికెట్లతో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తృటిలో అరుదైన రికార్డును మిస్ అయ్యాడు.

ఐపీఎల్ 2026 పర్పుల్ క్యాప్ రేస్.. రబాడ టాప్.. భువి అన్ లక్కీ
ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్‌తో పర్పుల్ క్యాప్ రేస్‌కు ఎండ్ కార్డ్ పడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరిగిన గ్రాండ్ ఫైనల్‌లో ఈ సస్పెన్స్‌కు తెరపడింది.
ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా గుజరాత్ టైటాన్స్ స్పీడ్‌స్టర్ కగిసో రబాడ నిలిచాడు. దాంతో పర్పుల్ క్యాప్ రబాడ సొంతమైంది. కాగా, ఈ రేసులో సెకండ్ ప్లేస్‌లో నిలిచిన ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఒక హిస్టారికల్ రికార్డును క్రియేట్ చేసే గోల్డెన్ ఛాన్స్‌ను మిస్ చేసుకున్నాడు.
ఫైనల్ మ్యాచ్‌లో రబాడ ట్విస్ట్.. భువి ఫైట్
ఫైనల్ మ్యాచ్‌కంటే ముందే రబాడ ఖాతాలో 28 వికెట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్‌పై ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భువి 4 ఓవర్లలో 29 రన్స్ ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ సీజన్‌లో అతని టోటల్ వికెట్ల సంఖ్య 28కి చేరింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో గుజరాత్ బౌలింగ్‌కు వచ్చినప్పుడు కగిసో రబాడ సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు.
ఆర్సీబీ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ను అవుట్ చేయడం ద్వారా రబాడ ఈ సీజన్‌లో తన 29వ వికెట్ పూర్తి చేసుకున్నాడు. దీంతో భువీని దాటేసి రబాడ పర్పుల్ క్యాప్‌ను కన్ఫర్మ్ చేసుకున్నాడు. క్వాలిఫైయర్-1 లో ఆర్సీబీ ఓడిపోవడం వల్ల రబాడకు ఒక ఎక్స్‌ట్రా మ్యాచ్ ఆడే అవకాశం లభించింది, అది అతనికి ప్లస్ అయింది.
చరిత్ర సృష్టించే ఛాన్స్ మిస్ చేసుకున్న భువనేశ్వర్
ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధికంగా 2 సార్లు పర్పుల్ క్యాప్ గెలిచిన రికార్డ్ భువనేశ్వర్ కుమార్, డ్వేన్ బ్రావో, హర్షల్ పటేల్ పేరిట ఉంది. ఒకవేళ ఈ సీజన్‌లో భువి పర్పుల్ క్యాప్ గెలిచి ఉంటే, ఐపీఎల్ చరిత్రలో 3 సార్లు ఈ క్యాప్ సాధించిన ఏకైక ఫస్ట్ బౌలర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేసేవాడు.
కానీ కేవలం ఒక్క వికెట్ తేడాతో భువి ఈ హిస్టారికల్ ఛాన్స్‌ను మిస్ అయ్యాడు. భువి ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లలో 7.95 ఎకానమీతో 28 వికెట్లు తీశాడు. కాగా, సౌతాఫ్రికా స్టార్ రబాడ ఐపీఎల్‌లో పర్పుల్ క్యాప్ గెలవడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అతను పర్పుల్ క్యాప్ సాధించాడు. అప్పట్లో కూడా అతని టీమ్ ఫైనల్లో ఓడిపోయింది, ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ కూడా ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. అయితే ఆర్సీబీ టీమ్ ఐపీఎల్ 2026 ట్రోఫీని ముద్దాడింది.
15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చేతికి 'ఆరెంజ్ క్యాప్'
ఈ సీజన్‌లో బౌలింగ్‌లోనే కాదు, బ్యాటింగ్‌లోనూ ఒక అద్భుత రికార్డు నమోదైంది. కేవలం 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అత్యధిక రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్‌ను తన సొంతం చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన వైభవ్, 16 మ్యాచ్‌ల్లో 48.50 యావరేజ్‌తో, 237.31 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 776 రన్స్ బాదాడు.
ఇందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ హిస్టరీలోనే ఆరెంజ్ క్యాప్ గెలిచిన అత్యంత చిన్న వయస్కుడిగా వైభవ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు.
ఐపీఎల్ 2026: టాప్ 5 వికెట్ టేకర్స్ వీరే
ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ బౌలర్ల లిస్ట్ చూస్తే.. రబాడ 17 మ్యాచ్‌ల్లో 29 వికెట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ 16 మ్యాచ్‌లలో 25 వికెట్లతో మూడో స్థానంలో నిలిచాడు. గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 17 మ్యాచ్‌లలో 21 వికెట్లతో నాలుగో ప్లేస్ సాధించగా, చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ అంశుల్ కంబోజ్ 14 మ్యాచ్‌ల్లో 21 వికెట్లతో ఐదో స్థానంలో నిలిచాడు.

