MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Sports
  • IPL 2026 : సన్‌రైజర్స్ కావ్య మారన్ మాస్టర్ ప్లాన్.. కేకేఆర్ కు పండగే !

IPL 2026 : సన్‌రైజర్స్ కావ్య మారన్ మాస్టర్ ప్లాన్.. కేకేఆర్ కు పండగే !

IPL 2026 : ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు గాయాలతో సతమతమవుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఊరట లభించింది. స్టార్ ప్లేయర్ల రాకతో రెండు జట్లు దుమ్మురేపడానికి సిద్ధంగా ఉన్నాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 22 2026, 07:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
IPL 2026: కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్‌లకు గుడ్ న్యూస్
Image Credit : ANI

IPL 2026: కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్‌లకు గుడ్ న్యూస్

ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్రారంభానికి ముందే పలు ఫ్రాంచైజీలకు గుడ్ న్యూస్ అందింది. ముఖ్యంగా షారుఖ్ ఖాన్‌కు చెందిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), కావ్య మారన్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తమ స్టార్ ఆటగాళ్ల రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

గత కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న శ్రీలంక స్టార్ ప్లేయర్లు ఇప్పుడు కోలుకొని మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఆయా జట్ల యాజమాన్యాలకు, ఐపీఎల్ అభిమానులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. ఐపీఎల్ 2026 మినీ వేలంలో భారీ ధర పలికిన ఆటగాళ్లు ఇప్పుడు ఫిట్‌నెస్ సాధించడంపై దృష్టి సారించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కేకేఆర్ స్టార్ బౌలర్ మతీష పతిరాణ వచ్చేస్తున్నాడు
Image Credit : Getty

కేకేఆర్ స్టార్ బౌలర్ మతీష పతిరాణ వచ్చేస్తున్నాడు

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్ 2026 మినీ వేలంలో శ్రీలంక యువ సంచలనం మతీష పతిరాణను ఏకంగా రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, 2026 టీ20 ప్రపంచకప్ సమయంలో పతిరాణ హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. దీనివల్ల అతని ఐపీఎల్ లభ్యతపై అనుమానాలు నెలకొన్నాయి. కానీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, వచ్చే వారం పతిరాణ శ్రీలంక క్రికెట్ (SLC) నిర్వహించే ఫిట్‌నెస్ టెస్టుకు హాజరుకానున్నాడు. ఈ పరీక్షలో అతను పాస్ అయితే, కేకేఆర్ శిబిరంలో చేరడానికి మార్గం సుగమం అవుతుంది. షారుఖ్ ఖాన్ జట్టు ఈ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌పై భారీ అంచనాలు పెట్టుకుంది.

Related Articles

Related image1
IPL Top Scorers: ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాటర్లు వీరే..
Related image2
IPL : శభాష్ సంజూ.. పాపం రోహిత్! ఐపీఎల్ చరిత్రలో ఈ 5 ఇన్నింగ్స్‌లు మర్చిపోలేం
35
ఎస్ఆర్‌హెచ్ ఊపిరి పీల్చుకునే వార్త.. ఈషాన్ మలింగ ఫిట్
Image Credit : SRH\Instagram

ఎస్ఆర్‌హెచ్ ఊపిరి పీల్చుకునే వార్త.. ఈషాన్ మలింగ ఫిట్

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఈసారి ఈషాన్ మలింగను రూ. 1.2 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే 2026 టీ20 ప్రపంచకప్‌కు ముందే మలింగ భుజం గాయంతో జట్టులో ఆందోళన పెంచింది. తాజాగా ఈషాన్ మలింగ కూడా శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్వహించే ఫిట్‌నెస్ పరీక్షకు హాజరుకానున్నాడు. కావ్య మారన్ నేతృత్వంలోని ఎస్ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ మలింగ ఫిట్‌నెస్‌పై ఆశలు పెట్టుకుంది. ఫిట్‌నెస్ పరీక్ష తర్వాత శ్రీలంక క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు ఎన్‌ఓసీ ఇవ్వనుంది. దీనితో అతను ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

45
ఎల్‌ఎస్‌జీ, ఆర్సీబీ జట్లకు కూడా గుడ్ న్యూస్
Image Credit : Getty

ఎల్‌ఎస్‌జీ, ఆర్సీబీ జట్లకు కూడా గుడ్ న్యూస్

కేవలం కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్ మాత్రమే కాకుండా, సంజీవ్ గోయెంకాకు చెందిన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కూడా గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ వనిందు హసరంగ టీ20 ప్రపంచకప్‌లో హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో ఇబ్బంది పడ్డాడు. అతను కూడా ఇప్పుడు ఫిట్‌నెస్ టెస్టుకు సిద్ధమయ్యాడు. అలాగే, విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) రూ. 1.6 కోట్లకు రిటైన్ చేసుకున్న నువాన్ తుషార కూడా ఎన్‌ఓసీ కోసం వేచి చూస్తున్నాడు. శ్రీలంక పేసర్ తుషార రాకతో ఆర్సీబీ బౌలింగ్ విభాగం బలోపేతం కానుంది.

55
ఢిల్లీ క్యాపిటల్స్ చెంతకు పాతుమ్ నిస్సంక
Image Credit : ANI

ఢిల్లీ క్యాపిటల్స్ చెంతకు పాతుమ్ నిస్సంక

శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సంక ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ. 4 కోట్లకు దక్కించుకుంది. నిస్సంక తన అద్భుతమైన ఫామ్‌తో జట్టుకు మంచి ఆరంభాలు ఇస్తాడని నమ్మకంతో ఉంది. అతను కూడా శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్వహించే ఫిట్ నెస్ టెస్టు నెగ్గాల్సి ఉంటుంది. దీని తర్వాత అతను ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంపులో చేరనున్నాడు. మొత్తానికి శ్రీలంక ఆటగాళ్లంతా ఫిట్‌నెస్ సాధిస్తుండటం ఐపీఎల్ 2026 సీజన్ ముందస్తు ఉత్సాహాన్ని పెంచుతోంది. గాయాల నుంచి కోలుకున్న ఈ స్టార్ ఆటగాళ్లు తమ ఫ్రాంచైజీల కోసం ఎలా రాణిస్తారో చూడాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hockey World Cup: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. రెండో రౌండ్‌కు టీమిండియా
Recommended image2
జాతీయ క్రీడా పురస్క‌రాలు ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం.. ఈసారి ఊహించ‌ని ట్విస్ట్
Recommended image3
Ayush Shetty: బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సంచలనం.. ప్రపంచ నంబర్ 1 కు షాకిచ్చిన భారత ప్లేయర్
Related Stories
Recommended image1
IPL Top Scorers: ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాటర్లు వీరే..
Recommended image2
IPL : శభాష్ సంజూ.. పాపం రోహిత్! ఐపీఎల్ చరిత్రలో ఈ 5 ఇన్నింగ్స్‌లు మర్చిపోలేం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved