MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • CSK : ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే ధోనీ ఔట్.. సీఎస్‌కే కొత్త కీపర్ ఎవరు?

CSK : ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే ధోనీ ఔట్.. సీఎస్‌కే కొత్త కీపర్ ఎవరు?

IPL 2026 MS Dhoni : ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే ఎంఎస్ ధోనీ గాయం కారణంగా రెండు వారాలు దూరం కావడంతో ఆ ప్లేస్ ను ఎవరు భర్తీ చేస్తారనే చర్చ మొదలైంది. చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపింగ్ ఆప్షన్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 28 2026, 07:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఐపీఎల్ 2026: ధోనీకి ఏమైంది?
Image Credit : ANI

ఐపీఎల్ 2026: ధోనీకి ఏమైంది?

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) శిబిరంలో ఆందోళన మొదలైంది. కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య దైవం, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గాయం కారణంగా టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ధోనీ పిక్కలో గాయం కారణంగా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. సీఎస్‌కే మేనేజ్‌మెంట్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించింది. ప్రస్తుతానికి ధోనీ రిహాబిలిటేషన్ ప్రక్రియలో ఉన్నారని, అందుకే ఆయన కనీసం రెండు వారాల పాటు మైదానంలోకి దిగలేరని స్పష్టం చేసింది. ఈ వార్త ధోనీ అభిమానుల మనసు ముక్కలు చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వికెట్ కీపింగ్ రేసులో నలుగురు ప్రధాన ఆటగాళ్లు ఎవరు?
Image Credit : Getty

వికెట్ కీపింగ్ రేసులో నలుగురు ప్రధాన ఆటగాళ్లు ఎవరు?

రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పుడు ఒక కీలక సవాలును ఎదుర్కొంటోంది. వికెట్ల వెనుక ధోనీ ఇచ్చే భరోసా మరెవరూ ఇవ్వలేరు. అయితే, జట్టు వద్ద ప్రస్తుతం నలుగురు మంచి వికెట్ కీపింగ్ చేయగల ప్లేయర్లు కూడా ఉన్నారు.

ఈ రేసులో సంజూ శాంసన్, సర్ఫరాజ్ ఖాన్, ఊర్విల్ పటేల్, యువ సంచలనం కార్తీక్ శర్మ ఉన్నారు. వీరిలో ఎవరికి తుది జట్టులో అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ధోనీ లేని లోటును భర్తీ చేయడం కష్టమే అయినా, ఈ నలుగురూ తమదైన శైలిలో రాణించగలరు.

36
సంజూ శాంసన్: ధోనీ తరహాలో శాంతంగా గేమ్ నడిపించగల మొనగాడు
Image Credit : Instagram/chennaiipl

సంజూ శాంసన్: ధోనీ తరహాలో శాంతంగా గేమ్ నడిపించగల మొనగాడు

ధోనీకి అత్యంత సరైన ప్రత్యామ్నాయంగా సంజూ శాంసన్ కనిపిస్తున్నారు. సంజు కేవలం వికెట్ కీపర్ మాత్రమే కాదు, ఓపెనర్‌గా కూడా జట్టుకు అదనపు బలాన్ని ఇస్తారు. అంతర్జాతీయ స్థాయిలో వికెట్ల వెనుక సంజూ నైపుణ్యం ఇప్పటికే నిరూపితమైంది. ధోనీ లాగే క్లిష్ట పరిస్థితుల్లో శాంతంగా ఉంటూ వికెట్ల వెనుక నుంచి గేమ్‌ను మలుపు తిప్పగల సామర్థ్యం సంజూకు ఉంది. గణాంకాలను పరిశీలిస్తే, టీ20 క్రికెట్‌లో సంజూ శాంసన్ 330 మ్యాచ్‌లలో వికెట్ల వెనుక 36 మందిని అవుట్ చేశాడు. అనుభవం రీత్యా సీఎస్‌కేకు ఇతడే మొదటి ఛాయిస్ అయ్యే అవకాశం ఉంది.

46
సర్ఫరాజ్ ఖాన్, ఊర్విల్ పటేల్.. బ్యాటింగ్ బలంతో పాటు కీపింగ్ నైపుణ్యం
Image Credit : Getty

సర్ఫరాజ్ ఖాన్, ఊర్విల్ పటేల్.. బ్యాటింగ్ బలంతో పాటు కీపింగ్ నైపుణ్యం

టీమ్ ఇండియా తరఫున టెస్టుల్లో మెరిసిన సర్ఫరాజ్ ఖాన్ రెండో ఆప్షన్‌గా ఉన్నారు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సర్ఫరాజ్, వికెట్ కీపింగ్‌లో కూడా మెలకువలు తెలిసిన ఆటగాడు. దేశీయ క్రికెట్‌లో ఆయన నిలకడైన ప్రదర్శన సీఎస్‌కే మిడిల్ ఆర్డర్‌కు బలాన్ని ఇస్తుంది. మరోవైపు గుజరాత్ ప్లేయర్ ఊర్విల్ పటేల్ ఎక్స్-ఫ్యాక్టర్ గా మారే ఛాన్స్ ఉంది. గత సీజన్‌లోనే సీఎస్‌కే తరఫున అరంగేట్రం చేసిన అతను.. టీ20ల్లో 28 బంతుల్లోనే సెంచరీ చేసిన రికార్డు కలిగి ఉన్నారు. టాప్ ఆర్డర్‌లో మెరుపు వేగంతో పరుగులు చేస్తూనే వికెట్ కీపింగ్ చేయడంలో పటేల్ దిట్ట.

56
రూ. 14.20 కోట్ల సంచలనం కార్తీక్ శర్మ
Image Credit : stockPhoto

రూ. 14.20 కోట్ల సంచలనం కార్తీక్ శర్మ

రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల యువ వికెట్ కీపర్ బ్యాటర్ కార్తీక్ శర్మపై సీఎస్‌కే భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సీజన్ వేలంలో చెన్నై ఏకంగా 14.20 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ యంగ్ ప్లేయర్‌ను సొంతం చేసుకుంది. దేశీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న కార్తీక్, భారీ సిక్సర్లు కొట్టడంలో మంచి గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు 16 టీ20 మ్యాచ్‌లలో 162.92 స్ట్రైక్ రేట్‌తో 334 పరుగులు చేశారు. ధోనీ లేకపోవడంతో జట్టు మేనేజ్‌మెంట్ ఒక సర్ప్రైజ్ ప్యాకేజీగా కార్తీక్ శర్మను మైదానంలోకి దించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

66
సీఎస్‌కే పూర్తి స్క్వాడ్ ఇదే:
Image Credit : Getty

సీఎస్‌కే పూర్తి స్క్వాడ్ ఇదే:

ఎంఎస్ ధోనీ, సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మ్హాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, ఊర్విల్ పటేల్, శివం దూబే, రామకృష్ణ ఘోష్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరి, నాథన్ ఎల్లిస్, అన్షుల్ కంబోజ్, జమీ ఓవర్టన్, గుర్జప్నీత్ సింగ్, నూర్ అహ్మద్, శ్రేయాస్ గోపాల్, అకీల్ హోసేన్, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ, మాథ్యూ షార్ట్, అమన్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, మాట్ హెన్రీ, రాహుల్ చాహర్, జాక్ ఫోక్స్.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఎం.ఎస్. ధోని
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియా జ‌ట్టు ఖ‌రారు.. ఎవ‌రు ఇన్‌, ఎవ‌రు అవుట్ అంటే.?
Recommended image2
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image3
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Related Stories
Recommended image1
IPL 2026 : విధ్వంసకర ఓపెనర్లతో SRH మైండ్ బ్లోయింగ్ ప్లేయింగ్ XI ఇదే !
Recommended image2
IPL : ఉత్కంఠ రేపుతున్న RCB vs SRH మ్యాచ్.. బెంగళూరులో గెలిచేది ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved