MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • IPL, DC vs PBKS : క్రికెట్ గ్రౌండ్ లోకి అంబులెన్స్.. స్ట్రెచర్ పై స్టార్ బౌలర్.. అసలు ఏమయ్యింది..?

IPL, DC vs PBKS : క్రికెట్ గ్రౌండ్ లోకి అంబులెన్స్.. స్ట్రెచర్ పై స్టార్ బౌలర్.. అసలు ఏమయ్యింది..?

ఐపిఎల్ 2026 లో భాగంగా డిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య  మ్యాచ్ లో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ఓ ఆటగాడు తీవ్రంగా గాయపడటంతో మైదానంలోకి అంబులెన్స్ వచ్చింది. 

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 25 2026, 06:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
డిసి బౌలర్ కు తీవ్ర గాయం..
Image Credit : Gemini AI

డిసి బౌలర్ కు తీవ్ర గాయం..

Lungi Ngidi Injury : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 లో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా ఎవరైనా ప్లేయర్ గాయపడితే ఫిజియో వచ్చి ప్రథమచికిత్స అందిస్తారు... మరీ గాయం ఎక్కువైతే సదరు ప్లేయర్ ను వాళ్లే బయటకు తీసుకెళతారు. కానీ తాజాగా డిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అసాధారణమైన సీన్ కనిపించింది.. ఓ ప్లేయర్ గాయపడగా ఏకంగా మైదానంలోకి అంబులెన్స్ వచ్చింది. దీన్నిబట్టి ఆ ఆటగాడు ఏ స్థాయిలో గాయపడ్డాడో అర్థమవుతుంది. ఇంతకూ గాయపడింది ఎవరు..? ఈ ప్రమాదం ఎలా జరిగింది..? తెలుసుకుందాం.

23
గాయపడ్డ డిల్లీ క్యాపిటల్స్ బౌలర్ లుంగి ఎంగిడి...
Image Credit : X

గాయపడ్డ డిల్లీ క్యాపిటల్స్ బౌలర్ లుంగి ఎంగిడి...

ఐపిఎల్ లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 25, శనివారం) రెండు మ్యాచులు జరగాల్సి ఉంది. మొదటి మ్యాచ్ డిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మధ్యాహ్నమే ప్రారంభమయ్యింది. మొదట డిసి బ్యాటింగ్ చేయగా కెఎల్ రాహుల్ సూపర్ సెంచరీ (152 పరుగులు) బాదాడు... దీంతో ఏకంగా 264 పరుగులు చేసింది. 265 పరుగుల విజయలక్ష్యంతో పంజాబ్ బ్యాటింగ్ ప్రారంభించింది.

భారీ లక్ష్యచేధనలో పంజాబ్ దూకుడుగా ఆడుతుండగా డిల్లీ ప్లేయర్లు నిలువరించేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పంజాబ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య గాల్లోకి ఓ షాట్ ఆడగా వెనక్కి పరుగెడుతూ క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు లుంగి ఎంగిడి. అయితే అనుకోకుండా అతడు వెనక్కి పడిపోయాడు... శరీర బరువంతా మెడపై పడటంతో విలవిల్లాడిపోయాడు. ఇలా తీవ్రంగా గాయపడగా వెంటనే ఫిజియోలు వచ్చి పరిశీలించారు... గాయం తీవ్రంగా ఉండటంతో హాస్పిటల్ కు తరలించారు.

Related Articles

Related image1
IPL 2026: ఎవడ్రా బాబు వీడు.. గేల్ రికార్డ్ ఖతం.. బెంగళూరులో సాయి సుదర్శన్ శివతాండవం!
Related image2
IPL : ధోని టీమ్ కు భారంగా స్టార్ ఓపెనర్.. సీఎస్‌కే కొత్త కెప్టెన్‌గా సంజూ?
33
ప్రస్తుతం ఎంగిడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది..?
Image Credit : X (Twitter)

ప్రస్తుతం ఎంగిడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది..?

సౌతాఫ్రికన్ స్టార్ బౌలర్ లుంగి ఎంగిడి గాయం చాలా తీవ్రమైనదే అని మైదానంలో పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. అయితే అతడు ఫిజియోలు, డాక్టర్లతో మాట్లాడుతుండటం... తన గాయం, నొప్పి గురించి వివరించడం కనిపించింది. అంటే అతడు స్పృహలోనే ఉన్నట్లు అర్ధమవుతుంది. మెడ గాయం కావడంతోనే ముందుజాగ్రత్తగా అతడిని హాస్పిటల్ కు తరలించినట్లు స్పష్టమవుతోంది. మెడికల్ టెస్టుల తర్వాత ఎంగిడి గాయం తీవ్రత తెలుస్తుంది. అయితే ప్రాణాలకు ప్రమాదం కలిగేంత పెద్దగాయం కాదని మైదానంలో సీన్ ను బట్టి అర్థమవుతోంది.

అయితే డిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ఎంగిడి గాయంపై ఆందోళన వ్యక్తం చేసింది. అతడు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేసింది. డిసి పోస్ట్ కాస్త కంగారుపెట్టేలా ఉంది... ఈ ఐపిఎల్ ఇక అతడు ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది.

🙏🤞 pic.twitter.com/ubkcHHDwWm

— Delhi Capitals (@DelhiCapitals) April 25, 2026

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026: ఎవడ్రా బాబు వీడు.. గేల్ రికార్డ్ ఖతం.. బెంగళూరులో సాయి సుదర్శన్ శివతాండవం!
Recommended image2
Mumbai Indians : హార్దిక్‌కు షాక్.. ముంబైకి మళ్లీ రోహితే బాస్? రేసులో ఉన్న ఆ నలుగురు వీరే !
Recommended image3
Team India : 2027 వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియా రెడీ.. రోహిత్, కోహ్లీ ఉంటారా? ఆ ముగ్గురికి షాక్ !
Related Stories
Recommended image1
IPL 2026: ఎవడ్రా బాబు వీడు.. గేల్ రికార్డ్ ఖతం.. బెంగళూరులో సాయి సుదర్శన్ శివతాండవం!
Recommended image2
IPL : ధోని టీమ్ కు భారంగా స్టార్ ఓపెనర్.. సీఎస్‌కే కొత్త కెప్టెన్‌గా సంజూ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved