MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cameron Green: కేకేఆర్ కొంపముంచిన రనౌట్.. 25 కోట్ల ప్లేయర్‌ను తిట్టిపోసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్

Cameron Green: కేకేఆర్ కొంపముంచిన రనౌట్.. 25 కోట్ల ప్లేయర్‌ను తిట్టిపోసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్

Cameron Green : ఐపీఎల్ 2026లో రూ. 25.20 కోట్లు పలికిన కెమెరాన్ గ్రీన్ దారుణంగా విఫలమవడమే కాకుండా, తన జూనియర్ ప్లేయర్ అంగ్క్రిష్ రఘువంశీ చేతిలో తిట్లు తిని రనౌట్ అయ్యాడు. అసలు ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 03 2026, 04:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 ఈడెన్ గార్డెన్స్‌లో హైడ్రామా.. రూ. 25 కోట్ల ఆటగాడికి ఊహించని షాక్
Image Credit : X/@sarkarstix

ఈడెన్ గార్డెన్స్‌లో హైడ్రామా.. రూ. 25 కోట్ల ఆటగాడికి ఊహించని షాక్

ఐపీఎల్ 2026 వేలంలో భారీ అంచనాలతో, ఏకంగా రూ. 25.20 కోట్ల ధర పలికిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కెమెరాన్ గ్రీన్‌కు కాలం కలిసిరావడం లేదు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) భారీ ఆశలు పెట్టుకున్న ఈ ఆటగాడు, అటు ఆటతోనూ ఇటు గ్రౌండ్‌లో ప్రవర్తనతోనూ విమర్శల పాలవుతున్నాడు. 

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్రీన్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి రనౌట్ అయ్యాడు. అయితే, అతను అవుట్ అయిన తీరు కంటే, ఒక అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్ చేతిలో గ్రౌండ్ మధ్యలోనే తిట్లు తినడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గ్రౌండ్ లో గ్రీన్‌కు క్లాస్ పీకిన రఘువంశీ
Image Credit : X@IPL

గ్రౌండ్ లో గ్రీన్‌కు క్లాస్ పీకిన రఘువంశీ

ఈ ఆసక్తికర ఘటన కోల్‌కతా ఇన్నింగ్స్ 6వ ఓవర్లో చోటుచేసుకుంది. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ నిర్దేశించిన 227 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్ బ్యాటింగ్ చేస్తోంది. 6వ ఓవర్లో అంగ్క్రిష్ రఘువంశీ ఒక స్ట్రైట్ షాట్ ఆడాడు. బౌలర్ ఇషాన్ మలింగ బంతిని ఆపే క్రమంలో చిన్న మిస్ ఫీల్డ్ చేశాడు. బంతి దూరం వెళ్ళలేదు కానీ, ఇద్దరు బ్యాటర్లు పరుగు కోసం ప్రయత్నించారు. 

మలింగ వెంటనే నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో బెయిల్స్ ఎగరగొట్టాడు. మొదట రఘువంశీ అవుట్ అయ్యాడని భావించిన అతను, గ్రీన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతనిపై అరుస్తూ ఏదో అన్నాడు. అయితే థర్డ్ అంపైర్ నిర్ణయంలో రఘువంశీ క్షేమంగా ఉన్నాడని, గ్రీన్ అవుట్ అయ్యాడని తేలింది. రూ. 25 కోట్ల ప్లేయర్‌కు ఒక జూనియర్ నుంచి ఇలాంటి అనుభవం ఎదురవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

35
వరుసగా విఫలమవుతున్న 25 కోట్ల ప్లేయర్
Image Credit : X/@KashifNdmCric

వరుసగా విఫలమవుతున్న 25 కోట్ల ప్లేయర్

ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనూ గ్రీన్ కేవలం 18 పరుగులకే వెనుదిరిగాడు. ఇప్పుడు హైదరాబాద్‌పై కేవలం 2 పరుగులకే పరిమితమయ్యాడు. ప్రస్తుతం అతను బౌలింగ్ కూడా చేయడం లేదు. భారీ ధర చెల్లించి కొనుగోలు చేసిన ఆటగాడు ఇలా బాధ్యతారాహిత్యంగా రనౌట్ అవ్వడం, ఫామ్ కోల్పోవడం కోల్‌కతా నైట్ రైడర్స్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. జట్టులో అత్యంత సీనియర్, అత్యంత ఖరీదైన ఆటగాడై ఉండి, జూనియర్ ప్లేయర్ల నుంచి తిట్లు తినడం అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అంశం.

45
SRH బ్యాటర్ల సునామీ.. 226 పరుగుల భారీ స్కోరు
Image Credit : ANI

SRH బ్యాటర్ల సునామీ.. 226 పరుగుల భారీ స్కోరు

టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే సన్‌రైజర్స్ బ్యాటర్లు ఆ నిర్ణయాన్ని తప్పు అని నిరూపించారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్, యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ, విధ్వంసకర బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్ కేకేఆర్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. వీరి ముగ్గురి మెరుపు ఇన్నింగ్స్‌ల ఫలితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 226 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది. కేకేఆర్ బౌలర్లు ఈ హిట్టింగ్‌ను ఏమాత్రం అడ్డుకోలేకపోయారు.

55
కేకేఆర్ వరుసగా రెండో ఓటమి
Image Credit : X/@sarkarstix

కేకేఆర్ వరుసగా రెండో ఓటమి

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఏ దశలోనూ పోరాటాన్ని చూపించలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్‌లో 161 పరుగులకే కుప్పకూలింది. దీనితో హైదరాబాద్ 65 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒక జట్టు ఓడిపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వరుసగా రెండో ఓటమిని చవిచూసిన రహానే సేన, పాయింట్ల పట్టికలో వెనుకబడింది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ వైఫల్యం, గ్రీన్ ఫామ్ కేకేఆర్ మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asian Games 2026: ఒకే రోజు రెండు సిల్వర్ మెడల్స్ కొట్టిన భారత షూటర్.. ఎవరీ ఎలావెనిల్ వలరివాన్?
Recommended image2
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image3
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Related Stories
Recommended image1
Abhishek Sharma : సిక్సర్ల కింగ్ అభిషేక్.. శర్మ మరో సెంచరీ రికార్డు కొట్టాడు !
Recommended image2
SRH vs KKR: ఆరెంజ్ ఆర్మీ ఊచకోత.. కేకేఆర్ కోటను షేక్ చేశారు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved