MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Sports
  • IPL 2026: టీమిండియాలోకి వస్తే వాడు చాలా డేంజర్.. బ్యాటింగ్ ఆడితే వీడియో గేమ్‌లా ఉంటుంది

IPL 2026: టీమిండియాలోకి వస్తే వాడు చాలా డేంజర్.. బ్యాటింగ్ ఆడితే వీడియో గేమ్‌లా ఉంటుంది

IPL 2026: రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో చెలరేగిపోతున్న ఈ బీహార్ బ్యాటర్, క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టడమే తన లక్ష్యమని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 

1 Min read
Author : Pavithra D
Published : Mar 20 2026, 06:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 ఐపీఎల్ 2026 సిద్ధం
Image Credit : Instagram

ఐపీఎల్ 2026 సిద్ధం

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతుండటంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ క్రమంలో బీహార్‌కు చెందిన 14 ఏళ్ల యువ సంచలనం, రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత సీజన్‌లోనే తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యువ ఆటగాడి గురించి మాజీ కెప్టెన్ సంజు శాంసన్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సంచలన రికార్డులు, లక్ష్యాలు
Image Credit : X/BCCI

సంచలన రికార్డులు, లక్ష్యాలు

వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ ప్రస్థానం 2025లో మొదలైంది. తన మొదటి సీజన్‌లోనే 7 మ్యాచ్‌ల్లో 200కు పైగా స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో హర్షా భోగ్లే అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఐపీఎల్‌లో క్రిస్ గేల్ నెలకొల్పిన 175 పరుగుల రికార్డును బద్దలు కొట్టడమే తన లక్ష్యమని వైభవ్ ధైర్యంగా చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Related Articles

Related image1
IPL 2026 : అదరగొట్టేందుకు సిద్దమైన అన్‌క్యాప్డ్ ప్లేయర్స్.. ఈ ఐదుగురు రెచ్చిపోతే వార్ వన్ సైడే
Related image2
IPL 2026 : ఐపీఎల్ జట్లకు దడపుట్టిస్తున్న కేకేఆర్ మాస్టర్ ప్లాన్ !
35
ద్రవిడ్‌తో మీటింగ్
Image Credit : Instagram

ద్రవిడ్‌తో మీటింగ్

సంజూ శాంసన్ ఒక సందర్భాన్ని గుర్తుచేస్తూ, ఐపీఎల్ అరంగేట్రానికి ముందు రాహుల్ ద్రవిడ్ వైభవ్‌ను పిలిచి 'నీ గేమ్ ప్లాన్ ఏంటి?' అని అడిగారని తెలిపారు. దానికి వైభవ్ ఏమాత్రం తడబడకుండా, "సార్, ప్రత్యేక ప్లాన్ ఏమీ లేదు.. నా జోన్‌లోకి బంతి వస్తే గాలిలోకి పంపించేస్తా" అని బదులిచ్చాడట.

45
మైదానంలో విధ్వంసక ఇన్నింగ్స్
Image Credit : Instagram

మైదానంలో విధ్వంసక ఇన్నింగ్స్

చెప్పినట్లుగానే మైదానంలో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడని, అతని ఆట తీరు ఒక వీడియో గేమ్ లా ఉంటుందని సంజు శాంసన్ కొనియాడారు. అలాగే వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ అరంగేట్రం నుంచి ఇప్పటిదాకా నెలకొల్పిన రికార్డులు లెక్కలేనన్ని ఉన్నాయి.

55
కీలక మార్పులు
Image Credit : Instagram

కీలక మార్పులు

2025లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్న సంజూ శాంసన్ సారధ్యంలోనే వైభవ్ ఐపీఎల్‌లోకి ప్రవేశించాడు. అయితే, 2026 సీజన్ కోసం జరిగిన ట్రేడింగ్‌లో సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్టులోకి చేరడం గమనార్హం. ఈసారి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రియాన్ పరాగ్ నాయకత్వం వహించబోతున్నాడు. టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి వైభవ్ సూర్యవంశికి ఈ 2026 ఐపీఎల్ సీజన్ ఎంతో కీలకం కానుంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs SL: వర్షం పడే సరికే పని ఫినిష్.. గాలే టెస్టులో శ్రీలంకను భారత్ ఎలా దెబ్బకొట్టింది?
Recommended image2
Hockey World Cup: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. రెండో రౌండ్‌కు టీమిండియా
Recommended image3
జాతీయ క్రీడా పురస్క‌రాలు ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం.. ఈసారి ఊహించ‌ని ట్విస్ట్
Related Stories
Recommended image1
IPL 2026 : అదరగొట్టేందుకు సిద్దమైన అన్‌క్యాప్డ్ ప్లేయర్స్.. ఈ ఐదుగురు రెచ్చిపోతే వార్ వన్ సైడే
Recommended image2
IPL 2026 : ఐపీఎల్ జట్లకు దడపుట్టిస్తున్న కేకేఆర్ మాస్టర్ ప్లాన్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved