MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • SRH vs KKR: ఆరెంజ్ ఆర్మీ ఊచకోత.. కేకేఆర్ కోటను షేక్ చేశారు !

SRH vs KKR: ఆరెంజ్ ఆర్మీ ఊచకోత.. కేకేఆర్ కోటను షేక్ చేశారు !

SRH vs KKR : ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఊచకోత మొదలైంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మెరుపులతో కేకేఆర్‌పై 65 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ ఘనవిజయం సాధించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 02 2026, 11:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈడెన్ గార్డెన్స్‌లో సిక్సర్ల సునామీ : కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్
Image Credit : X

ఈడెన్ గార్డెన్స్‌లో సిక్సర్ల సునామీ : కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్

ఆరంభంలోనే హెడ్, అభిషేక్ విధ్వంసం రేపారు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. పవర్‌ప్లేలోనే ఈ జోడీ కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడి 84 పరుగులు రాబట్టింది, ఇది ఈ సీజన్‌లోనే అత్యధిక పవర్‌ప్లే స్కోరు కావడం విశేషం. వీరిద్దరి దూకుడుతో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. కేకేఆర్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా వీరి సిక్సర్ల వర్షాన్ని అడ్డుకోలేకపోయారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
క్లాసెన్ మెరుపులు.. హైదరాబాద్ భారీ స్కోరు
Image Credit : Getty

క్లాసెన్ మెరుపులు.. హైదరాబాద్ భారీ స్కోరు

ఓపెనర్లు పెవిలియన్ చేరిన తర్వాత హెన్రిచ్ క్లాసెన్ తన మార్కు బ్యాటింగ్‌తో చెలరేగి అర్ధ సెంచరీ సాధించాడు. అతనికి తోడుగా నితీష్ కుమార్ రెడ్డి 39 పరుగులతో విలువైన సహకారాన్ని అందించడంతో హైదరాబాద్ స్కోరు బోర్డు 226 పరుగులకు చేరుకుంది. కోల్‌కతా బౌలర్లలో ఎవరూ కూడా హైదరాబాద్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ 8 వికెట్లు కోల్పోయి భారీ లక్ష్యాన్ని ఉంచింది.

Related Articles

Related image1
Heinrich Klaasen : కాటేరమ్మ కొడుకు క్లాసెన్ మాస్ జాతర.. కేకేఆర్ పై ఆరెంజ్ ఆర్మీ అరాచకం
Related image2
Abhishek Sharma : సిక్సర్ల కింగ్ అభిషేక్.. శర్మ మరో సెంచరీ రికార్డు కొట్టాడు !
35
కోల్‌కతా పోరాటం.. ఫిన్ అలెన్ మెరుపులు
Image Credit : ANI

కోల్‌కతా పోరాటం.. ఫిన్ అలెన్ మెరుపులు

227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఫిన్ అలెన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. డేవిడ్ పేన్ వేసిన తొలి ఓవర్లోనే 4, 4, 6, 6, 4 బాదిన అలెన్ కేవలం 7 బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. అయితే హర్ష్ దూబే తెలివైన బంతితో అతడిని అవుట్ చేసి కేకేఆర్‌కు షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన రఘువంశీ 27 బంతుల్లోనే 52 పరుగులు చేసి వరుసగా రెండో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

45
ఉనద్కత్ స్పెల్.. కేకేఆర్ కు వరుస షాక్ లు
Image Credit : SRH\Instagram

ఉనద్కత్ స్పెల్.. కేకేఆర్ కు వరుస షాక్ లు

ఒకానొక దశలో కేకేఆర్ 11 ఓవర్లలో 120/3 తో బలంగా కనిపించింది. కానీ జయదేవ్ ఉనద్కత్ తన అనుభవంతో కోల్‌కతాను కోలుకోలేని దెబ్బ తీశాడు. అజింక్య రహానే (8) ను అవుట్ చేయడంతో పాటు కీలక సమయంలో వికెట్లు తీసి కేకేఆర్ పతనాన్ని శాసించాడు. కోల్‌కతా చివరి 7 వికెట్లను కేవలం 41 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. ఉనద్కత్ 3 వికెట్లతో చెలరేగగా, నితీష్, మలింగ చెరో రెండు వికెట్లు తీశారు.

55
హైదరాబాద్ సీజన్ తొలి విజయం
Image Credit : X@IPL

హైదరాబాద్ సీజన్ తొలి విజయం

చివరికి కోల్‌కతా 16 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌట్ కావడంతో హైదరాబాద్ 65 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఇదే తొలి విజయం. మరోవైపు కేకేఆర్ 2012 తర్వాత తొలిసారి సీజన్లో మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. పర్పుల్ క్యాప్ దక్కించుకున్న ఉనద్కత్, అనుభవం ఎప్పుడూ పనికివస్తుందని ఈ మ్యాచ్‌తో నిరూపించాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
హైదరాబాద్
Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup : విండీస్ పై సూపర్ విక్టరీ.. ఇండియా ఉమెన్స్ టీంను గెలిపించిన టాప్ అంశాలివే
Recommended image2
IND vs AFG Test Match : టీమిండియా దెబ్బకు అప్ఘాన్ ఆగమాగం.. గిల్ సేన గెలుపు వెనకున్న టాప్ 5 రీజన్స్ ఇవే
Recommended image3
SKY: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్ బై? సోషల్ మీడియాలో పోస్టులన్నీ డిలీట్.. ఏం జరుగుతోంది?
Related Stories
Recommended image1
Heinrich Klaasen : కాటేరమ్మ కొడుకు క్లాసెన్ మాస్ జాతర.. కేకేఆర్ పై ఆరెంజ్ ఆర్మీ అరాచకం
Recommended image2
Abhishek Sharma : సిక్సర్ల కింగ్ అభిషేక్.. శర్మ మరో సెంచరీ రికార్డు కొట్టాడు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved